DAY 5 – SPOKEN ENGLISH
ఈరోజు మనం May, Might, Can, Could, Should, Must ల గురించి తెలునుకుందాం.
May
Might - - Used for Uncertainty
ఖచ్చితత్వం లేని వాటికి వాడుతాము.
Can
Could -- Used for ability
సామర్థ్యానికి గాను వాడతాము.
Should -- Used for Responsibility
బాధ్యతను తెలియచేయటానికి వాడతాము.
Must -- Used for Obligation
తప్పనిసరి అనే భావంలో వాడతాము.
ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం.
They may write homework
వారు Homework రాయొచ్చు.
They may not write Home work
వారు Homework రాయకపోవచ్చు
They can write Homework
వారు Homework రాయగలరు
They can't write Homework
వారు Homework రాయలేరు
('Could is past tense of "Can')
They could write Homework
వారు Homework రాయగలిగారు
They coudn't write Homework
వారు Homework రాయలేకపోయారు
They should write Homework
వారు Homework రాయాలి
They shouldn't write Homework
వారు Homework రాయకూడదు
They must write Homework
వారు Homework రాసి తీరాలి
ఇప్పుడు ఒక Homework example ని తీసుకొని I(1) Simple present tense నుంచి అన్ని Tenses లోకి Oral గా బయటకు చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో "Active Voice" యొక్క "Blind rules" ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
ఏ Tense లో అయినా అనగా I Present tense, II Past tense లేదా III Future tenses లలో 4 భాగాలు మాత్రమే ( అనగా 1, 2, 3, 4 ) ఉంటాయి.
2 అంటే ing form ని వాడాల్సిందే
4 అంటే ing form ని వాడాల్సిందే
3 అంటే V3 ని వాడాల్సిందే
అది I Present tense కానీ, II Past tense కానీ లేదా III Future tense కానీ పై విధంగా చేయాల్సిందే.
1 అంటే V1 అది I(1) మరియు III(1) లలో, ముందుగా చెప్పుకున్నట్లు English భాష మొత్తంలో V2 ని వాడేది కేవలం II(1) లో మాత్రమే. మరెక్కడా V2 ని వాడం.
బయటకు చెప్పేటప్పుడు Positive Sentence మాత్రమే కాదు. Negative Sentence కూడా చెప్పాలి.
ఈ రోజు
మీరు ఒక Work sheet ను complete చేయాలి. అందులో రకరకాల Sentences ఉంటాయి. అవి ఏ Tense లో ఉన్నాయో గుర్తించి ఆ Tense పేరు రాయాల్సి ఉంటుంది. |
మనం ఇప్పుడో కథని రాయడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కథ అంటే జరిగిపోయినదయి ఉంటుంది. అంటే II Past tense లో ఉంటుంది. మనకు II Past tense లో ఉన్న ఆ నాలుగు :
III (1) Simple past tense
II (2) Past continuous tense
II(3) Past perfect tense
II(4) Past perfect continuous tense లు వచ్చు.
కానీ మనం మాత్రం సాధారణంగా
II(1) Simple past tense మరియు
II(2) Past continuous tense లను మాత్రమే వాడతాము.
Note :- Oral గా బయటకు చెప్పేటప్పుడు కేవలం English sentences మాత్రమే చెప్పాలి. వాటి తెలుగు మీనింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప... తెలుగు మాట్లాడటానికి కాదు. మరి ఇన్ని రోజులు Home work లో ప్రతీ ఇంగ్లీష్ సెంటెన్స్ కి తెలుగు మీనింగ్ ఎందుకు రాసాము అంటే, ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ మీనింగ్ మనకు చక్కగా అర్థం కావటం కోసం మాత్రమే.
ఉదాహరణకు : I can't Solve కి
I couldn't Solve కి మధ్య ఉన్న తేడాను
They don't learn కి
They can’t learn కి మధ్య ఉన్న తేడాను
He didn't come కి
He couldn't come కి మధ్య గల తేడాను
She has completed కి
She had completed కి మధ్య గల తేడాను
ఇలా ఎన్నో విషయాలను చక్కగా అర్థం చేసుకోవటానికి మాత్రమే మనం తెలుగు మీద ఆధారపడుతున్నాం.
ఉదాహరణకు మనం అమెరికా వెళ్ళటానికి విమానం ఎక్కాలి. అందుకోసం ముందుగా బస్ లో ఎయిర్ పోర్ట్ కి వెళతాం. ముందుగా బస్ ఎక్కాం కదా అని, బస్ లో అమెరికా ఎలా వెళతారు ? అనే సందేహం ఎవరికైనా వస్తుందా? రాదు కదా....
అలాగే మనం ఈ Module I ద్వారా ముఖ్యమైన విషయాలన్నీ స్పష్టంగా అర్ధం చేసుకోవటానికి తెలుగు ఉపయోగపడుతుంది.
STORY ( కథ ) |
ఒక అడవిలో సింహం ఎలుక నివసిస్తూ ఉన్నాయి II(2). ఒక రోజు సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉంది. II(2). ఎలుక ఈ విషయాన్ని గమనించింది II(1). ఎలుక వెంటనే చెట్టెక్కి సింహం మీదకు దూకింది II(1) + II(1) . అది dance చేయటం మొదలు పెట్టింది II(l). ఎలుక dance వల్ల సింహం నిద్రలోంచి లేచింది II(1). సింహం ఎలుకను చంపటానికి పట్టుకుంది II(l). ఎలుక చాలా భయపడింది II(l). "నన్ను వదిలేయి, నేను నీకు భవిష్యత్తులో help చేస్తాను" అని ఎలుక సింహంతో అన్నది III(1) + II(1). సింహం నవ్వి ఎలుకను వదిలేసింది II(1) + II(1).
కొన్ని రోజుల తరువాత అడవిలోకి కొంతమంది వేటగాళ్ళు వచ్చారు II(1). వాళ్ళు రకరకాల ప్రదేశాలలో వలలను ఏర్పాటు చేసారు II(1). పొరపాటున సింహం ఒక వలలో చిక్కుకుంది II(1). అది బయటకు రావటానికి ప్రయత్నం చేసింది II(1). కానీ అది బయటకు రాలేకపోయింది Could not. అది అరవటం (roar) మొదలుపెట్టింది II(1). సింహం అరుపులు విన్న ఎలుక అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చింది II(1). 'భయపడకు, నేను నీకు help చేస్తాను" అని అన్నది III(1) + II(1). అది తన పదునైన పళ్ళతో వలను damage చేసింది II(1). దానితో సింహం వలలోంచి బయటపడింది II(1). సింహం, ఎలుక అక్కడి నుండి పారిపోయాయి II(1). రెండు మంచి స్నేహితులు అయ్యాయి II(l).
కొద్దిసేపటి తరువాత వేటగాళ్ళు వచ్చి damage అయిన Net చూసి sad గా feel అయి వెళ్ళిపోయారు II(1) + II(I) + II(I).
ఈ రోజు
Can, Can't
May, Could Work sheets ను complete చేయండి. |
WRITE THE TENSE NAME OF THE BELOW SENTENCES
- He will learn English
- They have helped me
- He was committing mistake
- I use pencils
- She will answer all questions
- Teachers encourage students
- They gathered more information
- Kalyan gave me money
- Manager doesn’t take bride
- My sister is preparing meals
- Students will have completed H.W.
- We will not discuss unnecessary things
- Ramu and Gopal were writing examples
- Conductors don’ts give change to passengers
- They will demolish this house
- I wasted money
- They had requested her
18. I saw an accident
- Dhoni has to do century
- Workers are demanding salary
- You will not believe them
- Lavanya has been writing exam
- I did not meet Lavanya
- They will understand my problem
- Sir has given four examples
- You will follow rules
- Maths teacher announced results
- Ravi is helping me now
- He has troubled them
- I respect elders
- You will do this work
- Parents love children
- Our school conducts games
- She has Insulted clerks
- Pravallika cheated me
- They will invite him
- Sita encouraged students
- I am questioning him
- They have served Tea
- My friends were watching T.V.
- I don’t solve your problem
- She accepts responsibility
- Police will arrest
- You have been following
- They will not be going
- She has been writing
- Teacher wants to conduct exam
- Teacher wanted to conduct exam
- Police will arrest them
- You were watching T.V.
- She will have been enjoying
- The had asked questions
- I did not receive letters
- Sita doesn’t want to write exam
- It is working
- I was playing
- She wrote a novel
- Workers will not come.
- My uncle supports me
- He escaped from the prison
మన సామర్థ్యాన్ని తెలియజేసే పనులకు Can ను ఉపయోగించాలి.
1 | నేను English లో మాట్లాడగలను |
2 | నేను English లో రాయగలను |
3 | నేను ఆ పని చేయగలను |
4 | నేను Hindi అర్థం చేసుకోగలను |
5 | నేను మీ సమస్యను అర్థం చేసుకోగలను |
6 | నేను Telugu చదవగలను |
7 | నేను ఏ పనైనా చేయగలను |
8 | నేను దేనినైనా సాధించగలను |
9 | ఆమె బాగా పాడగలదు |
10 | వారు ఇక్కడికి రాగలరు |
11 | నేను రేపు అక్కడకు వెళ్లగలను |
12 | నేను నీ అడ్రస్ తెసుసుకోగలను |
13 | వారు కష్టపడి పని చేయగలరు |
14 | మా Father car drive చేయగలరు |
15 | నేను pictures draw చేయగలను |
16 | నేను తప్పులు లేకుండా రాయగలను |
17 | నేను మా Friend కి help చేయగలను |
18 | మా బ్రదర్ cricket ఆడగలడు |
19 | మా parents English అర్థం చేసుకోగలరు |
20 | నేను చెట్లు ఎక్కగలను |
21 | వారు ఈ problem ని solve చేయగలరు |
22 | ఆమె ఒంటరిగా వెళ్లగలదు |
23 | Rahul ఈ పని చేయగలడు |
24 | Dogs మన ఫీలింగ్స్ అర్థం చేసుకోగలవు |
25 | నేను chess ఆడగలను |
26 | Rahul ఒంటరిగా వెళ్లగలడు |
27 | Govt. అందరికీ jobs ఇవ్వగలదు |
28 | Students Home work చేయగలదు |
29 | నేను కొత్త విషయాలు త్వరగా నేర్చుకోగలను |
30 | Sita ఈ poem రాయగలదు |
చేయలేని పనులకు Can Not ను ఉపయోగించాలి
1 | నేను రాయలేను |
2 | ఆమె English లో మాట్లాడలేదు |
3 | మేము పాడలేము |
4 | నీవు చూడలేవు |
5 | వారు ఆ పని చేయలేరు |
6 | నేను ఒంటరిగా వెళ్ళలేను |
7 | నేను నీలా మాట్లాడలేను |
8 | నేను నీకు Help చేయలేను |
9 | నీవు నా సమస్యను అర్ధం చేసుకోలేవు |
10 | నేను Hard work చేయలేను |
11 | నేను రేపు ఇక్కడకు రాలేను |
12 | వారు చిన్న పని కూడా చేయలేరు |
13 | నేను English లో leave letter రాయలేను |
14 | నేను ఇప్పుడు నీకేమీ చెప్పలేను |
15 | నేను ఈ రోజు class కి attend కాలేను. |
16 | నేను English రాయగలను. కానీ మాట్లాడలేను |
17 | నేను నీలాగా అబద్దాలు ఆడలేను |
18 | నేను నీ ప్రవర్తనని మార్చలేను. |
19 | వాళ్ళు నా problem ని solve చేయలేరు |
20 | ఆమె No.1 place కి చేరుకోలేదు. |
21 | మేము ఈ Place కొనలేము |
22 | Congress, T.D.Pని ఓడించలేదు |
23 | T.D.P. Congressని ఓడించలేదు |
24 | నేను నిన్ను నమ్మలేను. |
25 | ఆమె నా Help మర్చిపోలేదు |
26 | Krishna Hindi లో రాయలేడు |
27 | నేను వాళ్ళని Support చేయలేను |
28 | వాళ్ళు 1 Hour లో ఇక్కడికి రాలేరు |
29 | మనం ఈ స్థలం కొనలేము |
30 | Ramu Degree పాస్ కాలేడు |
ఖచ్చితత్వం లేని పనులకు May ను ఉపయోగించాలి
1 | Principal రేపు Holiday declare చేయొచ్చు |
2 | వాళ్ళు రేపు class కి రావచ్చు |
3 | Congress తెలంగాణ ఇవ్వవచ్చు |
4 | Next election లో TDP గెలవొచ్చు |
5 | Next match లో Sachin ఆడొచ్చు |
6 | Chiranjeevi 151 వ సినిమాలో నటించొచ్చు |
7 | Krishna రేపు Interview కి వెళ్ళొచ్చు |
8 | సీత వాళ్ళ బావని పెళ్ళి చేసుకోకపోవచ్చు |
9 | Bank Loan sanction చేయొచ్చు |
10 | Ravi Exam కి attend కావచ్చు |
11 | ఆమె నిన్ను నమ్మకపోవచ్చు |
12 | మనం ఈ రోజు మ్యాచులో గెలవచ్చు |
13 | America Afghanistan మీద బాంబులు వదలొచ్చు |
14 | అతను ఈ problem ని solve చేయొచ్చు |
15 | Maths sir Class కి రాకపోవచ్చు |
16 | Manager Bhaskar ని insult చెయ్యుచ్చు |
17 | M.D. Interview చేయకపోవచ్చు |
18 | Universiyt Results announce చేయొచ్చు |
19 | వాళ్ళు పార్టీ arrange చేయొచ్చు |
20 | Kumar ఈ proposal ని accept చేయొచ్చు |
21 | ఈ Match లో సచిన్ century చేయొచ్చు |
22 | Govt. RTC ని privatize చేయొచ్చు |
23 | ఆమె Inter లో MPC తీసుకోవచ్చు |
24 | మా brother 10th class 1st class లో పాస్ కావొచ్చు |
25 | Students అన్ని Questions కి answers చేయొచ్చు |
26 | Workers ఎక్కువ Salary కై demand చేయొచ్చు |
27 | RTC bus ని cancel చేయకపోవచ్చు. |
28 | వారు ఈ problem ని అర్థం చేసుకోవచ్చు |
29 | వారు పెళ్లికి రాకపోవచ్చు |
30 | అతను political party పెట్టొచ్చు |
గతంలో చేయగలిగిన పనులకు could ను ఉపయోగించాలి
1 | వాడు నిన్న MLA ని కలవగలిగాడు |
2 | నేను నిన్న right time కి reach కాలేకపోయాను |
3 | ఆమె 2 months లో English నేర్చుకోగలిగినది |
4 | వాళ్ళు 100% score చేయగలిగారు |
5 | మా అబ్బాయి swimming నేర్చుకోగలిగారు |
6 | Bhaskar ఆ Interview లో success కాలేకపోయాడు |
7 | నేను నా కళ్ళను నమ్మలేకపోయాను |
8 | మేము last year ఆ స్థలం కొనలేకపోయాం |
9 | ఆమె నిన్న Exam కి attend కాగలిగింది |
10 | ఈ coaching లో మేము ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాము. |
11 | మా Friend one lakh save చేయలేకపోయాడు |
12 | Police ఆ దొంగను పట్టుకోలేకపోయాడు |
13 | Ravi ఆ window ని Open చేయగలిగాడు |
14 | నేను నవ్వలేకపోయాను |
15 | Students ఆ Game లో participate చేయగలిగారు |
16 | Manager MD ని satisfy చేయలేకపోయాడు |
17 | వారు సినిమాని release చేయలేకపోయారు |
18 | నేను అన్ని points ని గుర్తుపెట్టకోలేకపోయాను |
19 | నేను వారిని చేరుకోగలిగాను |
20 | మేము అన్ని topics ని అర్థం చేసుకోగలిగాము |
21 | నేను sarala ని కలవలేకపోయాను |
22 | మా brother life లో settle కాలేకపోయాడు |
23 | ఆ Hero nice గా dance చేయలేకపోయాడు |
24 | నేను వారి ముందు అబద్దం చెప్పలేకపోయాను |
25 | ఆమె stage మీద పాడగలిగింది |
26 | Workers management ని force చేయలేకపోయాను |
27 | Kumar ఆ problem ని face చేయలేకపోయాడు |
28 | నేను వారి ప్రశ్నలకు answer చేయలేకపోయాను |
29 | వాడు నిన్న ఒంటరిగా వెళ్లగలిగాడు |
30 | ఆమె results announce చేయలేకపోయింది |
ఈ కోర్పు మనకి అందిస్తున్న వారు: J.V. RAMANA RAJU & R.P. BANDHAVI
గమనిక: స్వయంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ కి వెళ్ళలేని వారి కోసం అదే పద్దతిలో ఈ కోర్సును రూపొందించాం. అందువల్ల మీ ద్వారా ఇంకో నలుగురు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే... మీరు తప్పనిసరిగా ఈ లింక్ ను ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు, WHATSAPP గ్రూపుల్లో కూడా షేర్ చేయగలరు.