DAY – 6 (SPOKEN ENGLISH)

Note :- ఈరోజు నుంచి మీరు తప్పనిసరిగా Diary రాయటం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా Diary లో ఆ రోజు జరిగిన విషయాలను రాస్తాము. అందుకు గాను మనకు

II(1) Simple Past tense

మరియు

II(2) Past Continuous tense లు ఉపయోగపడతాయి. 30 రోజుల ఈ course పూర్తయ్యేసరికి 25 రోజుల Diary మీ దగ్గర ఉండాలి. సరేనా !

మనం ఈ రోజు పూర్తిగా Spoken మీద Concentrate చేయాలి. కేవలం రాస్తూ చదువుతూ వెళితే అర్థం అవుతుంది కాని, మాట్లాడేటప్పుడు తడబాటు వస్తుంది. అది పోవాలంటే ప్రతీ రోజు కొంతసేపు Spoken practice చేయాలి. అందులో భాగంగా ఈ రోజు Active voice Spoken practice చేద్దాం! అందుకుగాను ఒక Active voice example sentence ను I(1) Simple present tense లో తీసుకొని మిగిలిన Tenses లోనికి అనగా III(4) Future perfect continuous tense వరకు, Positive మరియు Negative బయటకు  చెప్పాలి.

అందుకుగాను ఒకసారి Active యొక్క Blind rules ని మననం చేసుకోండి. బట్టీ పట్టినట్లుగా కాకుండా పూర్తి అవగాహనతో బయటకు చదవాలి సుమా! ఒకవేళ పూర్తి పట్టు రానట్లయితే మరో రెండు మూడు రోజుల పాటు Active voice Homework చేయండి.

Spoken Practice కోసం example Active voice sentences.

I(1) They conduct exams

They don't conduct exams

I(1) You deposit money

You don't deposit money

I(1) I play Cricket

I don't play Cricket

I(1) He saves money

He doesn't save money

I(1) She announces results

She doesn't announce results

ఇలా ప్రతి రోజు కొద్దిసేపు బయటకు Practice చేయటం అనేది లేనట్లయితే రాయటం మీద మాత్రమే పట్టు లభిస్తుంది. కాని మాట్లాడటానికి నోరు సహకరించదు. మనం అరటిపండు తినేటప్పుడు నోరు ఒకలాగా వ్యవహరిస్తుంది. గట్టి పదార్ధాలు తినేటప్పుడు మరోలాగా వ్యవహరిస్తుంది. కారణం ఏమిటంటే నోటికి మొదటి నుండి మనం అలా అలవాటు చేసాం.

ఇక ఇంగ్లీష్ మాట్లాడటం అనే విషయానికి వస్తే మొదటి నుండి నోటికి ఆ practice లేదు. కాబట్టి ఇక నుంచి ఆ విధమైన practice ని చేయటం అవసరం. ఏ Homework ని అయితే రాస్తూ ఉంటారో వాటిని బయటకు చదవటం అనేది అవసరం. ఈ రోజు Active voice ని బయటకు చదవటం మీద శ్రద్ధ పెట్టండి.