Day – 7( SPOKEN ENGLISH)
ఈ 5 రోజులు Active voice Homework చేసిన తరువాత మీరు ఎలా ఉండాలంటే, ఒక I(1) Simple Present tense example sentence ను tenses లోకి స్వంతంగా రాయగలిగేటట్లు మరియు బయటకు చెప్పగలిగేటట్లు ఉండాలి.
News paper లోని రకరకాల Text books, Novels, Story books లోని Sentences ని చూసి ఇది ఫలానా tense అని చెప్పగలిగే పరిస్థితి రావాలి. మీకు ఏదైనా sentence ఫలానా tense లో ఉంది అని తెలియటమే కాకుండా అదే sentence ను వేరే ఏ Tense లోనికి అయినా మార్చగలిగే సామర్ధ్యం వచ్చి ఉండాలి.
పై విధంగా మీకు Active Voice లో సామర్ధ్యం వచ్చాక మాత్రమే ఈ రోజు మనం చెప్పుకోబోయే "PASSIVE VOICE" es's enter కావాల్సి ఉంటుంది. O.K..!
ఇప్పుడు మనం ముందుగా Passive Voice Table చూద్దాం !
HOME WORK
You follow Rules
మీరు 'R' 'F' అవుతారు
Rules are followed by me
'R' మీ చేత "F" కాబడతాయి
They conduct Exams
వారు 'E' 'C' చేస్తారు
Exams are conducted by them
'E' వారి చేత "C" చేయబడతాయి
I announce Results
నేను "R" “A చేస్తాను
Results are announced by me
'R' నా చేత 'A' చేయబడతాయి
He plays Chess
అతను "C" ఆడతాడు
Chess is played by him
"C" అతని చేత ఆడబడుతుంది
Passive Voice అంటే ఏంటో చూద్దాం. ఒక తెలుగు సెంటెన్స్ ను అర్ధం మారకుండా వెనుక నుండి తిప్పి చెప్పడాన్నే లేదా రాయటాన్నే Passive Voice అంటాం.
ఉదాహరణకు
AV > నేను cricket ఆడతాను
PV > Cricket నా చేత ఆడబడుతుంది.
AV > వారు ఇప్పుడు Home Work రాస్తూ ఉన్నారు
PV > Home Work ఇప్పుడు వారిచేత రాయబడుతూ ఉంది
AV > అతను ఇంతకుముందే మనీ DepoSit చేశాడు
PV > Money ఇంతకుముందే అతని చేత Deposit చేయబడింది.
AV > ఆమె నిన్న Letters Post చేసింది.
PV > Letters నిన్న ఆమె చేత Post చేయబడ్డాయి.
AV > అతను అప్పుడు TV చూస్తూ ఉన్నాడు.
PV > T.V. అప్పుడు అతని చేత చూడబడుతూ ఉంది.
AV > Manager అంతకుముందే Clerk ని suspend చేశాడు
PV > Clerk అంతకుముందే Manager చేత Suspend చేయబడ్డాడు.
AV > వారు రేపు Results declare చేస్తారు.
PV > Results రేపు వారి చేత declare చేయబడతాయి.
AV > ఆమె అంతకుముందే వారిని కలిసి ఉంటారు
PV > వారు అంతకుముందే ఆమె చేత కలవబడి ఉంటారు.
ఇప్పటి వరకు మనం Active Voice లో Positive మరియు Negative Sentences ను పక్క పక్కన రాసాము. ఇక నుండి Homework లో Active Voice, Passive Voice sentences ను పక్కపక్కన రాయాల్సి ఉంటుంది.
ముందుగా చెప్పుకున్నట్లు ప్రపంచంలో ఏదైనా I. We, You. They, He, She, It లలో మాత్రమే ఉంటాయి. అదే విధంగా Passive Voice లో కూడా అన్ని I, We, You, They, He, She, It లలో ఉంటాయి. Homework ఎలా చేయాలో Sample Homework రూపంలో చూడండి.
ఈ రోజు మీరు Diary రాసారా
ఈ రోజు
III (1) Simple Future Tense
III (2) Future Continuous Tense
(3) Future Perfect Tense
(4) Future Perfect Continuous Tense
Work sheets ను complete చేయండి.
HOME WORK
-- I --
1) They post letters
వారు 'L' 'P' చేస్తారు.
2) They are posting letters now
వారు ఇప్పుడు 'L' 'P' చేసూ ఉన్నారు.
3) They have posted letters just before
వారు ఇంతకుముందే 'L' 'P' చేశారు.
4) They have been posting letters
వారు 'L' 'P' చేస్తూనే ఉన్నారు.
- I -
1) Letters are posted by them
'L వారి చేత 'P' చేయబడతాయి.
2) Letters are being posted by them now
'L' ఇప్పుడు వారి చేత 'P' చేయబడుతున్నాయి.
3) Letters have been posted by them just before
'L ఇంతకుముందే వారి చేత 'P' చేయబడ్డాయి.
4) ----
II -
1) They posted letters
వారు L.Y. LP చేశారు
2) They were posting letters at that time
వారు అప్పుడు 'L' 'P' చేసూ ఉన్నారు.
3) They had posted letters before that
వారు అంతకుముందే 'L' 'P' చేశారు.
4) They had been posting letters at that time
వారు అప్పుడు 'L' 'P' చేస్తూనే ఉన్నారు.
II
1) Letters were posted by them L.Y.
L వారి చేత L.Y లో 'P' చేయబడ్డాయి.
2)Letters were being posted by them at that time
'L అప్పుడు వారి చేత 'P' చేయబడుతూ ఉన్నాయి.
3)Letters had been posted by them before that
'L' అంతకుముందే వారిచేత 'P' చేయబడినాయి.
4) -----
III
1) They will post letters tomorrow
వారు రేపు 'L' 'P' చేస్తారు.
2) They will be posting letters at that time
వారు అప్పుడు 'L' 'P' చేస్తూ ఉంటారు.
3) They will have posted letters before that.
వారు అంతకుముందే 'L' 'P' చేసి ఉంటారు.
4) They will have been posting letters at that time
వారు అప్పుడు 'L' 'P' చేస్తూనే ఉంటారు.
III
1) Letters will be posted by them tomorrow
'L రేపు వారి చేత 'P' చేయబడతాయి.
2) -------
3) Letters will have been posted by them before that
'L' అంతకుముందే వారి చేత 'P' చేయబడి ఉంటాయి.
భవిష్యత్తులో జరుగుతాయనే పనులకు ( I (1) ను ఉపయోగించాలి
- వాళ్ళు రేపు Bank లో Money deposit చేస్తారు
- Next Year నేను Bangalore shift అవుతాను
- వారు Next month లో car కొంటారు
- నేను ఆ Interview కి Next week లో వెళతాను
- Next Year D.Sc., announce చేస్తుంది
- Next Election లో TDP గెలుస్తుంది
- మా Brother Next Month America నుంచి వస్తాడు
- నేను నిన్ను koti bus stop లో కలుస్తాను
- వాళ్ళు రేపు నిజం తెలుసుకుంటారు
- ఆమె రేపు నీకు Phone చేస్తుంది
- Students Next week లో picnic కి వెళతారు
- Principal రేపు Exam conduct చేస్తాడు
- Sachin next match లో ఆడతాడు
- M. రేపు Delhi నుంచి వస్తాడు
- వాళ్ళు రేపు నిన్ను ఆ Party కి Invite చేస్తారు
- నేను next month లో Eamcet coaching తీసుకుంటా
- Bank రేపు Loan sanction చేస్తుంది
- మేము లో Ooty వెళతాము
- Manager రేపు ఈ Problem ని solve చేస్తాడు
- నేను నీకు Future లో help చేస్తాను.
- భవిష్యత్తులో Chirnjeevi cinemaల్లో act చేస్తాడు
- నేను రేపు Exam బాగా రాస్తాను
- Snageetha next month వెళుతుంది
- Workers రేపు strike చేస్తారు
- నేను నీ problem ని solve చేస్తాను.
- మా Friend రేపు Kakinada వెళతాడు
- Matsh sir రేపు marks declare చేస్తాడు
- నేను రేపు Home work neat గా రాస్తాను
- మా sister రేపు cinema కి వెళ్తుంది
- Praveen రేపు meeting లో speech ఇస్తాడు.
భవిష్యత్తులో జరుగుతూ ఉంటాయనుకునే పనులకు III(2) ను ఉపయోగించాలి
- రేపు నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను.
- మా తమ్ముడు 10 గంటలప్పుడు పరీక్ష రాసూ ఉంటాడు.
- ఆ టైంలో వారు చర్చిసూ ఉంటారు.
- ఆమె అప్పుడు నిద్ర పోతూ ఉంటుంది
- మా అమ్మ అప్పుడు మా లంచ్ బాక్సులు అరేంజ్ చేస్తూ ఉంటుంది
- సార్ అప్పుడు లెసన్ టీచ్ చేస్తూ ఉంటారు
- వచ్చే సమ్మర్ లో మేము ఊటీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాము
- వచ్చే సంవత్సరం ఈ రోజుల్లో మా పిల్లలు హైదరాబాద్ లో చదువుతూ ఉంటారు
- రేపు ఈపాటికి వర్కర్స్ సమ్మె చేస్తూ ఉంటారు
- రేపు క్లాసులో రాహుల్ అందరికీ చాక్లెట్స్ పంచుతూ ఉంటాడు
- Manager రేపు కరీంనగర్ Office ని check చేస్తూ ఉంటాడు
- వారు రేపు 11 గంటలప్పుడు మనీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తూ ఉంటారు
- వచ్చే సంవత్సరం కూడా బీజేపీ పాలిస్తూ ఉంటుంది
- వచ్చే నెలలో నేను అన్ని ప్లేసెస్ విజిట్ చేస్తూ ఉంటాను
- రేపు ఈ టైమ్ కి మా ఫ్రెండ్ రాజీనామా చేస్తూ ఉంటాడు
- ఆమె రేపు సాయంత్రం 4 గంటలప్పుడు రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది.
- అతను అప్పుడు రిజల్ట్స్ ప్రకటిస్తూ ఉంటాడు
- వచ్చే సంవత్సరం నేను అందరికీ సాయం చేస్తూ ఉంటాను
- రేపు 10 గంటలకు మీటింగ్ లో ఎండీ అందరినీ వివరాలు అడుగుతూ ఉంటారు
- రేపు లీజర్ పీరియడ్ లో పిల్లలు బొమ్మలు గీస్తూ ఉంటారు
- నేను 10 గం. అప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటాను
- మా తమ్ముడు రేపు ఆ కంపెనీలో జాయినింగ్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు
- రేపు మధ్యాహ్నం అప్పుడు వారు పిల్లలతో ఆడుతూ ఉంటారు
- వచ్చే సంవతత్సరం ఈ రోజుల్లో టీఆర్ఎస్ పాలిస్తూ ఉంటుంది
- రేపు ఉదయం 9 గంటలస్పుడు ఎగ్జామినర్ పరీక్ష పేపర్లు పంచుతూ ఉంటుంది
- మేనేజర్, క్లర్క్ ని రిలీవ్ చేస్తూ ఉంటాడు
- నేను రేపు రాత్రి 8.30 గంటల అప్పుడు మొగలి రేకు సీరియల్ చూస్తూ ఉంటాను
- నేను రేపు 9.30 గంటలప్పుడు వీ6 లో తీన్మార్ చూస్తూ ఉంటాము
- వారు రేపు ఈ పుస్తకాన్ని ప్రింట్ చేస్తూ ఉంటారు
- ఆమె రేపు 10 గంటలప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది.
భవిష్యత్తులోని ఒక సంఘటనతో పోలిస్తే అంతకుముందే జరిగిఉంటాయనుకునే పనులకు III(3) ని ఉపయోగించాలి.
- రేపు 10 గంటలకంటే ముందే ఆమె హైదరాబాద్ చేరుకుని ఉంటుంది.
- రేపు ఆమె కిషోర్ కంటే ముందే ఆఫీసుకు చేరుకుంటుంది.
- వారు ఆగసు చివరికల్లా పెళ్ళి చేసుకుని ఉంటారు.
- మా అమ్మాయి జూన్ లోపు తన వర్క్ పూర్తి చేసి ఉంటుంది.
- నేను రేపు 4 గంటలకంటే ముందే వారిని కలసి ఉంటాను
- మా అమ్మాయి జూన్ లోపు తన వర్క్ ను పూర్తి చేసి ఉంటుంది
- కుమార్ రేపు 9 గంటల కంటే ముందే పరీక్ష హాల్ లో నుంచి బయటకు వచ్చేసి ఉంటాడు.
- శ్రీలత ఈ సమస్యని మార్చి లోపు పరిష్కరించి ఉంటుంది.
- నేను రేపు 10 గంటల కంటే ముందే ఆ పెళ్ళి అటెండ్ అయి ఉంటాను.
- చరణ్ రేపు 4 గంటల కంటే ముందే ఆ పెళ్ళికి అటెండ్ అయి ఉంటాను
- శ్రీను రేపు ఆ సమయం వరకు నిన్ను కలసి ఉంటాడు
- వచ్చే సంవత్సరం మార్చి కల్లా వారు కారు కొని ఉంటారు
- రేపు 12 గంటల కంటే ముందే నేను మా అబ్బాయిని స్కూల్ లో చేర్చి ఉంటాను.
- రేపు ఈ సమయానికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు.
- మా అబ్బాయి వచ్చే సంవత్సరం జులై కల్లా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉంటాడు.
భవిష్యత్తులో జరుగుతూనే ఉంటాయనుకునే పనులకు III (4)ని ఉపయోగించాలి
- నేను రేపు 12 అప్పుడు సినిమా చూస్తూనే ఉంటాను.
- వారు అప్పుడు పరీక్ష రాస్తూనే ఉంటారు.
- నేను అప్పడు క్రికెట్ ఆడుతూనే ఉంటాను .
- వారు అప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు.
- ఆమె అప్పుడు చదువుతూనే ఉంటుంది.
- శేషు అప్పడు పాడుతూనే ఉంటాడు.
- నేను అప్పుడు ప్రయాణిసూనే ఉంటాను.
- ఆమె రేపు 10 గంటలప్పుడు టైపు చేస్తూనే ఉంటుంది.
- సూర్య రేపు 4 గంటలప్పుడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు.
- వారు అప్పడు ప్రయత్నిస్తూనే ఉంటారు.
- నేను రేపు మద్యాహ్నం కూడా క్లాస్ తీసుకుంటూనే ఉంటాను.
- ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ రేపు సాయంత్రం కూడా బ్యాటింగ్ చేస్తూనే ఉంటారు.
- వారు అప్పుడు ఫైల్స్ చెక్ చేస్తూనే ఉంటారు.
- ఎమ్.డి. అప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాడు.
- కాంగ్రెస్ అప్పుడు తెలంగాణ గురించి డిస్కస్ చేస్తూనే ఉంటుంది.