DAY 8 ( SPOKEN ENGLISH )
ఇప్పుడు మనం Want to, Don’t want to, Wanted to, Didn’t want to లను తెలుసుకుందాం.
తినా
కొనా
రావా (లనుకుంటున్నాను)
పోవా
మాట్లాడా
చేయా
అలా ఎన్నో సెంటెన్స్ లను చేప్పుకోవచ్చు.
Deposit చేయాలనుకుంటున్నారు.
Save చేయాలనుకుంటున్నారు.
అడగాలనుకున్నాను.
ఇవ్వాలనుకున్నాను
పాడాలనుకుంటున్నది మొదలగునవి.
అలా ఎన్నో Sentences ను మనం చెప్పుకోవచ్చు. తెలుగులో Sentences చివరను బట్టి మాత్రమే మనం ఒక నిర్ణయానికి రాగలం.
ఉదాహరణకు:
నేను Homework చేస్తాను
నేను Homework చేయగలను
నేను Homework చేయాలి
నేను Homework చేయగలిగాను
నేను Homework చేసి తీరాలి
నేను నిన్న Cricket ఆడాలనుకున్నాను. I want to play Cricket
నేను Cricket ఆడాలనుకోవడం లేదు. I don’t wan’t to play Cricket
Note :- V1 వాడాల్సి ఉంటుంది I (1)
నేను నిన్న Cricket ఆడాలనుకున్నాను. I wanted to play Cricket
నేను ‘C’ ఆడాలనుకోలేదు I didn't want to play cricket
Note :- V2 ను వాడాల్సి ఉంటుంది II(1)
A.V. They encourage students
వారు "S' ని "E" చేస్తారు.
He deposits money
అతను 'M' 'D' చేస్తాడు.
You create problems
మీరు 'P' 'C' చేస్తారు.
I Support Sarala
నేను 'S' ని 'S' చేస్తాను.
HOME WORK
PV Students are encouraged by them
'S' వారి చేత 'E' చేయబడతారు.
Money is deposited by him
‘M’ అతని చేత 'D' చేయబడుతుంది.
Problems are created by you
'P' మీ చేత ‘C’ చేయబడతాయి.
Sarala is supported by me
'S' నా చేత 'S' చేయబడుతుంది.
Active Voice వేరు Passive Voice వేరు.ఈ పాటికి మీకు Active Voice వచ్చి ఉండాలి. ప్రతీ Sentence ను కూడా Active voice లో మరియు వెంటనే Passive voice లో రాయాలి. పొరపాటున Active voice రాసేటప్పుడు Passive voice చూడకూడదు.
Active voice rules వేరు, Passive voice rules వేరు.
ఇప్పటికైనా సరే....
Active voice లో అనుమానం ఉంటే మొదటిరోజు చెప్పిన "Active voice" structure ను పరిశీలించండి. Active voice blind rules ను మరొక్కసారి చదవండి.
Passive voice rules కోసమై Passive voice మీద depend అవండి.
Note :- Passive voice లో ఎప్పుడూ కూడా V3 i.e. Verb యొక్క మూడవ రూపం మాత్రమే వస్తుంది. ఇదే Passive voice యొక్క blind rule.
Ex:- Written, Seen, Done, Sung, Known etc.
ఈ రోజు మీరు Diary రాసారా?
ఈ రోజు
Want to, Don't Want to, Wanted to Work sheets ను complete చేయండి.
COMBINATIONS
1) నేను నీ problems ని అర్థం చేసుకోగలను. కానీ నీకు help చేయలేను. Can + Can't
2) మా తమ్ముడు నిన్న M.P ని కలిసాడు.
మా town లోని సమస్యలను వివరించాడు.
Next week M.P. మా town కి రావచ్చు.
మేము మా roads ని, drainages ని తనకి చూపిస్తాం
II(1) + II(1) + May + III(1)
3) చాలా కష్టం మీద వాళ్ళు నిన్నటి match లో గెలవగలిగారు. Rahul 70 runs చేసాడు, Two wickets తీసాడు. Could + II(1) + II(1)
4)పిల్లలు ఇప్పుడు Anuual day కోసం dance practice చేస్తున్నారు. వాళ్ళు చాలా బాగా perform చేయాలనుకుంటున్నారు. Practice కోసం వాళ్ళు Sunday కూడా school కి రావాలి.
I(2) + Want to + Have to
5) Lavanya ని Kishore ఇష్టపడ్డాడు కాబట్టి ఆమెకి letter ఇచ్చాడు.
II(1) + II(1)
6) Kishore letter తీసుకున్న Lavanya దాన్ని ముక్కలుగా చించేసింది. కాబట్టి Kishore Hussain sagar లోకి jump చేసాడు. II(1) + II(1)
7) ఎవరో ఈ విషయాన్ని చూసి పోలీసులకు Inform చేసారు. దానితో పోలీసులు అతన్ని Save చేసారు.
II(1) + II(1)
8) Relatives help వల్ల Ramu తన economic problems నుండి బయటపడగలిగాడు. కాబట్టి తను
కూడా future లో వాళ్ళకి help చేయాలనుకుంటున్నాడు.
Could + Want to
9) Sita music నేర్చుకుంటుంది. ప్రస్తుతం తను music లో చాలా knowledge పొందింది. ఇప్పుడు తను stage shows ఇవ్వాలనుకుంటున్నాడు.
I(1) + II(1) + Wants to
10) Principal రేపు holidays declare చేయొచ్చు. ఈరోజే తను declare చేయాలనుకుంది. కాని ఆమె తన decision మార్చుకుంది. ఆమె రెండు రోజులు holidays ఇవ్వాలనుకుంటుంది.
May + Wanted to + II(1) + Wants to
మనం చేయాలనుకుంటూ ఉన్నపనులకు Want to ఉపయోగించాలి
- నేను English నేర్చుకోవాలనుకుంటున్నాను.
- Latha తన బావని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది.
- వాళ్ళు దేవుణ్ణి నమ్మాలనుకుంటున్నారు.
- వారు Students ని Picnic కి తీసుకువెళ్లాలనుకుంటున్నారు.
- నేను నీ Problem ని అర్ధం చేసుకోవాలనుకుంటున్నాను.
- Sachin Next Worldcup లో ఆడాలనుకుంటున్నాడు.
- Maths Sir రేపు Test conduct చేయాలనుకుంటున్నారు.
- అతను doubts అడగాలనుకుంటున్నాడు.
- నేను నీకు good news చెప్పాలనుకుంటున్నాను.
- M.D. ఈ problem ని solve చేయాలనుకుంటున్నాడు.
- Sir. Students ని encourage చేయాలనుకుంటున్నాడు.
- మీరు Homework చేయాలనుకుంటున్నారు.
- అతను Money సంపాదించాలనుకుంటున్నాడు.
- మా Father ఈ Land కొనాలనుకుంటున్నారు.
- Ravali Exhibition కి వెళ్ళాలనుకుంటుంది.
- వాళ్ళు Rules follow కావాలనుకుంటున్నారు.
- Workers salary demand చేయాలనుకుంటున్నారు.
- నేను ఎక్కువగా Home work ఇవ్వాలనుకుంటున్నాను.
- మా Mother doctor ని Consult కావాలనుకుంటుంది.
- నేను early గా లేవాలనుకుంటున్నాను.
- ఆమె Computers నేర్చుకోవాలనుకుంటుంది.
- వాళ్ళు తమ Village కి తిరిగి రావాలనుకుంటున్నారు.
- Doctors వెంటనే Operation conduct చేయాలనుకుంటున్నారు.
- వాళ్ళు నీకొక good news చేప్పాలనుకుంటున్నారు.
- ముందు నేను ఈ work finish చేయాలనుకుంటున్నాను.
- ప్రజలు Congress ని ఓడించాలనుకుంటున్నారు.
- ఆమె money save చేయాలనుకుంటుంది.
- M.D. ఇప్పుడు meeting conduct చేయాలనుకుంటున్నాడు.
- మా brother I.A.S. కి coaching తీసుకోవాలనుకుంటున్నాడు.
- నేను సీతని నమ్మాలనుకుంటున్నాను.
మనం చేయదలుచుకోని పనులకు Don’t Want to ను ఉపయోగించాలి
- నేను దేవుణ్ణి నమ్మాలనుకోవడం లేదు.
- వాళ్ళు Rice business లోకి enter కావాలనుకోవడం. లేదు.
- Balu coaching తీసుకోవాలనుకోవడం లేదు.
- మేము ఎక్కువ Homework చేయాలనుకోవడం లేదు.
- Selectors Veera ని select చేయాలనుకోవడం లేదు.
- నేను నీ మాటలు వినాలనుకోవడం లేదు.
- మా father curd rice లో salt use చేయాలనుకోవడం లేదు.
- Kiran Doctor కావాలనుకోవడం లేదు.
- నేను Delhi కి Train లోవెళ్ళాలనుకోవడం లేదు.
- నేను నిన్ను Trouble చేయాలనుకోవడం లేదు.
- Workers రేపు Strike చేయాలనుకోవడం లేదు.
- Lavanya పాడాలనుకోవడం లేదు.
- నేను ఏ పార్టీని support చేయాలనుకోవడం లేదు.
- పిల్లలు T.V. చూడాలనుకోవడం లేదు.
- మేము Time waste చేయాలనుకోవడం లేదు.
- నేను Saritha తో మాట్లాడాలనుకోవడం లేదు.
- నేను నీకు Phone చేయాలనుకోవడం లేదు.
- మీరు Hindi నేర్చుకోవాలనుకోవడం లేదు.
- వాళ్ళు నాకు Cooperate చేయాలనుకోవడం లేదు.
- నేను Lavanya ని పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదు.
- Govt. Telangana ని ఇవ్వాలనుకోవడం లేదు.
- Chiranjeevi సినిమాల్లో యాక్ట్ చేయాలకోవడం లేదు.
- Principal వాళ్ళని encourage చేయాలనుకోవడం లేదు.
- వారు M.P.C. తీసుకోవాలనుకోవడం లేదు.
- నేను అందరినీ నమ్మాలనుకోవడం లేదు.
- వారు ఈ బ్యాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయాలనుకోవడం లేదు.
- ఆమె తన పిల్లల్ని exhibition న తీసుకెళ్ళాలనుకోవడం లేదు.
- వారు South India tour కి వెళ్ళాలనుకోవడం లేదు.
- నేను ఈ work ని Postpone చేయాలనుకోవడం లేదు.
- Rama ఈ Job కి apply చేయాలనుకోవడం లేదు.
గతంలో చేయాలనుకున్న పనులకు Wanted to ను ఉపయోగించాలి
- అతను నిన్న సినిమాకు వెళ్ళాలనుకున్నాడు.
- మా ఫాదర్ నన్ను ఈ కాలేజీలో జాయిన్ చేయాలనుకోలేదు.
- మా తమ్ముడు గత సంవత్సరంలో కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు.
- సచిన్ క్రికెట్ నుండి రిటైర్ కావాలనుకున్నాడు.
- ప్రిన్సిపాల్ రిజల్ట్స్ ప్రకటించాలనుకున్నాడు.
- మా అన్నయ్య నిన్న బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేయాలనుకున్నాడు.
- వారు గతవారం వాళ్ళు సినిమాకి రిలీజ్ చేయాలనుకున్నాడు.
- కేశవ ఆమెని పెళ్ళి గురించి అడగాలనుకున్నాడు.
- సెలక్టర్లు గంభీర్ ను సెలక్ట్ చేయాలనుకోలేవదు.
- గత సంవత్సరంలో నేను ఊటీ వెళ్ళాలనుకున్నాను.
- ఆ దొంగ పోలీసుల నుండి తప్పించుకోవాలనుకున్నాడు.
- ఆమె ఎ.టి.యం. నుండి మనీ డ్రా చేయాలనుకోలేదు.
- భారతదేశం శ్రీలంకకు సహయం చేయాలనుకుంది.
- నేను గతవారం వీసాకు అప్లె చేయాలనుకున్నాను.
- కిషోర్ నిన్న ఆ పెళ్ళికి అటెండ్ కావాలనుకోలేదు.
- సోనియాగాంధీ ప్రధానమంత్రి కావాలనుకోలేదు.
- చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టాలనుకోలేదు.
- టీచర్ నిన్న తక్కువ హోమ్ వర్క్ ఇవ్వాలనుకున్నాడు.
- మేనేజర్ నిన్న హలిడే డిక్లేర్ చేయాలనుకోలేదు.
- నేను ఈ సమస్య నుండి బయటపడాలనుకున్నాను.
- మేము ఆ స్ధలం కొనాలనుకున్నాము.
- సరళ గోపి ని పెళ్ళి చేసుకోవాలనుకోలేదు.
- నేను నిన్న క్లాస్ కు రావాలనుకున్నాను.
- వారు మినిస్టరు ను పిలవాలనుకున్నారు.
- ఆమె వారిని అవమానించాలనుకోలేదు.
- గీత నిన్న సినిమాకు వెళ్ళాలనుకోలేదు.
- నేను నిన్న నమ్మాలనుకున్నాను.
- నేను ఇన్ని ఉదాహరణలు ఇవ్వాలనుకోలేదు.
- నేను నిన్న ఇబ్బంది పెట్టాలనుకోలేదు.
- ఆమె నిన్న కలవాలనుకుంది.