DAY 9 ( SPOKEN ENGLISH )

ఈ రోజు ఇవ్వబోయే Worksheet లో ఉన్న Active Voice sentences ను ఇచ్చిన directions ప్రకారం different tenses లోకి మార్చండి.

బహుశా కొంచం కష్టపడి నిన్నటి Active Voice మరియు Passive Voice Homework చేసి ఉంటారు. Home work తెలుగులో రాసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. Passive voice లో రాసిన తెలుగుని మనం వాడం కదా అనే అనుమానం రావచ్చు. కచ్చితంగా మనం వాడుతూనే ఉన్నాం. సందేహమే లేదు. కాకపోతే వాడే విధానంలోనే కొంచెం తేడా ఉంది. అదెలాగో ఉదాహరణతో వివరంగా తెలుసుకుందాం.

Ex:-  మా father నిన్న transfer అయ్యారు.

నిన్న గ్లాసు పగిలింది.

రేపు ఈ Work complete కావచ్చు.

Letters  ఇంతకుముందే Post అయ్యాయి.

పై Sentences చూడగానే సాధారణంగా మనం ఇలా రాసే అవకాశం ఉంది.

II (1) Simple Past tense - - My father transferred yesterday (Wrong)

II (1) Simple Past tense --  Glass broke yesterday (Wrong)

May > This work may complete tomorrow (wrong)

I (3) Letters have posted just before (wrong)

పై విధంగా English లో చెప్పినా, రాసినా అవి 100% తప్పు sentences మాత్రమే. కారణం చూద్దాం.

Active Voice :-

II (1) He conducted exam yesterday

అతను ‘E’ నిన్న ‘C’ చేసాడు.

They conducted exam yesterday

వారు నిన్న ‘E’ ‘C’ చేసారు.

You solved this problem yesterday

మీరు ఈ 'P' ని నిన్న "S' చేసారు.

Manager transfered clerk yesterday

‘M’ ‘C’ O ‘Y.D’ ‘T’ చేసాడు.

He transfered clerk yesterday

అతను ‘Y.D’ ‘C’ ని ‘T’ చేసాడు.

He transfered yesterday  ఇప్పుడు ఎవరినీ అనేది మనం discuss చేయటం లేదు

అతను నిన్న ‘T’ చేసాడు.

He transfered   ఎవ్పుడు అనేది మనం discuss చేయటం లేదు.

తను ‘T’ చేసాడు.

ఇప్పుడు He place లో

I transfered        నేను 'T' చేసాను.

She transferred  ఆమె ‘T’ చేసింది.

You transfered   మీరు 'T' చేసారు.

They transferred  వారు ‘T’ చేసారు.

ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. మరి I, She, He, You, They వాటి place లో my father పెట్టిచూద్దాం.

My father transfered

మా 'F’ ‘T’ చేసాడు. అయ్యాడు కాదు. (చేసాడు వేరు, అయ్యాడు వేరు). ఎలాగో చూద్దాం.

Active Voice

Manager transferred Clerk Yesterday

‘M’ ‘C’ ని ‘T’ చేసాడు.

 Passive Voice

Clark is transferred yesterday by Manager

‘C’ ‘M’  చేత నిన్న ‘T’ చేయబడ్డాడు.

Clerk is transfered by Manager (Yesterday ని తీసేద్దాం )

‘C’ ‘M’ చేత ‘T’ చేయబడ్డాడు.

Clerk is transfered (Manager చేత అనే దాన్ని కూడా తీసేద్దాం.)

‘C’ ‘T’ M చేయబడ్డాడు.

(ఎవరిచేత అనే దానికి మనం importance ఇవ్వటం లేదు. గమనించండి.)

‘C’ ‘Т’ చేయబడ్డాడు అనే తెలుగు భావాన్ని మనం ‘C’ ‘T’ అయ్యాడు అని రానున్నాం, చదువుతున్నాం, వింటున్నాం మరియు మాట్లాడుతున్నాం. ఈ తెలుగులో వచ్చిన మార్పు వల్ల మనం Confuse అవుతున్నాం. అంతే కానీ English లో ఏ ఇబ్బంది లేదు.

HOME WORK

 ACTIVE VOICE

He learns new things

అతను 'N' 'T' నేర్చుకుంటాడు.

Students invite Principal Principal

‘S’ ‘P’ ని ‘I’ చేస్తారు.

I help every one Every one

నేను ప్రతీ ఒక్కరికీ ‘H’ చేస్తాను.

They check files Files

వారు 'F' 'C' చేస్తారు

PASSIVE VOICE

New things are learned by him

‘N’ ‘T’ అతను చేత నేర్చుకోబడతాయి.

Principal is invited by students

‘P’ ‘S’ చేత ‘I’ చేయబడతాయి.

Every one is helped by me

ప్రతీఒక్కరు నా చేత ‘H’ చేయబడతారు.

Files are checked by them

‘F’ వారి చేత ‘C’ చేయబడతాయి.

మరికొన్ని ఉదాహరణలు చూద్దాం

 I broke అంటే నేను పగలగోట్టాను.

You broke

నీవు పగలగొట్టావు.

They broke

వారు పగలగొట్టారు

She broke

ఆమె పగలగొట్టింది

మరి Glass broke అంటే? అర్ధం ఏం వస్తుందో తెలుసా?

Glass పగలగొట్టింది.

(ఏం పగలగొట్టామో చెపితే అది రాస్తాం. కాని ఏం పగలగొట్టామో అనే దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.)

ఎంత దారుణంగా ఉంది, గ్లాసు దేన్ని పగలగొట్టింది, హాస్యాస్పదంగా ఉంది కదూ !

మరి ఎలా చెప్పాలి? "నిన్న గ్లాసు పగిలింది" అని కాక నిన్న గ్లాసు పగలగొట్టబడింది అని చెప్పాలి. ఇక్కడ మనం ఎవరిచేత అనే దానికి importance ఇవ్వడం లేదు గమనించండి. ఎవరిచేత అనే దానికి importance ఇవ్వాలా వద్దా అనేది మన ఇష్టం.

ఇప్పుడు దాన్ని correct గా ఎలా చెప్పాలో చూద్దాం.

నిన్న గ్లాసును ఎవరు పగలగొట్టారో చూద్దాం

II (1) Simple past tense

Active Voice:

Somebody broke Glass yesterday

Passive Voice:

Glass was broken by somebody Y.D.

'G' నిన్న ఎవరిచేతనో పగలగొట్టబడింది.

Glass was broken yesterday.

'G' నిన్న పగలగొట్టబడింది ఎవరిచేత? మనం ఎవరిచేత ఎవరిచేత అనే దానికి Importance ఇవ్వడం లేదు.

కాకపోతే

“గ్లాసు పగలగొట్టబడింది " బదులు " గ్లాసు పగిలింది "

అని అంటున్నాం. ఆవిధంగా తెలుగుని మార్చి

చదవటమే, రాయటమే, వినటమే, మాట్లాడటమే

సమస్యకు కారణం.

అదే విధంగా ‘Work may complete tomorrow' అంటే work రేపు (దేవుని) complete చేయవచ్చుఅనే అర్ధం  వస్తుంది. మనం ఇక్కడ workని ఎవరు చేస్తున్నారో అనే దానికి Importance ఇవ్వటంలేదు. కాబట్టి Passive voice లో మాత్రమే ఆ sentence ను చెప్పాల్సి ఉంటుంది.

Passive Voice:

Work may be completed tomorrow

‘W’ రేపు 'C' కావచ్చు, (కాబడవచ్చు) ఎవరిచేతనో అనేది మనకి important కాదు.

Note:- Passive voice లో blind rule V3 అని తెలుసుకున్నాం. అది English లో blind rule. మరి తెలుగులో blind rule "బడ /బడు " అనేవి. కాని మనం blind rule ని follow కాకుండా తెలుగును సరళంగా మాట్లాడుతున్నాం అనుకుంటూ క్లిష్టంగా చేసుకుంటున్నాం.

English నేర్చుకునే క్రమంలో మనకు నచ్చిన, వచ్చిన మాతృభాపైన తెలుగు నుండి మాతృభాష భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. ఉదాహరణకు నిన్న నేను పాలు పట్టాను అనగానే ఇది II (1) Simple Past tense అని అర్ధం అవుతుంది. మనం నేర్చుకున్న దాన్ని బట్టి సాధారణంగా తెలుగు Sentence యొక్క ముఖ్యమైన భావం చివరలో ఉంటుందని మనకు తెలుసు.

నేను నిన్న పాలు పట్టాను. పట్టడం అంటే Catch Caught Caught

మరి ఈ sentence II(1) Simple past కాబట్టి V2 మాత్రమే రాయాలి. ఇప్పుడు చూద్దాం sentence ఎలా వస్తుందో?

I caught milk yesterday

దారుణంగా ఉంది కదూ ! నిజమే మరి నేను తెలుగులో ఏది వుంటే అదే మార్పులు లేకుండా ఇంగ్లీష్ లో రాస్తాను అంటే సరియైన భావం రాదు. దాన్ని ఇలా రాస్తే చక్కగా వుంటుంది. నేను పాలు తీసుకున్నాను అని.

I took milk yesterday

అదే విధంగా సాధారణంగా English sentence ని ముఖ్యమైన భావం sentence ప్రారంభంలో ఉంటుంది.

ఉదాహరణకు:

“I am” అనగానే ఆ Sentence ప్రారంభంతోనే మనకు తెలిసిపోతుంది అది I Present tense అని.

“I was” అనగానే ఆ Sentence ప్రారంభంలో II Past tense అని

“I will” అనగానే ఆ Sentence ప్రారంభంలో III Future అని

అదేవిధంగా

నేను ఊరికి “_____________''ఈ విధంగా తెలుగులో sentence ఉంటే దాని చివర లేకుండా మనం అర్ధం చేసుకోలేం.

ఆ తెలుగు Sentence యొక్క అర్ధం

నేను ఊరికి వెళతాను.

నేను ఊరికి వెళ్ళాను ?

నేను ఊరికి రేపు వెళతాను ?

పై వాటిలో ఏ అర్ధం అనేది మనం ఊహించలేం. కాని తెలుగు sentence యొక్క చివర మాత్రం చేతనే అది ఏ tense అనే దాన్ని మనం గుర్తించవచ్చు.

ఉదాహరణకు:

Regular గా వెళతాను

I(1) Simple present tense

ఇప్పుడు వెళుతూ ఉన్నాను

(2) Present continuous tense

ఇంతకుముందే వెళ్ళాను

(3) Present perfect tense

వెళుతూనే ఉన్నాను

(4) Present perfect continuous tense

నిన్న వెళ్ళాను

III(1) Simple past tense

అప్పుడు వెళుతూ ఉన్నాను

(2) Past continuous tense

అంతకుముందే వెళ్ళాను

(3) Past perfect tense

అప్పుడు వెళుతూనే ఉన్నాను

(4) Past perfect continuous tense

(సాధారణంగా మనం II(3), II(4) లను ఉపయోగించం)

రేపు వెళతాను

III(1) Simple future tense

అప్పుడు వెళుతూ ఉంటాను

(2) Future continuous tense

అంతకుముందే వెళ్ళి ఉంటాను

(3) Future perfect tense
అప్పుడు వెళుతూనే ఉంటాను

(4) Future perfect continuous tense

(సాధారణంగా మనం III(2). III(3) III(4) లను ఉపయోగించం)

మనం ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం. English Sentence ప్రారంభం చూసి సాధారణంగా అది ఏ tense లో ఉందో చెప్పవచ్చు.

Telugu Sentence చివర చూసి సాధారణంగా అది ఏ tense లో ఉందో చెప్పవచ్చు.

అదే విధంగా  Passive voice యొక్క  Importance ని కూడా అర్ధం చేసుకున్నాం.  Passive voice లో చెప్పాల్సిన Sentences ను Active voice లో చెపితే ఎంత ఘోరమైన అర్థం వస్తుందో కూడా తెలుసుకున్నాం.

అయినప్పటికీ Passive voice లో చెప్పాల్సిన వాటిని Active voive లో చెపితే ఎలా ఉంటుందో చూద్దాం.

ఆమెని ఇంతకుముందే Hospital లో admit చేసారు.

I(3) A.V :- She has admitted in the hospital just before

ఆమె ఇంతకుముందే "H" లో 'A' చేసింది (ఎవరినో)

P.V :- She has been admitted in the hospital just before

ఆమె ఇంతకుముందే Hospital లో admit చేయబడింది. (ఎవరిచేతనో)

(or)

ఆమెని ఇంతకుముందే Hospital లో admit చేశారు.

ఇక్కడ పాలు అమ్ముతారు.

I (1) A.V:- Milk Sells here

ఇక్కడ పాలు అమ్ముతుంది (పాలు దేనినో అమ్ముతుంది అనే అర్ధం వస్తుంది.)

P.V :- Milk is sold here

పాలు ఇక్కడ అమ్మబడతాయి.(ఎవరిచేతనో)

(or)

పాలు ఇక్కడ అమ్ముతారు.(ఎవరో)

నిన్న రెండు సినిమాలు Release అయ్యాయి.

II(1) A.V :- Two Cinemas released yesterday

రెండు సినిమాలు నిన్న (దేనినో / వేటినో) 'R' చేసాయి.

P.V :- Two Cinemas were released yesterday

నిన్న రెండు సినిమాలు 'R' చేయబడ్డాయి.(ఎవరిచేతనో)

(or)

నిన్న రెండు సినిమాలు "R" అయ్యాయి.

మనం సాధారణంగా Active voice లో చెప్పాల్సింది Passive voice లోనో లేదా Passive voice లో చెప్పాల్సింది Active voice లోనో చెబితే అదేమీ పెద్ద తప్పు కాదన్నట్టు భావిస్తూ ఉంటాం.

ఉదాహరణకు

A.V:- My father transferred

మా "F" •T" చేసారు.

P.V :- My father was transferred

మా "F" ని “T” చేసారు./మా 'F "T" అయ్యారు.

మా 'F "T" చేయబడ్డారు.

పై రెండు sentences మద్య చాలా స్పష్టమయిన తేడా ఉంది.

తెలుగులో

A.V :- మా father (ఎవరినో) transfer చేశారు

P.V :- (ఎవరో) యా father ని transfer చేశారు.

100% తేడాని మనం గమనించవచ్చు.

A.V :- My father transferred

P.V :- My father was transferred

తెలుగులో రెండు sentences మధ్య ఉన్న అంత స్పష్టమయిన 100% తేడాని English లో కేవలం was వలన మాత్రమే వచ్చింది.

చాలా మంది was ని, is ని have ని, have been ని, has, were, will, will be లాంటి వాటిని చాలా  తేలిగ్గా చూస్తారు.

పై Sentence లో was మాత్రమే కదా ! పొరపాటున పెట్టాను అనో, was మాత్రమే కదా ! మిస్సయింది అని వాటికే మాత్రం ప్రాముఖ్యత లేనటుగా ప్రవర్తిస్తారు.

ముందుగా మనం చెప్పకున్నటు English Sentence లో ముఖ్యమైన భావం అంతా ప్రారంభంలోనే ఉంటుంది.

ఉదాహరణకు:

She is -------- meaning వేరు

She was  ----- meaning వేరు

He has saved ------ meaning వేరు

He has been saved ------ meaning వేరు

తెలుగు sentence లో ముఖ్యమైన భావం అంతా ముగింపులోనే ఉంటుంది.

------------- రాసింది Meaning వేరు

-------------- రాస్తుంది Meaning వేరు

-------------- రాస్తూ ఉంది meaning వేరు

--------------  రాస్తూనే ఉంది meaning వేరు

ఇక చివరగా Is, am, was, were, has, have, have been, will, will be లాంటి వాటి ప్రాధాన్యతను మరో విధంగా చెప్పటానికి ప్రయత్నిద్దాం.

ఉదాహరణకు:

రవి రేపు ఊరికి వెళ్తుంది

ఆమె ఇప్పుడు TV చూస్తూ ఉన్నాడు.

అంతా కరెకుగానే చెప్పాను కదా ఏదో చివరలో పొరపాటున వెళ్తాడు బదులుగా వెళ్తుంది అన్నాము. ఉన్నది

బదులుగా ఉన్నాడు అంటే సరిపోతుందా, ఎంత ఇబ్బందికరంగా ఉంది ఆ sentence యొక్క Meaning.

English లో కూడా అలాగే ఘోరమైన Meanings వస్తాయి. IS బదులు Was వాడకూడదు. Have బదులు have been, Has బదులు Have, Have బదులు Had అలా వాడటం 100% తప్పు.

కాబట్టి వాటిని సరైన పద్దతిలో వాడటం కోసమే మనం Tenses (A. V, P. V, BE) లు  నేర్చుకునేది.

I have two brothers కి బదులుగా

I had two brothers అన్నారనుకోండి

దాని Meaning ఏమని ఉంటుందో తెలుసా?

ఒకప్పుడు నాకు ఇద్దరు brothers ఉన్నారు. వారు ఇప్పుడు లేరు అని అర్థం వస్తుంది.

So I had two brothers = I don't have two brothers now

Manager is Sincere కి బదులుగా

Manager was Sincere అన్నారనుకోండి

Manager ఒకప్పుడు Sincere గా ఉన్నాడు కానీ ఇప్పుడు కాదు అని అర్థం వస్తుంది.

So Manager was sincere = Manager is not sincere now

She is beautiful బదులుగా

She was beautiful అన్నారుకోండి

ఆమె ఒకప్పుడు అందంగా ఉంది, ఇప్పుడు లేదు అని అర్థం వస్తుంది.

So she was beautiful = She is not beautiful now

కాబట్టి is లు, was లు మొదలైన వాటి ప్రాధాన్యతను తెలుసుకోండి. సరిగ్గా 30 రోజులు Practice చేయండి.

TEST -2

Convert the following sentences according to the instructions given in the brackets

She solves problems.

( Simple past)

You Were saving money.

(Future perfect tense)

I had announced results.

(Future continuous tense)

We encouraged him.

(Present perfect tense)

They will not help.

(Future perfect continuous)

Manager did not appoint clerks.

(Simple present)

Students are inviting.

(Past continuous)

News papers write truth.

(Simple past)

Doctor has conducted operation.

(Past continuous)

Sarala is playing chess.

(Future perfect tense)

I don't agree.

(Simple future tense)

Principal declares results.

(Past continuous)

Workers don't demand.

(Simple past)

She didnot agree.

(Simple present)

Nagarjuna has recieved.

(Past perfect)

He will not enter into politics.

(Simple present)

Bottle doesn't contain water.

(Simple past)

Collector is not releasing funds.

(Simple present)

M.R.O. had issued certificates.

(Present perfect continuous)

I ask.

(Future perfect continuous)

Kavitha didn't neglect H.W.

(Simple present)

Lavanya doesn't like Tea.

(Future continuous)

Management doesn't solve.

(Past continuous)

Passengers became dull.

(Simple present)

I was turning round.

(Simple present)

 

Note: అందరికీ ఆంగ్లం మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు ?  మాకు వస్తున్న response చూస్తే చాలా మంది దీన్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.  అయితే  ఈ మెటీరియల్ ను త్వరలో బుక్ రూపంలో కూడా తీసుకొస్తున్నాం. అప్పటి వరకూ మీరు perfect గా ఫాలో అయిపోతే... బుక్ చూసి మరింత perfect అవ్వొచ్చు. ఈ spoken English కోర్సు పై  మీ సందేహాలు, అభిప్రాయాలు ఉంటే మాకు పంపండి.  Sri JV Ramana Raju & Smt R.P.Bahdhavi గారు మీ సందేహాలకు జవాబులిస్తారు.

mail  your doubts to : telanganaexams@gmail.com or Whats app : 703 6813 703 ( don't call pl)