DAY -2 – SPOKEN ENGLISH

Congratulations !    చాలా కష్టపడి Home work రాసి ఉంటారని అనుకుంటున్నాం.  మొదట్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది.  కాని ఒక్కసారి అర్థం చేసుకోగానే చాలా విషయాలు మనకు తెలుస్తాయి.  ఇప్పుడు కింద కొన్ని Telugu Sentences ఇవ్వబడ్డాయి. వాటిని English లోకి Translate చేయడానికి ప్రయత్నం చేయండి.

  1. వారు ఇప్పుడు Exam రాస్తూ ఉన్నారు.
రాస్తూ ఉండటమంటే verb ఏమిటో తెలుసా......

V1                                   V2                               V3

Write                           Wrote                        Written

అలా ప్రతీ Action కి Verb ఉంటుంది.  ఆ Verb ని మాత్రమే కాకుండా దాని యొక్క మూడు రూపాలను మనం తెలుసుకోవాలి.  అందుకే మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే 300 Verbs వాటి మూడు రూపాలను ప్రత్యేకంగా ఇస్తున్నాము.

ఖచ్చితంగా ప్రతీ sentence ఏదో ఒక tense లో ఉండాలి.

I              -              Present Tense

II             -              Past Tense

III           -              Future Tense లలో కాకుండా మనం

ఏం రాస్తాం ?

ఏం చదువుతాం ?

ఏం వింటాం ?

ఏం మాట్లాడతాం ?

కాబట్టి ప్రతీ sentence ఏదో ఒక tense లో ఉండాల్సిందే.  ఇక పై Sentence ను పరిశీలించినట్టయితే “ఇప్పుడు” అనే పదం గమనించవచ్చు.  సాధారణంగా “ఇప్పుడు” అనే పదం

I – 2) Present Continuous Tense లో మాత్రమే వస్తుంది.  కాబట్టి Active Voice Structure లోని

I-2) Structure ని చూస్తూ ఈ example telugu sentence ను English లోకి మార్చాలి.

Ans: I -2   They are writing exam now

  1. వారు ఉదయం నుంచి Exam రాస్తూనే’’ ఉన్నారు.
రాస్తూ ఉండటం వేరు                            రాస్తూనే ఉండటం వేరు

తింటూ ఉండటం వేరు                           తింటూనే ఉండటం వేరు

ఆడుతూ ఉండటం వేరు                         ఆడుతూనే ఉండటం వేరు

చూస్తూ ఉండటం వేరు                          చూస్తూనే ఉండటం వేరు

అలాగే నవ్వుతూనే, ఏడుస్తూనే, మాట్లాడుతూనే, వింటూనే

నేర్చుకుంటూనే, కాపాడుతూనే,  సహాయం చేస్తూనే... ఇలాంటివన్నీ కూడా...

I-4  Present Perfect Continuous tense లోనే రాయాల్సి ఉంటుంది.

 గమనిక:-

ఇవన్నీ కూడా ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉంటేనే మనం I - Present Perfect Continuous tense లో

రాయాలి.

I - 4) Ans :- They have been writing exam since morning.

  1. లావణ్య ఇప్పుడు Meals Prepare చేస్తూ ఉంది.

V1                    V2                    V3

Prepare            Prepared          Prepared

 I-2   Lavanya is preparing meals now

ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. Lavanya is అని మాత్రమే ఎలా అనగలిగాం.  చూద్దాం. !

Active Voice Structure

I - 2        Present continuous tense

(V1+ing)

I - 2

I         am cooperating now

He

She      is cooperating now

It

We

You     are cooperating now

They

మనకి  I కి ఏం వాడాలో తెలిసింది ‘am’

He, She, It లకు ‘Is’

We, You, They లకు ‘are’ వాడాల్సి ఉంటుంది.

Lavanya అంటే ఈ I, We, You, They, He, She, It లలో ఏదో ఒక దాంట్లో ఉండాల్సిందే. Lavanya అంటే “She”కాబట్టి “is” ని వాడాలి.

అంతేకాదు ప్రపంచంలో ఎవరైనా , ఏదైనా ఈ I, We, You, They, He, She, It లలోకి రావాల్సిందే.

వేరే మాగ్గరం లేదు. ఏది తీసుకున్నా సరే.

ఉదా:కు

నిజాయితీ అంటే ‘అది’ అంటాం కాబట్టి “It”

మంచం అంటే ‘అది’ అంటాం కాబట్టి “It”

పాము అంటే ‘అది’ అంటాం కాబట్టి “It”

ప్రిన్సిపాల్ అంటే అతడు/ఆమె’ అంటాం కాబట్టి “He/She”

విద్యార్థి అంటే అతడు/ ఆమె  అంటాం కాబట్టి “He/ She”

విద్యార్థులు అంటే ‘వారు’ అంటాం కాబట్టి “They”

అలా మనం ఏది తీసుకున్నా అవన్నీ I, We, You, They, He, She, It లలోకి వస్తాయి.  I, We, You, They, He, She, It లకు ఏ Tense లో ఏం వాడాలో Active Voice Structure ప్రకారం మనకు తెలుసు.

  1. లావణ్య ఉదయం నుంచి Meals Prepare చేస్తూనే ఉంది.

I-  4) Ans: Lavanya has been preparing meals since morning

  1. రవి ఇప్పుడు T.V. చూస్తూ ఉన్నాడు.

I-2) Ans:- Ravi is watching T.V. now

  1. రవి గంట సేపటి నుంచి TV చూస్తూనే ఉన్నాడు.

I-4) Ans:- Ravi has been watching T.V. for 1 hour

Note :-     “Since” Indicates point of time.

Ex:- Since 2002, Since morning, Since Monday, Since 9a.m, Since  January etc.

“For” indicates period of time.

Ex:- for 13 years, for 5 hours, for 2 days, for 3 hours, for 2 months etc.

  1. వారు ఇంతకుముందే ఈ Problem ను Solve చేశారు.

V1                 V2                 V3

Solve             Solved Solved

‘‘ ఇంతకు ముందే’’ అనే పదం I-3Present perfect Tense లో తప్ప ఇక ఎక్కడా రాదు. ఇంతకుముందే అనే పదం కానీ లేదా ఆ భావం కానీ వచ్చినట్లయితే ఆ Sentence ని I-3) Present perfect Tense లోనే చెప్పాల్సి ఉంటుంది.

Note: -   ‘‘ ఇంతకుముందే’’ వేరు  ‘‘ ఇంతకుముందు ’’ వేరు.  ఇంతకుముందే అంటే

Just before or Just now

I-3) Present perfect Tense.

ఇంతకుముందు అంటే I-1) Simple past tense

Ans:- They have solved this problem just before.

  1. ఆమె ఇంతకుముందే తన work ని complete చేసింది.

V1                    V2                                   V3

Complete          Completed                    Completed

I-3) Ans: She has completed her work just before.

  1. Manager ఇంతకుముందే clerk ని dismiss చేశాడు

V1                V2                      V3

Dismiss          Dismissed       Dismissed

I-3) Ans:- Manager has dismissed clerk just before.

  1. C.M. ఇంతకుముందే Assembly లోకి enter అయ్యాడు.

V1                V2                  V3

Enter             Entered          Entered

Ans:- I-3) C.M. has entered into Assembly just before.

  1. Students ఇంతకుముందే exam రాశారు.

V1                 V2                 V3

Write             Wrote             Written

Ans:- I-3) Students have written exam just before.

  1. వారు ఇంతకుముందే complaint చేశారు.

V1                 V2                   V3

Complaint       Complainted   Complainted

Ans:- I3) They have complainted just before.

ఈ రోజు I-2) Present continuous tense

I-3) Present perfect tense

I-4) Present perfect continuous tense

Work sheets ను complete  చేయండి.

HOME WORK

  1. You create problems               You don’t create problems

మీరు ‘P’ ‘C’ చేస్తారు.                   మీరు ‘P’ ‘C’ చేయరు

  1. I post letters                              I don’t post letters

నేను ‘L’ ‘P’ చేస్తాను                          నేను ‘L’ ‘P’ చేయను

  1. Teacher postpones exams        Teacher doesn’t postpone exams

‘T’ ‘E’ ‘P’ ‘P’ చేస్తారు                      ‘T’ ‘E’ ‘P’ ‘P’ చేయరు

  1. Workers demand salary           Workers don’t demand Salary

‘W’ ‘S’ ‘D’ చేస్తారు.                              ‘W’ ‘S’ ‘D’ చేయరు

 

Note: ఏ రోజు ప్రాక్టీస్ ఆ రోజే పూర్తి చేయగలరు.  దాంతో మీరు సులభంగా  ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఉంటుంది.

( ఈ కోర్సును అందిస్తున్నవారు: Sri J.V.Ramana Raju, Smt. R.Bandhavi )

( 4,5 పాఠాల దాకా ఇమేజెస్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు... వాటిని వచ్చే ఆదివారం లోపు మారుస్తాం. సహకరించగలరు)