మార్చి 3 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు

మార్చి 3 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు

ఏపీలోని డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను మార్చి 3 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.కే.హేమచంద్రారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను మార్చి 3 నుంచి 10 వరకూ ఆన్ లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) పోర్ట్ లో ఆయా డిగ్రీ కాలేజీలు అప్ లోడ్ చేయాలన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరిగింది. వీటికి సంబంధించి తమకు కేటాయించిన సీట్లు రద్దు చేయాలని విద్యార్థులు అనుకుంటే... ఆ ఇన్ఫర్మేషన్ ను రిక్వెస్ట్ లెటర్ తో పాటు కాలేజీల లాగిన్ ఐడీ ద్వారా వెబ్ సైట్ లో పొందుపరచాలి. అందుకు ఈనెల 27 వరకూ చివరి తేది. ఆయా కాలేజీలు విద్యార్థుల అనుమతితో ఈనెల 28 నుంచి మార్చి 1 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.