DPT-03 ప్రకృతి విపత్తులు-పర్యావరణం

1) సైక్లోన్ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?
జ.గ్రీకు
2) ఒక కుటుంబ విపత్తు సామాగ్రిలో ఉండాల్సినవి
1) బట్టల జత(వేడిని ఇచ్చేవి)
2) తిండి మరియు తాగు నీరు
3) మందులు
4) టీవీ
జ: 1,2,3 మాత్రమే
3) ప్రపంచంలో సంభవించే విపత్తుల్లో ఎంతశాతం భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి
జ: 8శాతం
4) ఒక విపత్త నిర్వహణ టీమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన టీమ్ లు
1) ప్రథమ చికిత్స టీమ్
2) అన్వేషణ, కాపాడే టీమ్
3) అవగాహన పెంపొందించే టీమ్
జ: 1,2,3
5) రింగ్ ఆఫ్ ఫైర్ (మంటల చక్రం) అనేది ఏ సముద్రానికి సంబంధించినది
జ: పసిఫిక్
6) అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దం ఏది
జ: 1990-2000
7) విపత్తు నిర్వహణ చట్టంను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు
జ: 2006 జనవరి 9
8) 2013 నవంబర్ లో బంగాళాఖాతంలో ఏ తుఫాను ఏర్పడింది?
జ: హెలెన్
9) విపత్తు అంటే ?
1) ప్రకృతి లేక మానవ ప్రేరేపిత సంఘటన
2) దాని ద్వారా జీవనాధారానికి నష్టం కలుగుతుంది
3) దాని ద్వారా అధికంగా మానవ ధ్వంసం జరుగుతుంది
జ.పైవన్నీ
10) సామాజిక ఆధారిత విపత్తు నష్ట నివారణను మనదేశంలో ఎవరి ఆధ్వర్యంలో చేపడతారు?
ప్రణాళికా సంఘం
యునెస్కో
జ. UNDP
యునిసెఫ్
11) ఆంధ్రప్రదేశ్ లో తరచుగా వరదల వల్ల ఇబ్బంది పడే ప్రాంతం ఏది?
జ: కృష్ణా, గోదావరి ప్రాంతం
12) అసోం, బీహార్ రాష్ట్రాల్లో ఏ ఏడాదిలో వరదలు ఎక్కువగా వచ్చి భారీ నష్టాన్ని కలిగించాయి?
జ.2005
13) ఇండియా జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థ ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది?
జ.2007
14) కరువు ప్రధానంగా దేనివల్ల ఏర్పడుతుంది?
జ.దీర్ఘకాలంగా వర్షాలు లేకపోవడం
15) సునామీలు ఎక్కువగా వేటివల్ల కలుగుతాయి?
జ.భూకంపాలు
16) భూకంప ప్రాంతపు మ్యాప్ లను ఎవరు తయారు చేస్తారు?
జ: జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
17) వరదల హెచ్చరికలు దేని ద్వారా ప్రసారమవుతాయి?
ఆల్ ఇండియా రేడియో
దూరదర్శన్
పత్రికా ప్రకటనలు
జ.పైవన్నీ
18) 1977 నవంబర్ 15న తమిళనాడును తాకాల్సిన తుఫాను ఏ ప్రాంతాన్ని తాకి ఎక్కువ గ్రామాలను ధ్వంసం చేసింది?
జ) ఆంధ్రప్రదేశ్
19) సైక్లోన్ అనే మాట ఏ భాష నుంచి వచ్చింది?
జ) గ్రీకు
20) ఒక విపత్త నిర్వహణ టీమ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన టీమ్ లు
1) ప్రథమ చికిత్స టీమ్
2) అన్వేషణ, కాపాడే టీమ్
3) అవగాహన పెంపొందించే టీమ్
జ: 1,2,3
21) మేనేజ్ మెంట్ డిజాస్టర్ రిస్క్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ - ఈ నివేదిక ఎవరు రూపొందించారు
జ: ప్రపంచ బ్యాంకు
22) రింగ్ ఆఫ్ ఫైర్ (మంటల చక్రం) అనేది ఏ సముద్రానికి సంబంధించినది
జ: పసిఫిక్
23) భూకంపం నుంచి వదలబడేది ఏది
జ: కంపనాలు, ప్రకంపనాలు
24) భారత దేశంలో తూర్పుతీర ప్రాంతాల్లో ఏ బాగంలో పెను తుఫాన్లు వస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది
1) ఉత్తర ఒడిషా, పశ్చిమబెంగాల్ తీరం
2) ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు -మచిలీపట్నం మధ్య ఉన్న తీరం
3) తమిళనాడులో నాగపట్నంనకు దక్షిణంలో ఉండు తీర ప్రాంతం
జ: 1,2,3
25) అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దం ఏది
జ: 1990-2000