DPT-23 జనరల్ సైన్స్ బయోలజీ(25ans)

1) మైక్రోలైటిక్ రక్తహీనత దేని లోపం వల్ల కలుగుతుంది ?
ఎ) నియాసిస్
బి) పాంటోథెనిక్ ఆమ్లం
సి) బయోటిన్
డి) పొలాసిస్

2) డెంగీ జ్వరం వచ్చినప్పుడు మనిషి శరీరంలో రక్తంలో కలిగే మార్పులు ఏవి ?
ఎ) ల్యూకోసైట్స్ విపరీతంగా పెరగడం
బి) రక్త ఫలకికల సంఖ్య తగ్గడం
సి) రక్త ఫలకికల సంఖ్య పెరగడం
డి) పైవన్నీ

3) ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించే ఎరిత్రోపాయిటిన్ హార్మోన్ ఏ అవయవం నుంచి విడుదలవుతుంది ?
ఎ) మూత్రపిండం
బి) క్లోమం
సి) కాలేయం
డి) ఆస్థిమజ్జ

4) రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం ఎంత ?
ఎ) 2 నిమిషాలు
బి) 15 నిమిషాలు
సి) 5 నిమిషాలు
డి) 60 నిమిషాలు

5) ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసే తెల్లరక్త కణాలు ఏవి ?
ఎ) మోనోసైట్లు
బి) బి-లింఫోసైట్లు
సి) టి- లింఫోసైట్లు
డి) పైవన్నీ

6) మానవుని శరీరంలో ఉండే ఏ రక్త కణాలు ఆక్సిజన్ ను రవాణా చేస్తాయి ?
ఎ) ఎర్రరక్త కణాలు
బి) తెల్లరక్త కణాలు
సి) థ్రాంబోసైట్లు
డి) పైవన్నీ

7) రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?
ఎ) హెర్పటాలజీ
బి) హిప్నాలజీ
సి) హెపటాలజీ
డి) హెమాటాలజీ

8) రక్త కణాల సంఖ్యను లెక్కించడానికి ఉపయోగించే పరికరం ఏది ?
ఎ) స్పిగ్మోమానోమీటర్
బి) ఇసిజి ( ఎలక్ట్రో కారిమో గ్రాఫ్)
సి) హీమోసైటోమీటర్
డి) హీమోగ్రామ్

9) రక్తస్కంధనం జరిపే రక్త కణాలు ఏవి ?
ఎ) ల్యూకోసైట్లు
బి) థ్రాంబోసైట్లు
సి) ఎరిత్రోసైట్లు
డి) పైవన్నీ

10) తెల్ల రక్త కణాలన్నింటిలో పెద్దది ఏది ?
ఎ) బెసోఫిల్
బి) న్యూట్రోఫిల్
సి) లింఫోసైట్
డి) మోనోసైట్

11) ఏ వ్యాధి ఉన్న వారిలో రక్త స్కంధనం ఆలస్యం అవుతుంది ?
ఎ) హిమోఫిలియా
బి) అల్జీమర్స్
సి) థలసెమియా
డి) సికిల్ సెల్ ఎనీమియా

12) ఏ రక్త వర్గం గల వ్యక్తి ఎవరి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు ?
ఎ) ఎబి రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
బి) ఒ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
సి) ఎ/ఒ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
డి) ఎ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే

13) శ్వాస వాయువులను రవాణా చేసే రక్త కణాలు ఏవి ?
ఎ) థ్రాంబోసైట్లు
బి) ఎరిత్రోసైట్లు
సి) ల్యూకోసైట్లు
డి) పైవన్నీ

14) ప్రపంచ రక్తదాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
ఎ) జూన్ 4
బి) జూలై 14
సి) జూలై 16
డి) జూన్ 14

15) విశ్వదాత  అని ఏ రక్త వర్గాన్ని అంటారు ?
ఎ) ఒ నెగిటివ్
బి) ఒ గ్రూపు
సి) ఎబి గ్రూపు
డి) ఎ గ్రూపు

16) మానవుని రక్తంలో ప్రతి రక్షకాలు ఎక్కడ ఉంటాయి ?
ఎ) రక్త ఫలకికలు
బి) తెల్ల రక్తకణాలు
సి) ప్లాస్మా
డి) ఎర్ర రక్తకణాలు

17) ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళం ఏది ?
ఎ) సిర
బి) పుపుస సిర
సి) పుపుస ధమని
డి) ధమని

18) మానవ శరీరంలో ఎర్రరక్త కణాల జీవత కాలం ఎంత ?
ఎ) 130 రోజులు
బి) 150 రోజులు
సి) 120 రోజులు
డి) 140 రోజులు

19) రక్తపోటును కొలుచు సాధనం పేరు  ఏమిటి ?
ఎ) బారోమీటర్
బి) థర్మామీటర్
సి) సిగ్మోమానోమీటర్
డి) లాక్టోమీటర్

20) ఏ రక్త వర్గంలో ప్రతిజనకాలు ఎ,బి ఉంటాయి ?
ఎ) ఒ గ్రూపు
బి) ఎబి గ్రూపు
సి) ఎ గ్రూపు
డి) బి గ్రూపు

21) మానవుని రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
ఎ) కార్ల్ లాండ్ స్టీనర్
బి) మాల్ఫీజీ
సి) విలియం కాఫ్
డి) విలియం హార్వే

22) రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది ?
ఎ) 55
బి) 60
సి) 40
డి) 20

23) రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే సహజకారకం ఏది ?
ఎ) ప్రోథ్రాంబిన్
బి) EDTAC
సి) హెపారిన్
డి) సోడియం సిట్రేట్

24) రక్తం అనేది ఒక ?
ఎ) ప్రోటిన్
బి) సంధాయక కణజాలం
సి) కండర కణజాలం
డి) ఉపకళా కణజాలం

25) చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే రక్తనాళం ఏది ?
ఎ)  సిర
బి) పుపుస సిర
సి) పుపుస ధమని
డి) ధమని