Wednesday, October 23

డిఎస్సీ మెరిట్ జాబితాపై సీఎం జగన్ కు ఫిర్యాదు

ఒక ఉద్యోగానికి వేరువేరు పరీక్షలు నిర్వహించి ఉమ్మడిగా ఒకే మెరిట్ జాబితా తయారు చేసి గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని డీఎస్సి 2018 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు తాడేపల్లి వచ్చారు. గత ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకపోవడంతో మెరిట్ విద్యార్థులు నష్టపోయారని అన్నారు. తమకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు.

ఒక ఉద్యోగానికి వేరువేరు పరీక్షలు నిర్వహించి ఉమ్మడిగా ఒకే మెరిట్ జాబితా తయారు చేసి గత ప్రభుత్వం తమ అన్యాయం చేసిందని డీఎస్సి 2018 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు జగన్ ను కలిసేందుకు అమరావతి తరలివచ్చారు.
మెరిట్ జాబితా సిద్ధం చేసి సాధారణ ప్రక్రియలో న్యాయం చేయాలని కోరారు. డీఎస్సి కి సంబంధించి ఆన్ లైన్ పరీక్షలను 13 రోజుల పాటు వేర్వేరుగా నిర్వహించడం వల్ల ఎంతో మంది నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పేపర్లలో పరీక్షలు రాసిన వారి మధ్య మార్కుల్లో భారీగా వ్యత్యాసం ఉందన్నారు. స్టేట్ బ్యాంక్ పీవో లు, జేఈఈ మాదిరిగా నార్మలైజేషన్ ప్రక్రియలో పరీక్షలు జరిపితే న్యాయం జరిగేదని అన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకపోవడంతో మెరిట్ విద్యార్థులు నష్టపోయారని అన్నారు. తమకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయాలని డీఎస్సీ 2018 అభ్యర్థులు కోరారు