గ్రూప్ 1 లో ఇంటర్వ్యూలు రద్దు

గ్రూప్ 1 లో ఇంటర్వ్యూలు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో APPSC రిక్రూట్ మెంట్ విధానంలో కీలక మార్పులు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. APPSC గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. అన్ని కేటగిరీల్లోనూ ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. APPSC చేసిన ప్రతిపాదనలతో ఇంటర్వ్యూ విధానం రద్దు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పాదర్శకత కోసం ఈ ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసినట్టు తెలిపింది.