Thursday, September 24

IBPS 2020 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా

ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS) 2020 రూరల్ బ్యాంక్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈనెల 12, 13 తేదీల్లో వీటిని నిర్వహిస్తామని నోటిఫికేషన్ సమయంలో అంటే 10 ఆగస్టు 2020 నాడు IBPS ప్రకటించింది. అయితే ప్రస్తుతం కొన్ని అనుకోని పరిస్థితుల్లో 12.09.2020 మరియు 13.09.2020 నాడు జరగాల్సిన CRP-RRB-IX ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు IBPS డైరక్టర్ వెల్లడించారు. మళ్ళీ ఈ ఆన్ లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేది వెబ్ సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు తదుపరి తేదీల కోసం www.ibps.in ను రెగ్యులర్ గా విజిట్ చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఓ నోటీస్ ద్వారా వెబ్ సైట్ లో ఉంచారు ( నోటీస్ కింద ఇవ్వడమైనది. అలాగే లింక్ కూడా ఇస్తున్నాం )

దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ ఆఫీసర్లు (Scale-I, II & III) మరియు గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్ ) పోస్టులకు ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్ ) పోస్టులకు రెండు దశల్లో ఎగ్జామ్స్ ను IBPS నిర్వహించనుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో Short listed అభ్యర్థులను మెయిన్స్ ఎంపిక చేస్తారు. మెయిన్స్ లో short listed candidates ను ఇంటర్వ్యూలకి పిలుస్తారు.

ప్రస్తుతం IBPS ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా పడటంతో అభ్యర్థుల ప్రిపరేషన్ కి మరికొంత సమయం దొరికినట్టయింది. ప్రిలిమ్స్ & మెయిన్స్ కలిపి వ్యూహంతో చదువుకోడానికి ఇది చక్కని అవకాశం అని భావించగలరు. All the best....

IBPS POSTPONED

IBPS Website