JAN 10 CURRENT AFFAIRS

JAN 10 CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) అపోటో టైర్స్ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ శంకుస్థాపన చేశారు.
జ: చిత్తూరు జిల్లాలో సత్యవేడు శ్రీ సిటీకి
2) విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏ విద్యాసంస్థకు జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థగా గుర్తింపు వచ్చింది ?
జ: విశాఖ పెట్రోలియం విశ్వవిద్యాలయం

జాతీయం
3) ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయ సంతతి పార్లమెంటేరియన్ల తొలి సదస్సు ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ. ప్రధాని నరేంద్ర మోడీ
(మొత్తం 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు)
4) గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి 102 యేళ్ళు (జనవరి 9) పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం ఏంటి ?
జ: భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సు
5) భారత్ లో ప్రవాస భారతీయ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: జనవరి 9
(నోట్: 1915లో గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన రోజు)
6) ప్రతి యేటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?
జ: జనవరి 25
7) ఆధార్ సమాచార భద్రత, ఎదుర్కోవాల్సిన సవాళ్ళపై ‘బయో మెట్రిక్, భారత్ లో దాని ప్రభావం’ పేరుతో నివేదిక రూపొందించినది ఎవరు ?
జ: ఎస్ .అనంత్ ( ది ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ లో అధ్యాపకుడు)
8) పాపులర్ రమ్ బ్రాండ్ ఓల్డ్ మంక్ వ్యవస్థాపకుడు చనిపోయారు. ఆయన పేరు ఏది
జ: కపిల్ మోహన్
9) ఇస్రో తన 100వ ఉపగ్రహాన్ని ఈనెల 12న నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించనుంది. అందుకోసం ఉపయోగిస్తున్న వాహక నౌక ఏది
జ: PSLV-C40
10) దేశంలోనే అత్యంత వేగవంతమైన మొదటి మల్టీ పెటా ఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్ ను ఎక్కడ నెలకొల్పారు ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటలర్జీ, పుణె
11) ఏ సామాజిక మాద్యమం ద్వారా ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుక్ చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు ?
జ: ఫేస్ బుక్, ఇండేన్
12) అమర్ నాథ్ యాత్రను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నట్టు బోర్టు ప్రకటించింది ?
జ: జూన్ 28 నుంచి
13) విద్యార్థులకు ఆరోగ్యకర ఆహారంపై భారత ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) రూపొందించిన పుస్తకం ఏది ?
జ: ఎల్లో బుక్
14) బాలికలకు పీజీ వరకూ ఉచిత విద్య అందించాలని సిఫార్సు చేసిన కేంద్ర సలహామండలి ( సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ - కేబ్ ) ఉపసంఘం ఛైర్మన్ ఎవరు ?
జ: కడియం శ్రీహరి
15) ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్ ను 42వ అంతర్జాతీయ కోల్ కతా బుక్ ఫెయిర్ 2018 లో ఎవరికి బహుకరించారు ?
జ: సౌమిత్రా ఛటోపాధ్యాయ్ ( నటుడు)
16) దేశంలో రెండో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
(నోట్: మొదటిది పుణేలో ఉంది. దీనికి ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఛైర్మన్ గా ఉన్నారు )
17) డోపింగ్ టెస్టులో పట్టుబడి ఐదు నెలల నిషేధానికి గురైన భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: యూసుఫ్ పఠాన్

అంతర్జాతీయం
18) ప్రపంచంలో అత్యంత ఉష్ణోగ్రతలతో మండిపోయే ఏ ఎడారి ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకుంది ?
జ: సహారా ఎడారి
19) ఎన్నాళ్ళ నుంచో శత్రుత్వంగా ఉన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల అధికారుల మధ్య చర్చలు ఎక్కడ జరిగాయి ?
జ: పాన్ ముంజోమ్ (సరిహద్దు ప్రాంతం)
20) భారత్ కు చెందిన హజ్ యాత్రికుల సంఖ్యను సౌదీ అరేబియా ఎంతకు పెంచింది ?
జ: 5 వేల మంది ( మొత్తం 1,75,025 మంది వెళ్ళే అవకాశం ఉంటుంది )