JAN 11 CURRENT AFFAIRS

జాతీయం
3) నిర్మాణ రంగం, సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఎంత వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది
జ: వంద శాతం
4) విమానయాన రగంలో ఎంత శాతం FDI లకు కేంద్రం అంగీకరించింది ?
జ: 49శాతం
5) పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకాన్ని ( MP LADS) ను ఎప్పటి వరకూ కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ?
జ: 31.3.2020 వరకూ
6) పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఒక్కొక్కరికి ఏటా ఎంతమొత్తాన్ని ఎంపీ లాడ్స్ కింద కేంద్రం ఇస్తోంది ?
జ: రూ.5కోట్లు
7) భారత్ -ఏషియాన్ సంబంధాలకు 25యేళ్ళు పూర్తయ్యాయి. 25వ సదస్సు ఎక్కడ జరుగుతోంది
జ: న్యూ ఢిల్లీలో (10 దేశాలు పాల్గొంటున్నాయి)
8) ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత కేసుల విచారణ మళ్లీ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అల్లర్లు ఎప్పుడు జరిగాయి ?
జ: 1984లో
9) 2017కు సంబంధించి ఫేస్ బుక్ లో అత్యున్నత ర్యాంకింగ్ సాధించిన లోక్ సభ్యుల్లో ప్రథమంగా నిలిచింది ఎవరు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
(నోట్: రెండు : అసదుద్దీన్ ఓవైసీ, మూడు : భగవంత్ మాన్ )
10) 2017కు సంబంధించి ఫేస్ బుక్ లో అత్యున్నత ర్యాంకింగ్ సాధించిన రాజ్యసభ సభ్యుల్లో ప్రథమంగా నిలిచింది ఎవరు ?
జ: సచిన్ టెండూల్కర్
(నోట్: రెండు : ఆర్ .కె.సిన్హా, మూడు: అమిత్ షా )
11) 2017కు సంబంధించి ఫేస్ బుక్ అత్యున్నత ర్యాంకింగ్ సాధించిన ముఖ్యమంత్రుల్లో ప్రథమంగా నిలిచింది ఎవరు
జ: యోగి ఆదిత్య నాథ్
(రెండు: వసుంధరా రాజె, మూడు: విజయ్ రూపానీ )
12) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కె.శివన్
(నోట్: అంతరిక్ష శాఖ కార్యదర్శిగా, అంతరిక్ష కమిషన్ ఛైర్మన్ గా కూడా నియమితులయ్యారు )
13) 2018 లో భారత్ వ్రుద్ధి ఎంత శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ?
జ: 7.3 శాతం
14) ఆగ్రో ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ప్రారంభించిన పథకం ఏది
జ: ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన
15) పూర్తిగా మహిళలే పనిచేస్తున్న రైల్వే స్టేషన్ గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2018 లో స్థానం పొందిన రైల్వే స్టేషన్ ఏది ?
జ: మతుంగ రైల్వే స్టేషన్
16) దేశంలోనే తొలిసారిగా బస్సులు, మెట్రో రైళ్ళల్లో ప్రయాణానికి కామన్ మొబిలిటీ కార్డును ఏ నగరంలో ప్రవేశపెట్టారు ?
జ: ఢిల్లీ
17) సిక్కింకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన బాలీవుడ్ దిగ్గజం ఎవరు ?
జ: ఎ.ఆర్. రెహమాన్
18) ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ?
జ: జనవరి 10
19) స్కీయింగ్ లో భారత్ కు మొదటి అంతర్జాతీయ పతకం తెచ్చిపెట్టినది ఎవరు ?
జ: ఆంచల్ ఠాకూర్ ( హిమాచల్ ప్రదేశ్ ప్లేయర్ )

అంతర్జాతీయం
20) ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి అల్లుడు రిషి సునాక్ కు బ్రిటన్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. దీంతో ఎంతమంది భారత సంతతి వ్యక్తులు మంత్రులుగా కొనసాగుతున్నారు
జ: నలుగురు
21) ప్రపంచంలోనే పెద్ద ఐస్ ఫెస్టివల్ ఏ దేశంలో జరుగుతోంది ?
జ: చైనా
22) ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను నిషేధించిన దేశం ఏది ?
జ: ఇరాన్

 

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/