JAN 13 CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) జన్మభూమి - మావూరు నిర్వహణలో రాష్ట్రంలో అగ్రస్థానం దక్కించుకున్న జిల్లా ఏది ?
జ: కృష్ణా జిల్లా
2) ఏ దేశానికి చెందిన నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అమరావతిలో కేంద్రం ఏర్పాటుకు అంగీకరించింది ?
జ: సింగపూర్
3) తమిళనాడులోని కావేరీ నదికి ఎక్కడ నుంచి గోదావరి నది నీటిని తరలించాలని కేంద్ర భావిస్తోంది
జ: అకినేపల్లి
4) సేద్యంలో రైతుల సందేహాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఏ సంస్థతో కలసి పనిచేయనుంది ?
జ: రిలయన్స్ ఫౌండేషన్
5) సుప్రీంకోర్టులోని ఏ జడ్జినైనా అభిశంసించేందుకు రాజ్యాంగంలోని ఏ నిబంధన వర్తిస్తుంది ?
జ: 124 (4)
6) పులుల గణనలో భాగంగా అటవీ శాఖాధికారులు లెక్కించిన ప్రకారం నల్లమలలో ఎన్ని పులులు ఉన్నాయి ?
జ: 15 పెద్ద పులులు 3 కూనలు
7) రాష్ట్రంలో రైతు రుణమాఫీ కింద 3 విడతగా ప్రభుత్వం ఎంత మొత్తం విడుదల చేసింది
జ: రూ.2877 కోట్లు (36.72 లక్షల మంది రైతులకు)
8) నవ్యాంధ్రను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు వెయ్యి ఎకరాలతో బెంగళూరు ++ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు
జ: అనంతపురం జిల్లాలో

జాతీయం
10) భారత ప్రధాన న్యాయమూర్తిపై న్యూఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు ?
జ: జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్
11) గతంలో న్యాయమూర్తుల నియమాకాలపై కొలీజియం వ్యవస్థను వ్యతిరేకించి, నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు ?
జ: జస్టిస్ జాస్తి చలమేశ్వర్
12) ఇస్రో వంద ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 31 శాటిలైట్స్ ను దేని ద్వారా పంపారు
జ: PSLV -C40
13) జనవరి 14 నుంచి ఆరు రోజుల పర్యటనకు వస్తున్న బెంజమిన్ నెతన్యాహు ఏ దేశానికి ప్రధాని ?
జ: ఇజ్రాయెల్
14)భారతీయ భాషలన్నింటినీ సులభంగా నేర్చుకునేందుకు భారతి అనే లిపిని తయారు చేసిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎవరు ?
జ: డాక్టర్ బి.శ్రీనివాస్ చక్రవర్తి
15) ఏ రెండు మొబైల్ ఆపరేటర్ల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆమోదం తెలిపింది ?
జ: ఐడియా - వోడా ఫోన్

16) కౌన్ బనేగా కరోడ్ పతిలో గెలుచుకున్న రూ.25 లక్షల రూపాయలను బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ ఎవరు ?
జ: పి.వి. సింధు

అంతర్జాతీయం
17) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగ కార్యక్రమం అయిన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్’ కు హాజరు కావాలని పిలుపు అందుకున్న NRI ఎవరు ?
జ: సునయన దుమాల ( జాత్యాహంకార కాల్పుల్లో చనిపోయిన NRI శ్రీనివాస్ కూచిభొట్ల భార్య )

 

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/