19 JAN CURRENT AFFAIRS

ఆంధ్రప్రదేశ్
1) గన్నవరం నుంచి ముంబైకి విమాన సేవలను ఎవరు ప్రారంభించనున్నారు ?
జ: కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
2) ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరిని నియమించింది ?
జ: ఆర్పీ సిసోడియా
3) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO-FIYO) నుంచి అవార్డు అందుకున్న సంస్థ ఏది ?
జ: ప్రియా ఫుడ్స్ (ఉసోదయా ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్)

జాతీయం

4) ఢిల్లీలో జరిగిన వస్తు సేవల పన్ను మండలిలో ఎన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ?
జ: 29 వస్తువులు, 54 సేవలు
5) మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు CEC తేదీలను ప్రకటించింది. ఆ రాష్ట్రాలేవి ?
జ: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్
6) అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి AGNI-5ని మన శాస్త్రవేత్తలు ఐదోసారి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఎన్నివేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు
జ: 5 వేల కిమీ
7) అగ్ని 5 యొక్క మొదటి ప్రయోగాన్ని ఎప్పుడు విజయవంతంగా నిర్వహించారు ?
జ: 2012 ఏప్రిల్ 19న
8) ఈ ఏడాది జాతీయ బాలల సాహస అవార్డులను ఎంతమందికి ప్రకటించారు ?
జ: 18 మందికి
9) చెన్నైలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO-FIYO) అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు ?
జ.: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
10) చిన్న వ్యాపారుల కోసం విడుదలైన ఆండ్రాయిడ్ యాప్ ఏది ?
జ: వాట్సాప్ బిజినెస్
11) భారత్ పై యుద్దానికి కుట్ర చేస్తున్నారని ఏ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ అభియోగ పత్రాలు దాఖలు చేసింది ?
జ: హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్
12) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అవార్డుల్లో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఎవరికి దక్కాయి
జ: విరాట్ కోహ్లీ
13) ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు ?;
జ: విరాట్ కోహ్లీ

అంతర్జాతీయం
14) తప్పుడు వార్తలు (ఫేక్ న్యూస్) ఇస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవార్డులు ప్రకటించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది ఏ పత్రిక ?
జ: న్యూయార్క్ టైమ్స్
15) న్యూ జెర్సీ అటార్నీ జనరల్ గా నియమితులైన ఇండో అమెరికన్ ఎవరు ?
జ: గుర్బీర్ గ్రేవల్

 

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, అభ్యర్థుల కోసం ఈ కింది వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్ బుక్ ఖాతాలను ఓపెన్ చేశాం. జాయిన్ అవగలరు.

1) AP TRT&TET (Whatsapp)
https://chat.whatsapp.com/9fIgnM2qIwDF9xjjvyHQjP

2) ANDHRAEXAMS.COM (Whatsapp)
https://chat.whatsapp.com/Dx8wlXbujoo8V9RxX6ZbMx

3) AP TRT & TET ( TELEGRAM)
https://t.me/joinchat/GPhsigzvdsrqGJnUDu2KQg

4) ANDHRA EXAMS (FACE BOOK PAGE)
https://www.facebook.com/Andhra-exams-180377329217436/