JAN 9 – CURRENT AFFAIRS

రాష్ట్రీయం
1) మహిళలపై వేధింపుల గురించి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏపీ పోలీసులు నిర్వహిస్తున్నా యాప్స్ ఏంటి ?
జ: ఐక్లిక్, అభయం
2) తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్ గా ఎవరి నియామకం ఖరారైంది
జ: పుట్టా సుధాకర్ యాదవ్
3) కేంద్ర ప్రభుత్వం ఆయకట్టు అభివృద్ధి నీటి నిర్వహణ (కాడ్వామ్)కింద ఏపీకి చెందిన ఎన్ని ప్రాజెక్టులను చేరుస్తున్నట్టు జలవనరుల శాఖ ప్రకటించింది ?
జ: 21 ప్రాజెక్టులు

జాతీయం
4) మార్కెట్ లో తక్కువకే పంటను అమ్ముకోవాల్సి వస్తే ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇలాంటి పథకం మధ్యప్రదేశ్ లో ఇప్పటికే అమల్లో ఉంది. దాని పేరేంటి ?
జ: భవంతర్ భుగతాన్ యోజన
5) ప్రపంచ సోలార్డ్ దిగ్గజ కంపెనీల్లో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన సంస్థ ఏది ?
జ: అదానీ గ్రూప్ ( టాప్ 12)
6) ఏ దేశ సరిహద్దుల్లో రూ.416.73 కోట్లతో 14,460 బంకర్లు నిర్మించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది ?
జ: పాకిస్తాన్
7) కేంద్ర చలన చిత్ర ధృవీకరణ మండలి ఆమోదించినా ఏ రాష్ట్రంలో పద్మావత్ ను నిషేధించారు ?
జ: రాజస్థాన్
8) అప్రమత్తంగా ఉండి సమయస్ఫూర్తిని ప్రదర్శించే ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ పేరుతో ఏ సంస్థ అవార్డులు ఇస్తుంది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
9) భారత విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి గా ఎవరు నియమితులయ్యారు ?
జ: టి.ఎస్. తిరుమూర్తి
10) జాతీయ గుడ్డు సమన్వయ సంఘం (నెక్) అధ్యక్షురాలిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
జ: అనూరాధా జే దేశాయ్

11) స్వలింగ సంపర్కానికి సంబంధించిన శిక్షలపై కేసును పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.  ఐపీసీలో ఏ సెక్షన్ కింది స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారు ?
జ: ఐపీసి 377
12) ఇంద్రావతి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: ఒడిశా
13) ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ నెల 6 నుంచి జరుగుతున్న న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ థీమ్ ఏంటి ?
జ: Environment and Climate change
14) ఈసారి న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ లో ఎక్కువ ఏ దేశాల బుక్స్ అందుబాటులో ఉన్నాయి ?
జ: యూరోపియన్ యూనియర్ ( 40 దేశాలు)
15) 2018 అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (ఉత్తరాయణ్) గుజరాత్ లోని ఏ నగరంలో జరుగుతోంది
జ: అహ్మదాబాద్
16) వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ 2018 ను దేశంలోని ఏ నగరంలో నిర్వహిస్తున్నారు ?
జ: హైదరాబాద్
17) సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూ్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: తమిళనాడు

అంతర్జాతీయం
18) 5 లక్షల ఏళ్ల నాటి రాతి గొడ్డళ్ళును ఎక్కడ గుర్తించారు ?
జ: జెరూసలేం లోని జుల్ జులియా (ఇజ్రాయెల్)
19) వాష్టింగ్టన్ లో చనిపోయిన జాన్ వాట్స్ యంగ్ ఏ రంగానికి చెందినవారు ?
జ: వ్యోమగామి ( ఎక్కువసార్లు అంతరిక్షయానం చేశారు. చంద్రుడిపై నడిచిన అమెరికా వ్యోమగామి)
20) అతిపెద్ద ప్రధాన సంఖ్యను అమెరికాకి చెందిన జొనాథన్ పేస్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కనిపెట్టాడు. అందులో ఎన్ని అంకెలు ఉన్నాయి ?
జ: 2,32,49,425
21) తప్పుడు, మోస పూరితమైన వార్తలు రాస్తున్నారంటూ మీడియాకి ఫేక్ న్యూస్ అవార్డులు ఇస్తానని చెప్పిన దేశాధ్యక్షుడు ఎవరు ?
జ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
22) డ్రామా టెలివిజన్ సిరీస్ లో ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఎవరు ?
జ: స్టెర్లింగ్ కె బ్రౌన్
23) హాప్ మన్ కప్ టోర్నమెంట్ 2018 ను ఏ దేశం గెలుచుకుంది ?
జ: స్విట్జర్లాండ్
24) హిమాలయన్ హైడ్రో ఎక్స్ పో 2018 ఏ నగరంలో జరుగుతోంది ?
జ: ఖాట్మండు

25) మహిళలు, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని చట్టం చేసిన మొదటి దేశం ఏది ?
జ: ఐస్ లాండ్
26) యునెస్కో డైరక్టర్ జనరల్ ఎవరు ?
జ: ఆడ్రీ అజౌలే
27) యునెస్కో నుంచి అమెరికాతో పాటు తప్పుకుంటున్నట్టు ప్రకటించిన దేశం ఏది
జ: ఇజ్రాయెల్
28) VAT ను ప్రవేశపెట్టిన మొదటి గల్ఫ్ దేశం ఏది
జ: సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
29) Whistled అనే భాషను పక్షుల భాష అంటారు. దీన్ని ఏ దేశంలోని ఓ గ్రామంలో ప్రజలు మాట్లాడతారు ?
జ: టర్కీ

===============================================

SI