నాజూగ్గా ఉండాలా ? ఈ చిట్కా పాటించండి !
ప్రతి రోజూ ఉదయం జాగింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం ఒత్తిడికి గురవకుండా ఈ జాగింగ్ తో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
జాగింగ్ చేయడం చాలా ఈజీ.. సింపుల్ కూడా...
జాగింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా జాగింగ్ చేసే వారిలో దీర్ఘాయుష్యు కూడా పెరుగుతుంది. శరీరకంగా ఫిట్ గా ఉండటంతో పాటు.. క్యాలరీలు కరిగించుకొని బాడీ ఫ్రెష్ గా కనబడాలంటే జాగింగ్ అవసరం.
జాగింగ్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
1. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యులర్ జాగింగ్ అనేది గ్రేట్ కార్డియో వర్కౌట్. ఇది హార్ట్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. గుండె మరింత మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. జాగింగ్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జాగింగ్ వల్ల రక్తం వేగంగా గుండెకు చేరేలా చేసి, గుండె సంబంధిత సమస్యలు, వ్యాధులు దూరం చేస్తుంది.
2. మానసిక ఆరోగ్యాన్ని మెరుగవుతుంది. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతతకు సాయం చేస్తాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ సహజంగానే స్ట్రెస్, టెన్షన్ తగ్గిస్తాయి. దాంతో శరీరం రీఫ్రెష్ గా ఉంటుంది..
3. ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతి రోజూ అవసరమైన బోన్ టిష్యూలు జాగింగ్ వల్ల తయారవుతాయి. జాగింగ్ వల్ల ఎముకల స్ట్రాంగ్ అవుతాయి. ఇది ఎముకల గాయాలను కూడా మాన్పిస్తుంది.
4. కండరాలు వృద్ధి. జాగింగ్ వల్ల శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటంతో కండరాలు వృద్ధి అవుతాయి. హామ్ ట్రింగ్స్, గ్లూటిల్ మజిల్స్, కాఫ్ మజిల్స్ లాంటి వాటిని టార్గెట్ చేస్తుంది. జాగింగ్ వల్ల కండరాలు కరగడంతో బాడీ షేప్ మారి చూడటానికి అందంగా తయారవుతారు.
5. జాగింగ్ తో బరువు తగ్గుతారు. శరీరంలో అదనపు క్యాలరీలు తగ్గుతాయి. అయితే ఒక్క జాగింగ్ తోనే ఎఫెక్టివ్ నెస్ ఉండకపోవచ్చు. అందువల్ల జాగింగ్ తో పాటు డైట్ లో మార్పు రావాలి. అప్పుడే వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏరోబిక్ ఎక్సర్ సైజ్ వల్ల శరీరంలోని జీవక్రియలు వేగంగా పనిచేస్తాయి. దాంతో ఫ్యాట్ కరగడం ఈజీ అవుతుంది.
6. జాగింగ్ వల్ల శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుతుంది. ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యం మెరుగవుతుంది. అందుకు రెస్పిరేటరీ మజిల్స్ సహాయపడుతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా జాగింగ్ చేయండి.
7. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరంలో వ్యాధులు , ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి అధికమవుతుంది. జాగింగ్ శారీరక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అందువల్ల మానసిక ఒత్తిడి, డిప్రెషన్, అలసట తగ్గుతాయి.
8. ఆలోచన శక్తి మెరుగవుతుంది. ఆందోళనలో ఉన్నప్పుడు జాగింగ్ తప్పకుండా సాయపడుతుంది. మీ ఆలోచన శక్తిని మెరుగవుతుంది. జాగింగ్ చేసేటప్పుడు మీ ఆలోచనలను జ్ఞప్తికి తెచ్చుకోండి. మంచి, చెడులను తార్కికంగా ఆలోచించండి. ప్రశాంత వాతావరణంలో మీకు తప్పకుండా పరిష్కార మార్గం దొరుకుతుంది.
9. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికీ జాగింగ్ చాలా మేలు చేస్తుంది. జాగింగ్ వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జాగింగ్ తో శరీరంలో, చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనిపిస్తారు.