JULY CURRENT AFFAIRS -02

JULY CURRENT AFFAIRS -02

1. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్ లైన్ ద్వారా బీఎస్సీ డిగ్రీని ( ప్రోగ్రామింగ్, డాటా సైన్స్ కోర్సులను ) కేంద్ర మంత్రులు రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్, సంజయ్ ధోత్రే ప్రారంభించారు. ఏ సంస్థ ఈ కోర్సును అభివృద్ధి చేసింది ?

2. చైనా నుంచి దిగుమతి అవుతున్న ఎన్ని ఉత్పత్తులను తగ్గించుకోవాలని భారత్ నిర్ణయించింది ?

3. చైనాలో ఇంకో వైరస్ పుట్టింది.  అది ప్రపంచ మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని చైనా సైంటిస్టులు గుర్తించారు. దాని పేరేంటి ?

4. నిషిద్ధ ఉత్ర్పేరకాలు, అనుకోకుండా వాటి వాడకం గురించి క్రీడాకారుల్లో అవగాహన పెంచేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కొత్త యాప్ ను రూపొందించింది.  దీన్ని ఢిల్లీలో కేంద్రం క్రీడల మంత్రి కిరణ్ రిజుజు ప్రారంభించారు. దాని పేరేంటి ?

5. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్యాకేజీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి?

1) దేశంలోని 30 లక్షల MSME పరిశ్రమలు, ఇతర వ్యాపారుల కోసం 2020 జూన్ 26 వరకూ రూ.1లక్షల కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది

2) ఏపీలోని 1,95,832 ఖాతాలకు రూ.2,901.93 కోట్లు మంజూరు చేసింది

3) తెలంగాణలో 85,763 ఖాతాలకు  రూ.2,248.42 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి

6. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ( 2020-21) మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) ద్రవ్యలోటు ఎంతగా నమోదైంది ?

7. తెలంగాణలో ప్రభుత్వ రుణపరిమితిని 3 నుంచి ఎంత శాతానికి పెంచుకునేందుకు వీలుగా ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (FRBM) చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ చేసింది ?

8. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జో బిడెన్ టీమ్ లో ఇండియన్ అమెరికన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  బిడెన్ తరపున క్యాంపెయిన్ కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఎవరు ఎంపికయ్యారు ?

9. ఒరాకిల్ సంస్థ ఇండియాలో తన రెండో డేటా సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఒరాకిల్ మొదటి డేటా సెంటర్ ముంబైలో నడుస్తోంది.

10. దేశంలో 80 కోట్ల మందకి మరో 5 నెలల పాటు ఉచితంగా బియ్యం, కందిపప్పు అందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూ.90 కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ఏ నెల దాకా కొనసాగనుంది


 

 

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ : https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en