JULY CURRENT AFFAIRS QUIZ – 10

JULY CURRENT AFFAIRS QUIZ – 10

1. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రీషియన్ ఇన్ ది వరల్డ్ 2020 అనే పేరుతో 2019 సంవత్సరానికి ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచ జనాభాలో ఎంతశాతం మంది ఆకలితో బాధ పడుతున్నారు ?

2. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో సబ్బులు, డెట్టాల్ లాంటి యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్ సేల్స్ పెరుగుతున్నాయి.  అందుకే శానిటైజర్లపై ఎంత శాతం GST ( వస్తు సేవల పన్ను) వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ?

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఆ రాష్ట్ర కేబినెట్ ఏర్పాటు చేసింది ?

4. ఎన్ని కోట్ల డాలర్లతో అత్యధిక మార్కెట్ విలువను సాధించిన మొదటి దేశీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. (  ప్రపంచంలోని అగ్రశ్రేణి  60 కంపెనీల్లో RIL కు స్థానం దక్కింది )

5. అంతర్జాతీయ సాంకేతిక దగ్గజం గూగుల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కడుతున్నాయి.  స్మార్ట్ ఫోన్లకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అందుబాటు ధరలో 4G, 5G స్మార్ట్ ఫోన్లు ఆవిష్కరించాలని నిర్ణయించాయి.  అయితే రిలయన్స్ లో రూ.33,737 కోట్లు పెట్టుపెట్టేందుకు గూగుల్ అంగీకరించింది.  ఈ మొత్తం ఎంత శాతం వాటా కిందకు వస్తుంది ?

6. బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ సంస్థలకి ఎన్ని కోట్ల రిఫైనాన్స్ సౌకర్యాన్ని నాబార్డ్ కల్పించింది ?

7. కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల 11 హైవే ప్రాజెక్టులకు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు ?

8. న్యుమెనియా వ్యాధిని నిరోధించేందుకు పూర్తిగా దేశీయంగా రూపొందించిన మొదటి టీకాకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది.  ఈ టీకాను రూపొందించిన సంస్థ ఏది ?

9. రబరీ, భర్వాడ్, చరణ్ అనే తెగల వారిని గిరిజనుల కేటగిరీగా గుర్తించేందుకు  సంబంధించి ప్రత్యేక ప్యానెల్ లేదా కమిషన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?

10. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ( ADB) కొత్త ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత ఎన్నికల కమిషనర్ ఎవరు ?