JULY CURRENT AFFAIRS QUIZ -12

JULY CURRENT AFFAIRS QUIZ -12

1. సింగపూర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని లీ సియెన్ లూంగ్ (68) ఆధ్వర్యంలోని ఏ పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది ?

2. సీడ్ ప్రొడక్షన్ కంపెనీ ఈస్ట్ – వెస్ట్ ఇండియా తెలంగాణలో చాముండి, లావా పేరుతో ఏ పంట రకాలను ప్రవేశపెట్టింది ?

3. 2018 పులుల గణన ప్రకారం దేశంలో అత్యధికంగా పులులు ఉన్న మూడు రాష్ట్రాలు ఏవి ?

4. కేంద్ర ప్రభుత్వ చేపట్టిన 2018 పులుల గణన గిన్నిస్ రికార్డులకెక్కింది.  కెమెరాల ద్వారా బంధఇంచిన అతి పెద్ద వన్యప్రాణి సర్వేగా గుర్తిస్తూ గిన్నిస్ బుక్ సంస్థ ధృవీకరణ పత్రం జారీ చేసింది.  దీనికి సంబంధించి ఈ కింద ప్రకటనల్లో సరైనవి ఏవో గుర్తించండి

ఎ) దేశంలోని అభయారణ్యాల్లో 141విభిన్న ప్రాంతాల్లో 26,838 చోట్ల ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి పులుల లెక్కను పక్కాగా లెక్కపెట్టారు

బి) మొత్తం 1,21,337 చదరపు కిలోమీటర్ల పరిధిలో తిరగే పులులపై సర్వే చేశార.

సి) 2018 గణన ప్రకారం భారత్ లో 2,967 పులులు ఉన్నట్టు లెక్క తేల్చారు.

డి) తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో 75శాతం పులులు భారత్ లోనే నివసిస్తున్నట్టు తేలింది.

5. 2020 టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ను ICC వాయిదా వేసింది.  ఈసారి ఏ దేశంలో ఈ టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది ?

6. కరోనా ఐసోలేషన్ వైద్యానికి తెలంగాణలో ఏ పేరుతో కొత్త యాప్ ను తీసుకురావాలని నిర్ణయించింది ?

7. UK చెందిన ఏ యూనివర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన కరోనా వూరస్ టీకా సేఫ్ అని తేలింది.  ది లాన్సెట్ అనే జర్నల్  తమ ఫేజ్ 1 ట్రయల్స్ సక్సెస్ రిజల్ట్స్ ను పబ్లిష్ చేసింది.

8. రోదసీలోకి మొదటి అరబ్ స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది ?

1) అల్ అమల్ పేరుతో ( ఆశా ఉపగ్రహం) 2.5 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని అరబ్ ఎమిరేట్స్ ప్రయోగించింది

2) జపాన్ లోని తనెగషిమా స్పేస్ పోర్ట్ నుంచి H2A రాకెట్ ద్వారా అల్ అమల్ స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా ప్రయోగించింది

3) ఇంటర్ ప్లానెటరీ మిషన్ ను ప్రారంభించిన మొదటి అరబ్ దేశంగా UAE నిలిచింది

4) మార్స్ ను అధ్యయనం చేసేందుకు ఈ అల్ అమల్  ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అమల్ 200 రోజుల ప్రయాణం తర్వాత 2021 ఫిబ్రవరిలో మార్స్ ను చేరుకుంటుంది.

9. ప్రపంచంలో ఏ అతి పెద్ద మురికివాడలో (2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం) కరోనాను విజయవంతంగా ఎదుర్కున్నారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకుంది ( డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనొమ్ ప్రశంసించారు )

10. వెనుకబడిన తరగుల్లోని వివిధ కులాల కోసం కొత్తగా ఎన్ని బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.