JULY CURRENT AFFAIRS QUIZ – 14

JULY CURRENT AFFAIRS QUIZ – 14

1. వీధి వ్యాపారుల కోసం కేంద్రం మొబైల్ యాప్ ను 2020 జులై 17న ప్రారంభించింది.  మైక్రో క్రెడిట్ సదుపాయం కోసం పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి మొబైల్ అప్లికేషన్ ను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ యాప్ ను ప్రారంభించారు.  ఈ పథకం కింద దేశంలో ఎంతమంది వీధి వ్యాపారులకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

2. గ్రామీణ జనాభాలో నాలుగేళ్ళ లోపు బాలల శాతం విషయంలో తెలంగాణ, ఏపీ చిట్టచివరి స్థానంలో ఉన్నాయి. అయితే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?

3. HCL  టెక్నాలజీస్ ఛైర్మన్ స్థానం నుంచి శివ్ నాడార్ వైదొలిగారు.  ఆయన కుమార్తె రోషిణి నాడార్ కు చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించారు.  అయితే భారత్ లోనే అత్యంత ధనవంతురాలైన మహిళగా ఆమెకి గుర్తింపు ఉంది.  రోషిణీకి ఎంత సంపద ఉంది ?

4. దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు ఉపాధి పొందేందుకు సాయపడే ప్రవాసీ రోజ్ గార్ అనే యాప్ ను రూపొందించిన సినీ నటుడు ఎవరు ?

5. దేశంలోని ఏ అటామిక్ ప్లాంట్ లో మొదటి స్వదేశీ అణు రియాక్టర్ విద్యుత్ ఉత్పత్తిని (700 మెగావాట్ల కెపాసిటీ) ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు ప్రధాని నరేంద్రమోడీ 2020 జులై 22నాడు ప్రకటించారు ?

6. రాష్ట్ర వినియోగదారులు హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవిపై కేంద్రం కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవికి ఎవరిని మాత్రమే నియమించాలని ఆదేశాలిచ్చింది ?

7. ఆంధ్రప్రదేశ్ లో  కొత్త మంత్రుల ప్రమాణం, శాఖల మార్పులకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి

1) ధర్మాన కృష్ణ దాస్

2) సీదిరి అప్పల రాజు

3) చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

4) శంకర నారాయణ

 

ఎ) రోడ్లు, భవనాల శాఖ

బి) పశు సంవర్ధక, పాడి పరిశ్రామాభివృద్ధి, మత్య్సశాఖ

సి) బీసీ సంక్షేమం

డి) రెవెన్యూ స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ

8. ధ్రువాస్త్రకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?

ఎ) ప్రపంచంలోనే అత్యాధునిక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్ళల్లో (ATGM) ఒకటైన హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిసైల్)ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది

బి) ఒడిశాలోని బాలాసోర్ ప్రయోగ కేంద్రంలో 2020 జులై 15, 16 తేదీల్లో జరిపిన ప్రయోగం విజయవంతమైంది

సి) ధ్రవాస్త్రగా పిలిచే ఈ మిస్సైల్ ను హెలికాప్టర్ లేకుండానే డైరెక్ట్ గా ప్రయోగించారు

డి) ఫైర్ అండ్ ఫర్గెట్ రకానికి చెందిన 3G యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ధ్రవాస్త్రని DRDO అభివృద్ధి చేసింది.

9. జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్యకు సంబంధించి ఈ కింద తప్పుగా ఇచ్చిన స్టేట్ మెంట్ ఏది ?

ఎ) జాతీయ సగటు :915

బి) తెలంగాణ : 901

సి) ఏపీ : 920

10. కరోనా వ్యాప్తి కట్టడికి కృషి చేస్తున్న DRDO మరో ఆవిష్కరణ చేసింది.  కోవిడ్ బాధితుల కదలికలను కనిపెట్టేందుకు ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించింది.  ఆ యాప్ పేరేంటి ?

11. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఏ సిటీలో ఉన్న చైనా కాన్సులేట్ కార్యాలయాన్ని మూసి వేయాలని అమెరికా ఆదేశించింది ?