9. చైనాతో సరిహద్దు వివాదం, ఉద్రిక్తతల కారణంగా భారత్ అధునాతన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కింది ప్రకటనల్లో సరైనవి ఏవి ?
ఎ) రూ.38,900 కోట్ల ఖర్చుతో అధునాతన అగ్రశ్రేణి విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
బి) రష్యా నుంచి 21 మిగ్ 29 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం భారత్ దగ్గరున్న 59 విమానాలను ఆధునీకరిస్తారు
సి) ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే 248 అస్త్ర క్షిపణులను సమీకరించుకుంటారు. సుఖోయ్ 30 యుద్ధ విమానాలకు వీటిని అనుసంధానిస్తారు
డి) శత్రువులపైకి ఏకధాటిగా రాకెట్లను ప్రయోగించే పినాక క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తాజా ప్రాజెక్టుల్లో రూ.31,130 కోట్ల విలువైన కాంట్రాక్టులు దేశీయ పరిశ్రమలకే దక్కుతాయి.