JULY CURRENT AFFAIRS QUIZ – 6

JULY CURRENT AFFAIRS  QUIZ – 6

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en

1. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో LED వీధి దీపాల ఏర్పాటుకు ఏ పేరు పెట్టారు. ?

2. ఉద్రిక్తంగా మారిన భారత్ – చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ 2020 జులై 7న ప్రారంభమైంది.  అయితే  తూర్పు లద్దాఖ్ లో ఈ రెండు దేశాల బలగాల మధ్య కనీస దూరం ఎన్ని కిలోమీటర్లుగా నిర్ణయించారు ?

3. గంటకు 360 కిలోమీటర్ల గరిష్ట వేగంతో భూకంపం వచ్చినా భయం లేని ప్రయాణాన్ని అందించే N700S పేరుతో బుల్లెట్ ట్రైన్ ను కొత్తగా ప్రారంభించిన దేశం ఏది ?

4. కోవిడ్ 19 ప్రభాతవంతో 117 రోజులు, 4 నెలల క్రితం ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మళ్ళీ ఏయే జట్ల మధ్య 2020 జులై5 నాడు సౌథాంప్టన్ లో మొదలైంది ?

5. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ( SLBC) ఎంతగా నిర్ణయించింది ?

6. దేశంలోని బస్సుల్లో 20శాతం వరకూ సీట్లు పెంచుకునేందుకు వీలుగా కొత్త విధానాన్ని కేంద్ర ఉపరిత రవాణా మంత్రిత్వశాఖ రూపొందిస్తోంది.  దీని ప్రకారం బస్సులు సగటున ఎన్ని మీటర్ల మేర పెరిగే అవకాశం ఉంది ?

7. ICMR విధించిన గడువు 2020 ఆగస్టు 15లోపు కరోనా వైరస్ కి టీకాను తెస్తామని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఫౌండర్ డాక్టర్ కృష్ణ ఎల్ల చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ కు ఏమని పేరు పెట్టారు ?

8. భారత అథ్లెటిక్స్ కు 25 యేళ్ళ పాటు ప్రధాన కోచ్ గా పనిచేసి 74 యేళ్ళ వయస్సు వల్ల నిబంధనల కారణంగా ఆ పదవి నుంచి తప్పుకున్నది ఎవరు ?

9. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని జరుపుకుంది ?

10. తెలంగాణలో పండే పత్తికి ప్రత్యేకంగా తెలంగాణ బ్రాండ్ తో అమ్మకాలు సాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే గతంలో గుజరాత్ లో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో ఏ పేరుతో బ్రాండ్ ఇమేజ్ సాధించింది ?