JULY CURRENT AFFAIRS QUIZ 8

JULY CURRENT AFFAIRS QUIZ  8

1. 2015 లో భారత ప్రభుత్వం ఆర్డర్ చేసిన 22 అపాచీలు, 15 చినూక్ లో మిగిలిన వాటిల్లో అత్యంత ఆధునాతన అపాచీ హెలికాప్టర్లు ఐదు చేరుకున్నాయి.  వీటిని అమెరికాకి చెందిన ఏ సంస్థ తయారు చేసింది ?

2. 49 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో దేశంలోనే మొదటిసారిగా మెరైన్ క్లస్టర్ ను ఏర్పాటుచేసిన రాష్ట్రం ఏది ?

3. కరోనా కంటే వేగంగా న్యుమోనియా వైరస్ ఏ దేశంలో విస్తరిస్తున్నట్టు చైనా ప్రకటించింది ?

4. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ఆర్సెలార్ కంపెనీ యజమాని, బ్రిటన్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ 3.5 మిలియన్ డాలర్లు సాయం చేశారు. ఆయన ఏ యూనివర్సిటీకి ఈ సాయం అందించారు ?

5. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కి అనారోగ్యం కారణంగా ఆ రాష్ట్ర కేర్ టేకర్ బాధ్యతలు చేపట్టిన గవర్నర్ ఎవరు ?

6. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం ధనవంతులు – వారి ర్యాంక్ ను జతపరచండి

1) జెఫ్ బెజోస్ (అమెరికా)

2) బిల్ గేట్స్ (అమెరికా)

3) బెర్నార్డ్ అర్నాల్డ్ (ఫ్రాన్స్)

4) మార్క్ జుకర్ బర్గ్ ( అమెరికా)

5) స్టీవ్ బామర్ (అమెరికా)

 

ఎ) ఒకటో ర్యాంక్

బి) రెండో ర్యాంక్

సి) మూడో ర్యాంక్

డి) నాలుగో ర్యాంక్

ఇ) ఐదో ర్యాంక్

7. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ( CII) కు కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?

8. 2020 ఏడాదికి పీ.సీ. నోబెల్ పేరుతో అందించే అవార్డుకు ఏ భారతీయ ఆర్థికవేత్త పేరును ఎంపికచేశారు ?

9. ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఆసియాకి చెందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు రిలయన్స్ చీఫ్ ముఖేష్ అంబానీ.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం ముఖేష్ అంబానీ ఆదాయం 69.9 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ముకేష్ అంబానీ ర్యాంక్ ఎంత ?

10. భారత దేశానికి వారసత్వ పునాదిగా నిలచే మర్రి, ఉసిరి, రావి, బిల్వ, అశోక వృక్షం లాంటి మొక్కలను నాటేందుకు 2020 జూన్ 28 నుంచి జులై 28 వరకూ ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ? ( పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ సర్వేను చేపట్టింది )


 

IBPS 2020 టెస్టులు, గైడెన్స్ కోసం Telegram లో గ్రూప్ తెరిచాం... ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు. (వాట్సాప్ గ్రూపు లేదు )

https://t.me/ibps2020TSAP