JULY CURRENT AFFAIRS QUIZ – 9

JULY CURRENT AFFAIRS QUIZ – 9

1. చైనాలోని వూహాన్ లో ప్రారంభమైన కరోనా విషయంలో ప్రపంచాన్ని WHO తప్పుదోవ పట్టించిందంటూ ఆ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించిన దేశం ఏది ?

2. లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది.  అందుకోసం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ( GSDP) అంచనాల్లో ఎంత శాతం రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ?

3. టియాగో, నెక్సాన్, ఆల్ట్రోజ్ మోడల్స్ కి ఆరు నెలల EMI హాలిడే ప్రకటించిన దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం ఏది ?

4. (IBPS2020)

భారత్ లో గోల్డ్ ఈటీఎఫ్ లకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి ?

ఎ) గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ( ETF) ల్లోకి 2020 సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో రూ.3500 కోట్లు ఇన్ ఫ్లోస్ వచ్చాయి

బి) కరోనా సంక్షోభంతో చాలామంది బంగారమే సురక్షితమైన పెట్టుబడిగా భావించి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు

సి) గత ఏడాది నుంచి గోల్డ్ ETF లు బెస్ట్ ఫెర్ ఫార్మింగ్ అసెట్ కేటగిరీలో నిలుస్తోంది

డి) అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ( ఆమ్ఫీ) డేటాలో ఈ విషయం వెల్లడైంది.

5. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఎవరు మరోసారి తిరిగి ఎన్నికయ్యారు ?

6. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగా 72 వేల సిగ్ సావర్ అస్సాల్ట్ రైఫిళ్ళను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది ?

7. (IBPS 2020)

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లతో అగ్రి ఇన్ ఫ్రా ఫండ్ ఏర్పాటు చేయనుంది.  ఈ ఫండ్ ఎన్నేళ్ళ పాటు అమలులో ఉంటుంది ?

8. (IBPS2020)

2020 జులై 8నాడు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో సరైనవాటిని గుర్తించండి

ఎ) EPF చెల్లింపులను మరో 3 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.  72 లక్షల మంది ఉద్యోగులకు మేలు చేసేందుకు రూ.4,800 కోట్లను కేబినెట్ కేటాయించింది

బి) పట్టణ, నగరాల్లో వలస కార్మికులు, నిరుపేదలపై ఇంటి కిరాయి భారాన్ని తగ్గించేందుకు అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఈ స్కీమ్ కింద 100 సిటీల్లో మరో 1.15 లక్షల సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టి పేదలకు తక్కువ మొత్తానికి అద్దెకు ఇస్తారు

సి) దేశంలో 7.5 కోట్ల మంది పేదల మహిళలకు LPG సిలిండర్లు అందించేందుకు రూ.13,500 కోట్లను కేబినెట్ కేటాయించింది

డి) ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు మూడింటికీ రూ.12,450 కోట్లను కేబినెట్ కేటాయించింది.

9. ఆంధ్రప్రదేశ్ లో ఏ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది ?

10. కరోనా టీకాపై క్లినికల్ ప్రయోగాలు పూర్తయ్యాయనీ...ప్రపంచంలో ఇలా ప్రయోగాలు పూర్తి చేసిన మొదటి టీకా తమదేనని ఏ దేశంలోని యూనివర్సిటీ ప్రకటించింది ?


 

IBPS 2020 టెస్టులు, గైడెన్స్ కోసం Telegram లో గ్రూప్ తెరిచాం... ఈ కింది లింక్ ద్వారా జాయిన్ అవ్వగలరు. (వాట్సాప్ గ్రూపు లేదు )

https://t.me/ibps2020TSAP

ఆంధ్ర ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=andhraexams.com&hl=en