JUNE CURRENT AFFAIRS QUIZ -1

JUNE CURRENT AFFAIRS  QUIZ -1

1. జీ7 దేశాల సమ్మిట్ ను 2020 సెప్టెంబర్ కంటే ముందే నిర్వహిస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ దేశాల్లోకి ఇండియాతో పాటు ఏయే దేశాలను ఆహ్వానించి G10 లేదా G11 గా మారుస్తామని ట్రంప్ పేర్కొన్నారు ?

2. దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్ళల్లో 750 పురులు చనిపోయినట్టు జాతీయ పులుల సంరక్షణ సంస్థ వెల్లడించింది.  అత్యధికంగా ఏ రాష్ట్రంలో పులులు చనిపోయాయి ?

3. మేడిన్ ఇండియా ఫైటర్ జెట్ ప్రోటో టైప్ తేజస్ ఎన్ యుద్ధవిమానం రెడీ అవుతోంది.  కనీసం ఎయిర్ టు ఎయిర్ మిసైళ్ళని అమర్చే వీలున్న ఈ జెట్ ను ఇటీవల ఏ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై జరిపిన ట్రయల్ ల్యాండింగ్స్ విజయవంతం అయ్యాయి ?

4. 2020 మే 31 నాడు అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ (నాసా)  ఏ ప్రైవేటు సంస్థతో కలసి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను పంపింది.

5. అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన సీనియర్ IAS అధికారి నియమితులయ్యారు. ఆయన పేరేంటి ?

6. లాక్ డౌన్ ప్రభావంత అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం రోజు (జూన్ 3)న దేశీయంగా ప్రఖ్యాతి పొందిన అట్లాస్ సైకిల్ కంపెనీ మూతపడింది.  ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?

7. 2020 జూన్ నాలుగో వారం నుంచి మొదలయ్యే తెలంగాణ హరితహారంలో ఎన్ని కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

8. భారత్ లో వ్యవసాయ రంగానికి మేలు చేసే సేవలు, ఉత్పత్తులను ఆవిష్కరించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన సాఫ్ట్ వేర్ దిగ్గజం ఏది ?

9. ఆస్ట్రేలియాతో భారత్ రక్షణ ఒప్పందం, సైనిక స్థావరాల పరస్పర వినియోగం, విద్య, సాంకేతిక రంగాల్లో మైత్రి బలోపేతం లాంటి అంశాలపై ఆస్ట్రేలియా, భారత్ ప్రధానుల మధ్య వర్చవల్ సదస్సు ( వీడియో కాన్ఫరెన్స్) 2020 జూన్ 4న  జరిగింది. ఇటీవల భారతీయ సమోసా, మామిడి పచ్చడి తయారు చేసి సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు ?

10. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణ నీటి వినియోగ నిష్పత్తి ఎంతగా ఉండాలని కృష్ణా వాటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది ?

11. ఎయిర్ టెల్ లో 5శాతం వాటా కింద రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించిన ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఏది ?

12. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు ?