Thursday, November 14

AMVI, AO, AEI ప్రిలిమినరీ కీలు విడుదల

అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఎఎంవీఐ), అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ (ఏఓ), అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌ (ఏఈఐ) పోస్టుల భర్తీ కోసం గత నెల 17న ఆన్‌లైన్‌లో నిర్వహించిన మెయిన్‌ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ’ప్రాథమిక కీ’ని ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది.

పేపర్‌-1, పేపర్‌-2లకు చెందిన ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ప్రాథమిక కీ పై అభ్యంతరాలను నిర్ధేశిత నమూనాలో ఈ నెల 8లోగా తెలియజేయాలని కోరింది.