Wednesday, October 23

LIC లో ఆంధ్రప్రదేశ్ లో 157 అసిస్టెంట్ పోస్టులు

Life Insurance Corporation of India లో ఆంధ్రప్రదేశ్ ఐదు డివిజన్ల పరిధిలో మొత్తం 157 పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ డివిజన్లలో అసిస్టెంట్స్, క్యాషియర్, సింగిల్ విండో ఆపరేటర్స్, ఖాతాదారుల సేవ తదితర క్లరికల్ విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

డివిజన్ల వారీగా పోస్టుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు : మొత్తం 157

1) మచిలీపట్నం : 24 పోస్టులు
(ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : కైకలూరు, బాపట్ల, నర్సరావుపేట, గుడివాడ, నూజివీడు, రేపల్లె, అవనిగడ్డ, గురజాల, చిలకలూరి పేట్, వినుకొండ, సత్తెనపల్లి )

2) రాజమండ్రి : 11 పోస్టులు
(ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : అమలాపురం, తాడేపల్లి గూడెం, తణుకు, పాలకొల్లు, తుని )

3) వైజాగ్ : 46 పోస్టులు
(ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, పలాస-కాసీబుగ్గ, రాజాం, చోడవరం, నర్సీపట్నం, శృంగవరపు కోట, నరసన్నపేట)

4) కడప : 40 పోస్టులు
(ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : హిందూపూర్, ఆదోని, ప్రొద్దుటూర్, బనగానపల్లె, గుంతకల్, ధర్మవరం, ఆత్మకూరు (K), రాయచోటి, తాడిపత్రి, ఎమ్మిగనూరు, జమ్మలమడుగు, ధోన్, కదిరి, రాయదుర్గ్ )

5) నెల్లూరు : 36 పోస్టులు
(ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : కందుకూరు, పీలేర్, మదనపల్లె, గిద్దలూరు, మార్కాపూర్, పలమనేరు, ఆత్మకూరు (N), నాయుడుపేట, పుత్తూరు, చీరాల, శ్రీకాళహస్తి, అద్దంకి )

(ప్రకటించిన పోస్టులకన్నా పెరగవచ్చు... తగ్గవచ్చు. ఎంపికైన అభ్యర్థుల ఆయా డివిజన్ల పరిధిలోనే నియమిస్తారు. తర్వాత మార్చుకోడానికి కుదరదు. అందువల్ల ఏ డివిజన్ కిందకి వస్తారో... అక్కడే అప్లయ్ చేసుకోవాలి )

(ఏయే డివిజన్ లో ఏయే రిజర్వేషన్ వర్గాలకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఈ పోస్ట్ కింద LIC వెబ్ సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. చూడగలరు)

రాష్ట్రంలోని ఐదు డివిజన్ల పరిధిలో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అభ్యర్థి ఏదైనా ఒక్క డివిజన్ కు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి.

విద్యార్హతలు:

ఏదేని యూనివర్సిటీ నుంచి ఏ బ్రాంచ్ లో అయినా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి (10+2+3 pattern).

( 01 సెప్టెంబర్ 2019 నాటికి డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి )

వయస్సు: (01.09.2019)

18 యేళ్ళు నిండి ఉండాలి. 30యేళ్ళు దాటరాదు.

(02.09.1989 కి ముందు పుట్టి ఉండరాదు. 01.09.2001 తర్వాత పుట్టి ఉండరాదు)

SC/ST లకు : 5యేళ్ళు

OBC లకు : 3 యేళ్ళు

దివ్యాంగులు (జనరల్) : 10యేళ్ళు

దివ్యాంగులు (SC/ST) : 15యేళ్ళు

దివ్యాంగులు (OBC): 13 యేళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం స్కేలు:

బేసిక్ పే Rs.14,435/- ( Graduation Increment, House Rent Alloowance & City compensatory Allowance అన్నీ కలిపి రూ.30 వేల దాకా వస్తాయి )

ప్రొబేషన్ పీరియడ్:

ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అవసరమైతే ఏడాది వరకూ ఈ పీరియడ్ ను పొడిగించే అవకాశముంది.

అప్లికేషన్ ఫీజు:

SC/ST/PwBD : Rs.85/- +GST + Transction Charges

For all other Candidates : Rs.510/- + GST + Transction Charges

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ ఎగ్జామ్:

ఆబ్జెక్టివ్ టైప్ లో ఆన్ లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది. టెస్టును మూడు సెక్షన్లుగా (వేర్వేరు టైమింగ్స్ ) నిర్వహిస్తారు.  (ఎగ్జామ్ ఇంగ్లీష్/హిందీ మీడియంలో మాత్రమే జరుగుతుంది )

1) ఇంగ్లీష్ లాంగ్వేజ్/హిందీ లాంగ్వేజ్ : 30 ప్రశ్నలు - 30 మార్కులు - 20 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 11, Others: 12 Marks)

2) న్యూమరికల్ ఎబిలిటీ : 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 13, Others: 14 Marks)

3) రీజనింగ్ ఎబిలిటీ : 35 ప్రశ్నలు - 35 మార్కులు - 20 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 13, Others: 14 Marks)

మొత్తం 100 ప్రశ్నలు - 100 మార్కులు - 1 గంట ( 60 నిమిషాలు )

ఇందులో ఇంగ్లీష్/హిందీ లాంగ్వేజ్ టెస్టును కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఫైనల్ ర్యాంకింగ్ లో కలపరు )

మెయిన్స్ కి ఎంపిక:

ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారి నుంచి పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:20 చొప్పున అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేస్తారు.  ఇందులో సెక్షన్ 1 క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకుంటే చాలు. సెక్షన్ 2, 3 కి మాత్రం అభ్యర్థులు, పోస్టుల సంఖ్య ఆధారంగా మెయిన్స్ కి ఎంపిక చేస్తారు

మెయిన్స్ ఎగ్జామ్:

మెయిన్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్ లైన్ లో మాత్రమే నిర్వహిస్తారు. టెస్టును మూడు సెక్షన్లుగా (వేర్వేరు టైమింగ్స్) నిర్వహిస్తారు. (ఎగ్జామ్ ఇంగ్లీష్/హిందీ మీడియంలో మాత్రమే జరుగుతుంది )

1) జనరల్ /ఫైనాన్షియల్ అవేర్ నెస్: 50 ప్రశ్నలు - 50 మార్కులు - 35 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 18, Others: 20 Marks)

2) జనరల్ ఇంగ్లీష్: 40 ప్రశ్నలు - 40 మార్కులు - 35 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 14, Others: 16 Marks)

3) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 50 ప్రశ్నలు - 50 మార్కులు - 40 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 18, Others: 20 Marks)

4) రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్: 60 ప్రశ్నలు - 60 మార్కులు - 40 నిమిషాలు
( Minimum marks: SC/ST/PwBD - 22, Others: 24 Marks)

మొత్తం ప్రశ్నలు: 200, మొత్తం మార్కులు : 200, సమయం : 2 గంటల 30 నిమిషాలు

NOTE: మెయిన్స్ ఎగ్జామ్ లో తప్పు జవాబుకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 (పావు వంతు) మార్కులను కట్ చేస్తారు. ఒకవేళ ఏవైనా ప్రశ్నలకు జవాబులు రాయకపోతే... వాటికి ఎలాంటి మార్కులను కట్ చేయరు

అభ్యర్థుల ఎంపికలో ప్రిలిమినరీ ఎగ్జామ్ లోని మార్కులను కలపరు. మెయిన్స్ లో వచ్చిన వాటిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ప్రతి సెక్షన్ లో కూడా క్వాలిఫైయింగ్ మార్కులు తప్పనిసరిగా పొంది ఉండాలి.  ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమానమైన మార్కులు పొందితే... ఎవరి విద్యార్హత ఎక్కువ ఉంటుందో వారికి మరియు వయస్సు ఎక్కువ ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్:

SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ లైన్ అప్లికేషన్లు సమర్పించిన తర్వాత ఆయాన డివిజినల్ ఆఫీసుల పరిధిలోని P & IR డిపార్ట్ మెంట్ లో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కోసం రిజిష్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ల ఆఖరు తేదీ తర్వాత మూడు రోజులలోపే అప్లయ్ చేయాలి. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో డివిజినల్ ఆఫీసు నిర్ణయించిన చోట ప్రీ ట్రైనింగ్ క్లాసులు హాజరు కావాలి.

ఎగ్జామినేషన్ సెంటర్స్:

తెలంగాణ: 1) హైదరాబాద్ (2) కరీంనగర్ (3) వరంగల్

ఆంధ్రప్రదేశ్: 1) కడప 2) మచిలీపట్నం 3) రాజమహేంద్రవరం 4) విశాఖపట్నం

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్లను ఆన్ లైన్ లో అప్లయ్ చేయడానికి: 17.09.2019 నుంచి 01.10.2019 వరకూ

ఆన్ లైన్ లో ఎగ్జామ్ రాయడానికి కాల్ లెటర్స్ డౌన్లోడ్ : 15.10.19 నుంచి 22.10.19 వరకూ

ఆన్ లైన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్: 21 & 22 అక్టోబర్ 2019

ఆన్ లైన్ లో మెయిన్స్ ఎగ్జామ్: తర్వాత ప్రకటిస్తారు

పూర్తి వివరాలకు :

ఈ కింది లింక్ ద్వారా LIC OF INDIA వెబ్ సైట్ లో ఉన్న నోటిఫికేషన్లను చూడగలరు

డివిజన్ల వారీగా నోటిఫికేషన్లు, పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయగలరు

 

NOTE:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లోని వివిధ జిల్లాలకు చెందిన వారు తమ జిల్లా వాట్సాప్ /Telegram గ్రూపుల్లో చేరగలరు.  ఎవరైనా వాట్సాప్ /Telegram గ్రూపుల్లో లింకులు కావాలంటే 703 6813 703 కి మెస్సేజ్ (Whatsapp/Telegram ద్వారా) చేయగలరు