MAY CURRENT AFFAIRS QUIZ -2

MAY CURRENT AFFAIRS QUIZ -2

1. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా బొల్లంపల్లి విజయసేన్ రెడ్డితో 2020 మే 2న హైకోర్టు సీజే జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.  తెలంగాణ హైకోర్టులో మొత్తం 24 జడ్జిపోస్టులు ఉండగా... ప్రస్తుతం CJ తో కలిపి ఎంతమంది ఉన్నారు ?

2. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు 2020 ఏప్రిల్ 24న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  ఈ ప్రాజెక్టుతో ఏయే జిల్లాలకు సాగు నీటి సదుపాయం కలుగుతుంది ?

3. 2020 ఏప్రిల్ 29 నాడు విజిలెన్స్ కమిషనర్ (CVC) గా నియమితులైనది ఎవరు ?

4. ఐక్యరాజ్యసమితిలో ఇండియాకి శాశ్వత ప్రతినిధిగా ఇటీవల నియమితులైనది ఎవరు ?

5. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు 2020 మే2న ప్రమాణం చేశారు. బొప్పూడి కృష్ణ మోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణం చేయించారు.  కొత్త జడ్జిల రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు చేరింది ?

6. లాక్ డౌన్ తో స్కూళ్ళు, కాలేజీలు మూతపడటంతో ఇంట్లోనే ఉంటున్న స్టూడెంట్స్, ఆన్ లైన్ లో పాఠాలు నేర్చుకునేందుకు క్వాలిటీ కంటెంట్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏది ?

7. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 42 నెలల పాటు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఇండియా మూడో స్థానానికి పడిపోయింది.  అయితే ప్రస్తుతం నెంబర్ 1 స్థానానికి చేరిన క్రికెట్ జట్టు ఏది ?

8. దూరదర్శన్ టెలికాస్ట్ చేసిన ఏ సీరియల్ కు 2020 ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది చూడటం ద్వారా వరల్డ్ రికార్డు సాధించింది ?

9. కొరడా దెబ్బలు, అవయవాల తొలగింపు లాంటి శిక్షలను రద్దు చేసిన గల్ఫ్ దేశం ఏది ?

10. సైనికబలం, నావిగేషన్ , మిలటరీ కమ్యూనికేషన్స్ పటిష్టత కోసం ఇటీవల తన తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ?