MAY CURRENT AFFAIRS QUIZ 6

MAY CURRENT AFFAIRS  QUIZ 6

1. లిపులేఖ్, కాలాపానీని 1962 నుంచి భారత సైన్యం ఆక్రమించిందనీ... అవి తమకు చెందినవే అంటూ ఏ దేశ పార్లమెంట్ తీర్మానం చేసింది ?

2. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా ఎప్పటి నుంచి దేశంలో ప్రతి రోజూ 200 రైళ్ళు నడపాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది ?

3. ఇటీవల వార్తల్లోకి వచ్చిన లాంగ్ మార్చ్ 5B రాకెట్  ఏ దేశానికి చెందినది ?

4. ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలు ప్రకటించినప్పుడు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలను కొత్తగా నిర్వచించారు. దాని ప్రకారం ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి ?

1) సూక్ష్మ తరహా కంపెనీలు: 1 కోటి పెట్టుబడి, రూ.5 కోట్ల టర్నోవర్

2) చిన్న తరహా కంపెనీలు: రూ.10కోట్ల  పెట్టుబడి, రూ.50 కోట్ల టర్నోవర్

3) మధ్యతరహా కంపెనీలు : రూ.50 కోట్ల పెట్టుబడి, రూ.200 కోట్ల టర్నోవర్

5. ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్ కు కీలకపదవి లభించింది.  WHO కార్యనిర్వాహక మండలి ఛైర్మన్ గా భారత్ ఎంపికైంది.  మూడేళ్ళ పాటు ఈ పదవి మన దేశానికి ఉంటుంది.  అయితే ఈ పదవిని భారత్ తరపున చేపట్టే వారు ఎవరు ?

6. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెను తుపాను పేరేంటి ?

7. ఏ దేశానికి చెందిన ప్రముఖ ఫుట్ వేర్ బ్రాండ్ వోన్ వెల్ ఎక్స్ ఓనర్ కాస ఎవర్జ్ తన షూ ప్రొడక్షన్ ను చైనా నుంచి భారత్ లోని యూపీకి తరలించనుంది (రూ.110 కోట్లు పెట్టుబడితో )

8. తెలంగాణ సోనా రకం బియ్యంతో అన్నం తింటే షుగర్ లెవల్స్ పెరగవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ఈ సోనాని పండిస్తున్నారు.  దీని అసలు పేరేంటి ?

9. కోవిడ్ 19 పై పరిశోధనకు భారత్ కు చెందిన ఏ కంపెనీ క్లోరిక్విన్ ఔషధాన్ని అమెరికాకి చెందిన క్రౌన్ కొలాబరేటివ్ ( కోవిడ్ 19 రీసెర్చ్ అవుట్ కమ్స్ వరల్డ్ వైడ్ నెట్వెర్క్ ) పరిశోధకుల బృందం ఉపయోగిస్తోంది ?

10. ఎన్ని రకాల పురుగు మందులు అత్యంత విషపూరితమైనవిగా ప్రకటిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ?