గ్రూప్ 1 పరీక్షలు మళ్ళీ పెట్టడం కుదరదు

గ్రూప్ 1 పరీక్షలు మళ్ళీ పెట్టడం కుదరదు

ఏపీలో గ్రూప్ 1 పరీక్షలను మళ్ళీ నిర్వహించాలన్న అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అంతకుముందు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్రంలో 169 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం APPC 2018 డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ ఎగ్జామ్ పేపర్లో 51 తప్పులు వచ్చాయనీ... నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వీరి పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి మళ్ళీ పరీక్ష నిర్వహణకు నిరాకరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీళ్ళను విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.