NOVEMBER CURRENT AFFAIRS

NOVEMBER CURRENT AFFAIRS

పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ హిందువులకు భారత పౌరసత్వం

  • CAA కింద కాకుండా 1955 నాటి చట్టం వీళ్ళకి భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
  • ప్రస్తుతానికి గుజరాత్ లోని రెండు జిల్లాల్లో అమలు చేయనున్నారు.
  • గుజరాత్ లోని ఆణంద్, మెహసానా జిల్లాల్లో నివసిస్తున్న హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేస్తారు.
  • వివాదాస్పద పౌర సత్వ సవరణ చట్టం (సీఏఏ) - 2019 ద్వారా కాకుండా.. వారికి 1955 నాటి పౌరసత్వ చట్టం కింద మన దేశంలో పౌరసత్వం ఇస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
  • పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్లో హింసకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు పౌర సత్వం ఇచ్చేందుకు CAA ను కేంద్రం తెచ్చింది.
  • CAA కు వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల హింసాత్మక నిరసనలు జరిగాయి. వాటిలో వంద మందికి పైగా మరణించారు.
  • దాంతో ఆణంద్, మెహసానాల్లో స్థిరపడ్డవారికి 1955 నాటి చట్టం కింద పౌరసత్వం ఇవ్వనున్నారు.
  • ఆయా వర్గాల వ్యక్తులు ఆన్లైన్ లో అప్లయ్ చేస్తే స్థానిక కలెక్టరు వాటిని పరిశీలించి పౌరసత్వ మంజూరుపై నిర్ణయం తీసుకోవచ్చు
  • 2014 డిసెంబరు 31లోపు పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినవా రికి తాజా నిర్ణయం ద్వారా ప్రయోజనం కల్పించాలని కేంద్రం భావిస్తోంది

 

బ్రెజిల్ అధినేతగా డ సిల్వా: జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్న లూయిజ్

  • బ్రెజిల్ లో కమ్యూనిస్ట్ భావజాలం గల మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా దేశాధ్యక్షుడు అయ్యారు.
  • ప్రస్తుత అధ్యక్షుడు అతిమితవాద జైర్ బోల్సొనారోను 20 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • 2023 జనవరి 1న ఆరోసారి డ సిల్వా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.
  • 1985లో బ్రెజిల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తరువాత ఇంత స్వల్ప తేడాతో అధ్యక్షుడు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.
  • గతంలో డ సిల్వా దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవినీతి, అక్రమ ధనం చలామణి చేశారన్న ఆరోపణలతో 580 రోజుల పాటు జైల్లో ఉన్నారు.
  • 2018 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోవడంతో బోల్సోనారో అధ్యక్ష పదవిని చేపట్టారు.
  • డి సిల్వా శిక్ష విధించిన జడ్జి.. ప్రాసిక్యూటర్లతో కలసిపోయి అన్యాయంగా తీర్పు చెప్పారని శిక్ష రద్దయింది.

BPCL తాత్కాలిక CMDగా రామకృష్ణ గుప్తా

  • భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా రామకృష్ణ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
  • ప్రస్తుతం డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఆయన ఉన్నారు.
  • 2022 అక్టోబరు 31న అరుణ్ కుమార్ సింగ్ పదవీ విరమణ చేయడంతో, BPCL సీఎండీ పదవి ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి తాత్కాలికంగా గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • ONC కి కూడా తాత్కాలిక CMD గా రామకృష్ణ గుప్తా ఉన్నారు.
  • కంపెనీ బోర్డులో సీనియర్ డైరెక్టర్ గా కొనసాగుతున్న గుప్తా 2031 జూన్ లో పదవీ విరమణ చేస్తారు.

'కర్ణాటక రత్న' దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్

  • ఇటీవలే చనిపోయిన కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' అవార్డు ప్రకటించింది.
  • బెంగళూరులోని విధానసౌధ ప్రాంగణంలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధానారాయణ మూర్తి, జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా పునీత్ భార్య అశ్వనీకి ఈ అవార్డును బహుకరించారు.
  • సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నింగిలోకి ఫాల్కన్ హెవీ రాకెట్

  • అమెరికాకు చెందిన Space X సంస్థ మూడేళ్ల తర్వాత మొదటి సారిగా తన భారీ 'ఫాల్కన్ హెవీ' రాకెట్ ను 2022 నవంబర్ 1నాడు నింగిలోకి ప్రయోగించింది. దీంతో కొన్ని సైనిక ఉపగ్రహాలను భూకక్ష్యలోకి పంపింది.
  • కేప్ కెనావెరాల్లోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
  • రాకెట్ మొదటి దశలోని 27 ఇంజిన్ల సౌండ్ దాదాపు 5 కిలోమీటర్ల దాకా వినిపించింది.
  • ప్రయోగించిన రెండు నిమిషాల తర్వాతయ ఫాల్కన్ రాకెట్ నుంచి రెండు బూస్టర్లు విడిపోయాయి. కేప్ కెనవెరాల్లో ల్యాండ్ అయ్యాయి. వీటిని తర్వాత ప్రయోగాల్లో వినియోగిస్తారు.
  • ఫాల్కన్ హెవీ రాకెట్ ను మొదటిసారిగా 2018లో ప్రయోగించారు.
  • ఆ తర్వాత 2019లో రెండుసార్లు అది ఆకాశంలోకి వెళ్ళింది

సౌరకుటుంబం కన్నా పెద్దదైన నక్షత్ర అవశేషం

  • ఇంధనం నిండుకోవడంతో పేలిపోయిన ఒక నక్షత్రానికి సంబంధించిన అవశేషాలను ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిధి సౌర కుటుంబం కన్నా 600 రెట్లు పెద్దగా ఉందని తెలిపారు.
  • 11వేల యేళ్ళ క్రితం ఆ నక్షత్రం పేలిపోయింది. చిలీలో ఉన్న VL సర్వే టెలిస్కోపు సాయంతో దీన్ని కనుగొన్నారు.
  • విస్ఫోటం వల్ల ఆ తార వెలుపలి పొరలు... రంగుల మేఘాలుగా విశ్వంలోకి వ్యాపించాయి. పేలుడుతో బలమైన ప్రకంపనలు వచ్చాయి.
  • ఆ నక్షత్రం మధ్య భాగం అధిక సాంద్రత కలిగిన న్యూట్రాన్ తారగా మారింది.
  • పేలడానికి ముందు ఈ నక్షత్రానికి సూర్యుడి కన్నా 8 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • పాలపుంత గెలాక్సీలో భూమికి 800 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

రూ.23,220 కోట్లు పెరిగిన ఎరువుల రాయితీ

  • రబీ సీజన్లో మొత్తం రూ.51,875 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
  • ఈ ఏడాది రబీ సీజన్ లో (అక్టోబరు 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకూ) ఎరువులపై రూ.51,875 కోట్ల రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • గత ఏడాది కంటే ఇది రూ. 23,220 కోట్లు ఎక్కువ. నత్రజనికి కిలోకు రూ.98,02, పాస్పరస్ కు రూ.83, పొటాష్ కు రూ.23.65, సల్ఫర్ కు రూ.6.12 సబ్సిడీ ఇస్తారు.
  • ఈ రబీలో దేశంలో తయారయ్యే ఎరువుల రవాణా సబ్సిడీ కలిపి మొత్తం రూ. 875 కోట్ల రాయితీ భారం కేంద్రం భరించనుంది.
  • వ్యవసాయ ఖర్చులను అదుపులో ఉంచాలన్న ఆలోచనతో ఎరువుల సబ్సిడీని ప్రభుత్వం 2010, ఏప్రిల్ 1 నుంచి పోషకాధారిత రాయితీ పథకం కింద అందిస్తోంది.
  • అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి ముడిసరకుల ధరలు విపరీతంగా పెరగడంతో DAP, P & K ఎరువులపై సబ్సిడీ భారం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

పెట్రోల్ లో ఇథనాల్ శాతం పెంపు

  • పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై అతిగా ఆధార పడకుండా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ప్రస్తుతం లీటరుకు 10% ఇధనాల్ ను కలుపుతుండగా... 2025-28 నాటికి ఈ మిశ్రమాన్ని 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
  • వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల దగ్గర 20% ఇథనాల్ తో ఉన్న పెట్రోల్ ను అందుబాటులోకి తెస్తారు.
  • అసలు 2022 నవంబరు నాటికే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం 10% ఉండేలా చూడాలి. అయితే 2022 జూన్ నాటికే ఈ లక్ష్యం చేరుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

RAF కు మొదటిసారిగా మహిళా IG అధికారులు

  • CRPF చరిత్రలో మొదటిసారిగా బిహార్ లోని RAF (అల్లర్ల నిరోధక దళం) విభాగానికి ఇన్ స్పెక్టర్స్ జనరల్ (ఐజీ)గా ఇద్దరు మహిళా అధికారులను నియమించారు.
  • 25 లక్షల మందితో అతి పెద్ద పారా మిలటరీ అయిన CRPFలో మహిళలను మొదటిసారిగా 1987లో అనుమతి కల్పించారు.
  • 35 ఏళ్ల తరువాత వారు IGలుగా ఉన్నత స్థానంలో నియమితులయ్యారు. ప్రస్తుతం CRPF విభాగాలకు మహిళా IPS అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు పని చేస్తున్నారు.

మహిళాహక్కుల నేత ఈలాభట్ కన్నుమూత

  • ప్రముఖ మహిళాహక్కుల నాయకురాలు, 'Self Employee Women’s Associationసెల్ఫ్ (SEWA) వ్యవస్థాపకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈలాభట్ (89) 2022 నవంబర్ 2న కన్నుమూశారు.
  • 50యేళ్ళ పాటు న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు.
  • మహిళా సాధికారతకు పనిచేయడంతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు.
  • 1933లో అహ్మదాబాద్ లో పుట్టిన ఈలాభట్ మహాత్ముడి ఆశయాలతో స్ఫూర్తి పొందారు.
  • అసంఘటిత రంగ మహిళల హక్కుల కోసం స్థాపించిన 'సేవా' సంస్థలో 20 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
  • స్థానిక 'గుజరాత్ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయ ఛాన్స్ లర్ గా నెల రోజుల కిందటి దాకా పనిచేసి, అనారోగ్యం. కారణంగా రాజీనామా చేశారు.
  • రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలిగా ఎంపికై ప్రణాళికా సంఘంలోనూ సేవలందించారు.
  • ఈలాభట్ రామన్ మెగసెసె, రైట్ లైవ్లీహుడ్, నివానో పీస్ ప్రైజ్, ఇంది రాగాంధీ శాంతి బహుమతులు అందుకున్నారు.