PRACTICE TEST -02 (భారత రాజ్యాంగం)
1) ప్రపంచంలో రాజ్యాంగం అనే భావనను మొదటగా ప్రతిపాదించింది ఎవరు ?
ఎ) అరిస్టాటిల్
బి) కౌటిల్యుడు
సి) బీ ఆర్ అంబేద్కర్
డి) బాబు రాజేంద్ర ప్రసాద్
2) భారత దేశంలో ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటీష్ పార్లమెంట్ కొన్ని చట్టాలను రూపొందించింది. వీటిని ఏమంటారు ?
ఎ) రెగ్యులేటింగ్ చట్టం
బి) ఇండియా చట్టం
సి) ఛార్టర్ చట్టం
డి) CRPC
3) ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏది ?
ఎ) భారత్
బి) బ్రిటన్
సి) అమెరికా
డి) రష్యా
4) 1773 చట్టం ప్రకారం సుప్రీంకోర్టును బ్రిటీష్ వారు ఎక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ) కలకత్తా
బి) ముంబై
సి) సూరత్
డి) ఆగ్రా
5) మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు ?
ఎ) విలియం బెంటింక్
బి) లార్డ్ కానింగ్
సి) మింటో
డి) వారన్ హేస్టింగ్స్
6) 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈస్టిండియా కంపెనీకి భారత్ లో వ్యాపారం చేసుకోడానికి బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం ఇచ్చంది ?
ఎ) 15 సం.
బి) 20 సం.
సి) 25 సం.
డి) 5 సం.
7) 1784 పిట్స్ ఇండియా చట్టాన్ని రూపొందించడంలో కీలకపాత్ర వహించింది ఎవరు ?
ఎ) కానింగ్
బి) విలియమ్ పిట్స్
సి) మింటో
డి) హేస్టింగ్స్
8) ఏ చట్టాన్ని మొదటి లిఖిత రాజ్యాంగం వ్యవహరిస్తారు ?
ఎ) పిట్ ఇండియా చట్టం- 1784
బి) ఛార్టర్ చట్టం - 1313
సి) ఛార్టర్ చట్టం - 1853
డి) రెగ్యులేటింగ్ చట్టం 1773
9) దేశంలోకి మొదటగా క్రిస్టియన్ మిషన్ రాకను ఆహ్వానించిన చట్టం ఏది ?
ఎ) 1813 ఛార్టర్ చట్టం
బి) ఛార్టర్ చట్టం - 1784
సి) ఛార్టర్ చట్టం - 1853
డి) రెగ్యులేటింగ్ చట్టం 1773
10) ఏ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారతదేశ గవర్నర్ జనరల్ గా మార్చారు ?
ఎ) పిట్ ఇండియా చట్టం- 1784
బి) ఛార్టర్ చట్టం - 1313
సి) ఛార్టర్ చట్టం - 1853
డి) ఛార్టర్ చట్టం-1833
11) ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు ఏ చట్టం ప్రకారం అవకాశం కల్పించారు ?
ఎ) ఛార్టర్ చట్టం 1793
బి) 1861 కౌన్సిల్ చట్టం
సి)ఛార్టర్ చట్టం 1833
డి) 1861 కౌన్సిల్ చట్టం
12) ఏ చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ పదవిని బ్రిటీష్ వైస్రాయిగా మార్చారు ?
ఎ) ఛార్టర్ చట్టం - 1313
బి) 1858 భారత ప్రభుత్వం చట్టం
సి) ఛార్టర్ చట్టం - 1853
డి) 1861 కౌన్సిల్ చట్టం
13) ఏ చట్టం అనుసరించి హైకోర్టు, శాసనమండలి, పోర్ట్ ఫోలియా విధానాలను అమలు చేశారు ?
ఎ) 1861 కౌన్సిల్ చట్టం
బి) 1858 భారత ప్రభుత్వం చట్టం
సి) ఛార్టర్ చట్టం - 1853
డి) ఛార్టర్ చట్టం-1833
14) 1909 భారత ప్రభుత్వ చట్టానికి మరో పేరేంటి ?
ఎ) కౌన్సిల్ చట్టం
బి) మింటో మార్లే సంస్కరణలు
సి) అట్లీ రాయబారం
డి) సైమన్ కమీషన్
15) ముస్లిమ్ లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఎవరి సిఫార్సులకు అనుగుణంగా ఏర్పాటు చేశారు ?
ఎ) కానింగ్
బి) బెంటింక్
సి) సైమన్ కమిషన్
డి) మింటో మార్లే
జవాబులు:
1) ఎ 2) సి 3) సి 4) ఎ 5) డి 6) బి 7) బి 8) డి 9) ఎ 10) డి 11) సి 12) బి 13) ఎ 14) బి 15) డి