RRB ఎగ్జామ్ ఫీజ్ రిఫండ్ వచ్చిందా ? రిఫండ్ రావాలంటే ఏం చేయాలి ?

అసిస్టెంట్ లోకో పైలట్/టెక్నీషియన్ పోస్టుల కోసం RRB నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి హాజరైన వారికి ఫీజు తిరిగి చెల్లిస్తున్నారు. మీకు ఫీజు రిఫండ్ కావాలంటే ఏం చేయాలి ఓసారి ఈ ఆర్టికల్ చదవండి.

RRB ALP/ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ 2018 కు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థుల ఫీజులను RRB రిఫండ్ చేస్తోంది. ఇందులో రిజర్వుడ్ అభ్యర్థులకు మొత్తం ఫీజును రిటర్న్ చేస్తోంది. అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించిన ఫీజును 50శాతం మినహాయించుకొని మిగతావి చెల్లిస్తోంది. అయితే మొదటి దశకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి హాజరైన వారికి మాత్రమే ఈ ఫీజును తిరిగి చెల్లిస్తారు. CBT ఎగ్జామ్ కి హాజరు కానివారికి ఎలాంటి ఫీజ్ రిఫండ్ ఉండదు. ఇప్పటిదాకా ఫీజు రిఫండ్ కాని వారికి SMS ద్వారా ఈనెల 17న అభ్యర్థులకు సమాచారం ఇవ్వనుంది.

అభ్యర్థులు RRB నోటిఫికేషన్ ప్రకారం అప్లయ్ చేసినప్పుడు చాలామంది తమ బ్యాంక్ వివరాలు సరిగా సమర్పించలేదని రైల్వే బోర్డు అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఫీజులను రిటర్న్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే అభ్యర్థులు బ్యాంక్ వివరాలు సమర్పించడానికి RRB మరో అవకాశం ఇస్తోంది. అందుకోసం రీజినల్ వెబ్ సైట్స్ లో ( rrb.gov.in) లో డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 25 వరకూ ప్రత్యేకంగా అప్లికేషన్ కాలమ్ ను ఓపెన్ చేస్తున్నారు.

అభ్యర్థులు అందులో తమ బ్యాంక్ ఖాతాతో పాటు IFSC లాంటి వివరాలను పొందుపరచాలి. ఇలా అప్లికేషన్లు వివరాలు ఇచ్చిన వారికి మాత్రమే ఫీజులను రిఫండ్ చేస్తారు. డిసెంబర్ 25 తర్వాత వచ్చే ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబోమని RRB అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 4న జరిగిన మొదటి దశ పరీక్షకు 36 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. బోర్డ్ ఇప్పటికే రిఫండ్ ప్రాసెస్ మొదలుపెట్టినా... చాలామంది బ్యాంకు డిటైల్స్ పూర్తి చేయకపోవడం, అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండటం, IFSC కోడ్స్ లేకపోవడం, కస్టమర్ ఐడీలు లాంటివి ఫిలప్ చేయకపోవడం సమస్యగా మారింది.

RRB ALP & Technicial 2018 రివైజ్డ్ రిజల్ట్, కొత్త షెడ్యూల్ ను ఈనెల 20న ప్రకటించనుంది. రెండో దశ ఎగ్జామ్ ను రీషెడ్యూల్ చేశారు. 2019 జనవరి 21, 22 23 తేదీల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 64,371 టెక్నీషియన్లు, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎగ్జామ్ ఫీజు రిఫండ్ కి సంబంధించిన వివరాలకు కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి:

RRB EXAM FEES REFUND