S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ

- రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది.
- 2018 అక్టోబర్ 5 నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
- ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు (రూ.36.9 వేల కోట్లు )
- S-400 క్షిపణులను భూతలం నుంచి ఆకాశంలోకి ప్రయోగిస్తారు
- ఈ వ్యవస్థతో ఒకేసారి 36 లక్ష్యాలపైకి 72 క్షిపణులను ప్రయోగించవచ్చు
- రష్యాకి చెందిన అల్మాజ్ యాంట్ సంస్థ ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థను రూపొందించింది.
- ఒక్కో వ్యవస్థలో రెండు రాడార్లు, మిస్సైల్ లాంచర్లు, కమాండ్ పోస్టులు ఉంటాయి.
- ఒక్కో రాడార్ 100 నుంచి 300 లక్ష్యాలను ఒకే టైమ్ లో గుర్తించగలదు. దాదాపు 600 కిమీ దూరం నుంచే శత్రు క్షిపణులు, ఇతర ప్రయోగాల జాడని కనిపెడుతుంది. 400కిమీ దూరం నుంచి లక్ష్యంపై గురిపెడుతుంది.
- రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా కంపెనీలతో రక్షణ వ్యాపారాలు చేసే మిత్ర దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. దీన్ని భారత్ లెక్క చేయలేదు.
- అమెరికా విధించే ఆంక్షల కోసం చేసిన చట్టం కాట్సా ( కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్జరీస్ త్రూ సాంక్షన్స్)
- గగన్ యాన్ కి సహకారం అందించేందుకు ఇస్రో - రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ లమధ్య ఒప్పందం కుదిరింది