వాళ్ళకి అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ !!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈమధ్యే డైలీ విత్ డ్రా లిమిట్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. SBI క్లాసిక్, Maestro డెబిట్ కార్డు కలిగిన వినియోగదారులు గతంలో రోజుకి రూ.40వేలు విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంటే... ఇప్పుడు రూ.20వేలకు కుదించింది. అయితే కొందరు కస్టమర్లకి ATMల్లో అన్ లిమిటెడ్ విత్ డ్రా ఛాన్స్ కల్పించింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు... గత నెలలో యావరేజ్ బ్యాలెన్స్ రూ.25వేలు మెయింటైన్ చేసినవారికి ఈ సదవకాశం కల్పించింది.

ఇప్పటిదాకా SBI లో ఉన్న సౌకర్యాలు

మామూలుగా SBI సేవింగ్స్ ఖాతాదారులు నెలలో ఎనిమిది సార్లు ATM నుంచి విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. ఇందులో 5సార్లు SBI ఏటీఎంల్లో, 3 సార్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో విత్ డ్రా చేసుకోవచ్చు. మెట్రో సిటీస్ లో 8 సార్లు ఛాన్స్ ఉంటే... నాన్ మెట్రో సిటీల్లో 5 + 5 చొప్పున 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు.

అంతకుమించి విత్ డ్రా చేసుకుంటే ఒక్కో లావాదేవీకి రూ.5 (+GST) నుంచి రూ.20 (+ GST) ఛార్జ్ చేస్తోంది.

రూ.25వేల మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే 10 సార్లు వరకూ స్టేట్ బ్యాంక్ గ్రూప్ ATM ల్లో విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఇచ్చింది.

ఇక నెలవారిగా సరాసరి లక్ష రూపాయలను మెయింటైన్ చేస్తే ఇతర బ్యాంకుల ATM ల నుంచి కూడా ఎన్ని సార్లయినా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉన్నది.

ఇక శాలరీ అకౌంట్స్ కి కూడా SBI ATMలతో పాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో కూడా అన్ లిమిటెడ్ గా విత్ డ్రా చేసుకునే సౌకర్యం ఇచ్చింది.