SBI, HDFC డెబిట్ కార్డులపై ఛార్జీల మోత
మీరు SBI లేదా HDFC డెబిట్ కార్డుల వాడుతున్నారా... అయితే మీకు ఛార్జీల మోత తప్పదు. ATM విత్ డ్రా నుంచి పిన్ జనరేషన్ దాకా ఈ రెండు బ్యాంకులు ఛార్జీలు పెంచేశాయి.
నోట్ల రద్దు తర్వాత డిజిటలైజేషన్ పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. అయితే మన దేశంలో సామాన్యులు మాత్రం ఇంకా డెబిట్ కార్డుతో ATM ల్లో డబ్బులు విత్ డ్రా చేసి వాడుతున్నారు. 2018 సెప్టెంబర్ తో గడచిన అర్థ సంవత్సరంలో డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచి 798.65 మిలియన్ల లావాదేవీలు జరగ్గా... మొత్తం రూ.2,690.60 బిలియన్లు విత్ డ్రా చేసుకున్నారు. అంటే డెబిట్ కార్డులు మనం ఎంతగా ఉపయోగిస్తున్నామన్నది ఈ లెక్కలు చెబుతున్నాయి. మన జీవితాలతో ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్థమవుతుంది.
అయితే ఈ రెండు బ్ట్యాంకుల డెబిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తే మీ జేబులకు చిల్లులు పెడే ప్రమాదముంది. దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తో పాటు HDFC ఇప్పుడు డెబిట్ కార్డు వాడే వాళ్ళపై భారీగా ఛార్జీలు విధించబోతున్నాయి. కార్డు జారీ నుంచి విత్ డ్రాతో పాటు ATM పిన్ జనరేషన్ కి కూడా ఛార్జీల మోత తప్పేలా లేదు.
మీరు SBI కార్డు వాడే వాళ్ళయితే
గోల్డ్, ప్లాటినం డెబిట్ కార్డుల జారీకి వంద రూపాయల నుంచి 306 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. వీటికి సర్వీస్ ట్యాక్స్ అదనంగా విధిస్తారు. ఇక డెబిట్ కార్డు వార్షిక నిర్వహణా ఖర్చుల కింద (రెండో ఏడాది నుంచి )
క్లాసిక్ అయితే వంద రూపాయలు
సిల్వర్, గ్లోబల్, గోల్డ్ డెబిట్ కార్డులకైతే రూ.150
ప్లాటినమ్ కార్డుకైతే రూ.200
ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకైతే రూ.300 వసూలు చేస్తారు. వీటికి సర్వీసు ఛార్జీలు అదనంగా విధిస్తారు.
మీరు మీ SBI డెబిట్ కార్డును మార్చాలనుకున్నారనుకోండి. రూ.204 వసూలు చేస్తారు (సర్వీస్ ట్యాక్సులతో కలిపి), అలాగే డూప్లికేట్ పిన్ లేదా మరో పిన్ జనరేట్ చేయాలంటే రూ.51 (సర్వీస్ ట్యాక్సులతో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది.
sbi సేవింగ్స్ ఖాతాదారులు ఇతర atm ల్లో ఒక నెలలో 5 సార్లు వరకూ ఎలాంటి రుసుం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత జరిగే ప్రతి లావాదేవీకి రూ.17 (సర్వీస్ ట్యాక్స్ తో కలిపి) పెనాల్టీ వేస్తారు. నాన్ ఫైనాన్షియల్ లావాదేవీల చేస్తే ఒక్కో transactionకి 6 రూపాయలు (సర్వీస్ ట్యాక్స్ కలిపి) వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ sbi వీటికి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు.
sbi pos టెర్మినల్స్ లో రూ.2వేల లోపు కొనుగోళ్ళు జరిపితే 0.75శాతం లేదా 10 రూపాయలు (ఏదీ ఎక్కువైతే అది). రూ.2వేలకు మించితే 1శాతం వసూలు చేస్తారు.
ఇతర బ్యాంకుల pos ల్లో sbi డెబిట్ కార్డు ఉపయోగిస్తే 2.5శాతం లేదా 10 రూపాయలు ట్రాన్సక్షన్ ఛార్జ్ వసూలు చేస్తారు (ఏది ఎక్కువైతే అది).
HDFC బ్యాంక్ కూడా ఇలాగే భారీగా ఛార్జీల మోత మోగిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.