Saturday, December 5

ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్స్

ఇంటర్మీడియట్ విద్యార్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్  5,846 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ ఉద్యోగాలకి సెప్టెంబర్ 7 వరకూ ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోడానికి అవకాశం ఉంది.

మొత్తం పోస్టులు: 5,846

కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (Male) : 3,433

కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (Female): 1,944

కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (Male Ex.Servicemen) : 226

కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ( Commondos) : 234)

విద్యార్హతలు: 

ఇంటర్మీడియట్ అర్హత.

వయస్సు:

1జులై 2020 నాటికి 18 నుంచి 25యేళ్ళ లోపు వయస్సు ఉండాలి.

పురుష అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ నిర్వహించే నాటికి LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీలో వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.100

(SC/ST/Women/pwd అభ్యర్థులకి ఫీజు నుంచి మినహాయింపు)

ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్

ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్

మెడికల్ టెస్ట్

రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు. ప్రతి తప్పు జవాబుకి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్: 50 ప్రశ్నలు

రీజనింగ్ : 25 ప్రశ్నలు

న్యూమరికల్ ఎబిలిటీ : 15 ప్రశ్నలు

కంప్యూటర్ బేసిక్స్: 10 ప్రశ్నలు

ప్రశ్నలు 10వ తరగతిలో స్థాయిలోనే ఉంటాయి.  అన్ని ప్రశ్నలూ ఆబ్జెక్టివ్ మెథడ్ లోనే కంప్యూటర్ బేస్డ్ గా రాయాలి.

PHYSICAL EFFIENCY:

ఎత్తు  : 170 సెం.మీ (పురుషులు)  - 157 సెం.మీ (మహిళలు)

1.6.కిమీ రేస్: 6 నిమిషాలు (పు), 8 నిమిషాలు (మ)

లాంగ్ జంప్ : 14 అడుగులు (పు), 10 అడుగులు (మ)

హైజంప్ : 3.9 అడుగులు (పు), 3 అడుగులు (మ)

ముఖ్యమైన తేదీలు:

అప్లయ్ చేయడానికి చివరి తేది: 7 సెప్టెంబర్ 2020

ఆన్ లైన్ పరీక్షలు 27 నవంబర్ నుంచి డిసెంబర్ 14 దాకా

పరీక్షా కేంద్రాలు:

తెలంగాణ:  హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి: https://ssc.nic.in/