Saturday, December 5

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.   కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో LDC, JSA ( Junior Secretariat Asst), DEO(Data Entry Operator) లాంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తారు.

ఎన్ని పోస్టులు ?

ఈ ఏడాది పోస్టుల సంఖ్య ప్రకటించలేదు.  అయితే గత ఏడాది 4,893 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి... ఈసారి కూడా 4 వేల నుంచి 5 వేల పోస్టుల దాకా ఖాళీలు ఉండే అవకాశముంది.

అర్హతలు:

LDC/JSA/PA/SA/DEO పోస్టులకు ఏదైనా గ్రూప్ తో ఇంటర్ /తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు

: 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి

(02.01.1994 లోపు పుట్టి ఉండరాదు 01.01.2003 తర్వాత పుట్టి ఉండరాదు)

SC/ST లకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. OBC లకు 3యేళ్ళు, దివ్యాంగులకు 10యేళ్ళు సడలింపు ఉంటుంది

ఎంపిక ప్రక్రియల ఎలా ఉంటుంది ?

టైర్ 1, 2, 3 అనే 3 దశల్లో పరీక్షలను నిర్వహిస్తారు.

టైర్ 1 :

మల్టీపుల్ ఛాయిస్ విధానంలో 200 మార్కులకు  ఆన్ లైన్ టెస్ట్

100 ప్రశ్నలు – 60 నిమిషాలు టైమ్

ఇంగ్లీష్ లాంగ్వేజ్ : 25 ప్రశ్నలు – 50 మార్కులు

జనరల్ ఇంటెలిజెన్స్ : 25 ప్రశ్నలు – 50 మార్కులు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్  25 ప్రశ్నలు – 50 మార్కులు

జనరల్ అవేర్ నెస్ : 25 ప్రశ్నలు – 50 మార్కులు

ప్రతి రాంగ్ ఆన్సర్ కి 0.50 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది

ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే క్వొశ్చన్ పేపర్ ఉంటుంది

టైర్ 1 లో మెరిట్ సాధించిన వారిని టైర్ 2 కి ఎంపిక చేస్తారు.  టైర్ 2 లో డిస్క్రిప్టివ్  టెస్ట్ ఉంటుంది.  ఇందులో కూడా ఎంపికైతే స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ రాయాలి.

ఫీజు :

రూ.100. SC/ST/Ex-Servicemen/Women లకు ఫీజులేదు

అప్లయ్ చేయడానికి చివరి తేది: 15 డిసెంబర్ 2020

ఫీజులు చెల్లించడానికి చివరి తేది: 17 డిసెంబర్ 2020

పరీక్ష తేది: 2021 ఏప్రిల్ 12 నుంచి 27 లోపు జరుగుతుంది.

పూర్తి వివరాలకు: www.ssc.nic.in

పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

:Notice_chsl_06112020

SSC CHSL 2020 ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్, గైడెన్స్ ను Telangana Exams you tube ఛానెల్ ద్వారా అందిస్తాం. అలాగే ఎవరైనా ఈ ఎగ్జామ్ కి మాక్ టెస్టులు, లైవ్ క్లాసులు కావాలనుకుంటే... Telangana Exams plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.  నేషనల్ లెవల్ లో వివిధ కోచింగ్ సంస్థలు అందించే కోర్సులను మీరు subscribe చేసుకోవచ్చు