SSC Recruitment 2021: 3,261 ఉద్యోగాలు.. దరఖాస్తుకు 7 రోజులే గడువు

SSC Recruitment 2021: 3,261 ఉద్యోగాలు.. దరఖాస్తుకు 7 రోజులే గడువు

SSC Recruitment 2021:  స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో 3,261 ఉద్యోగాలు.. దరఖాస్తుకు వారం రోజులే గడువు

Ssc నోటిఫికేషన్(Notification) ద్వారా వేర్వేరు విభాగాల్లో SSC ఖాళీల‌ను భ‌ర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా  ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఆఖరు తేదీ: అక్టోబ‌ర్ 25, 2021 లాస్ట్ డేట్.

ఫీజు చెల్లించేందుకు ఆఖరి గడువు: అక్టోబ‌ర్ 28, 2021 రాత్రి 11.30 వ‌ర‌కు

ఫీజు ఎలా చెల్లించాలి: బ్యాంక్ ద్వారా చ‌లాన్ రూపంలో చెల్లించాలి

ఎప్పటి వరకకు చెల్లించాలి: న‌వంబ‌ర్ 1, 2021 వ‌ర‌కు లాస్ట్ డేట్

ఎంపిక విధానం: ప‌రీక్ష ద్వారా నిర్వ‌హిస్తారు.

ప‌రీక్ష ఎప్పుడుంటుంది: జ‌న‌వ‌రి 2022,ఫిబ్ర‌వరి 2022లో జ‌రిగే అవ‌కాశం

దర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత ప‌రీక్ష తేదీలు విడుద‌ల చేస్తారు.

ఎంపిక విధానం..
ఈ పోస్టుల భ‌ర్తీకి ప్రాథ‌మికంగా కంప్యూట‌ర్ బెస్డ్ (Computer Based Exam) ప‌రీక్ష ఉంటుంది.

ప‌రీక్ష స‌మ‌యం ఎన్ని నిమిషాలు: 60 నిమిషాల పాటు ఉంటుంది.
అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్ర‌శ్న‌లుంటాయి.

పోస్టును బట్టి, విద్యార్హ‌త‌ను బ‌ట్టి మూడు ప‌రీక్ష‌ల వ‌ర‌కు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది

ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు ఆచితూచి స‌మాధానం రాయాలి. తప్పు దొర్లితే ప్ర‌శ్న‌కు 0.50 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఈ ప‌రీక్షలో ఉత్తీర్ణులైన వారిని నైపుణ్యం(Skill) ఆధారంగా ప‌రీక్ష‌కు పిలుస్తారు. ఎంపిక విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌ పోస్టుల ఆధారంగా జాబు ఉంటుంది.

సబెక్టు: జనరల్ ఇంటిలిజెన్స్ : 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

జనరల్ అవెర్నెస్:  25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

ఇంగ్లీష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి.

విద్యార్హతలు, వయో పరిమితి ఇలా ఉండాలి:

విద్యార్హతలు పోస్టుల వారీగా మారుతూ ఉంటుంది. 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. 12వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో కొన్ని ఉద్యోగాలుంటాయి. అయితే హయ్యర్ గ్రేడ్ పోస్టులకు గ‌రిష్టంగా విద్యార్హ‌త (డిగ్రీ) గ్రాడ్యుయేషన్‌గా నిర్ణయించారు.

అయితే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి క‌నీస వ‌య‌సు 18 సంత్స‌రాలు నిండి ఉండాలి. చాలా పోస్టుల‌కు గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్లుగా ఉంది. అయితే ఆయా విభాగాలలో రిజ‌ర్వేష‌న్‌ల ప్ర‌కారం వ‌యోప‌రిమితి స‌డ‌లింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకోనే విధానం: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సంద‌ర్శించాలి. అందులో NOTICESలోకి వెళ్లి..OTHERS విభాగంలో నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి.తరువాత హోం పేజీకి వ‌చ్చి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొద‌లు పెట్టాలి.మొద‌ట వ‌న్‌టైం రిజ‌స్ట్రేష‌న్ చేసుకోవాలి.

ఈ విధంగా ఆన్ లైన్ చేయాలి

  1. అభ్య‌ర్థి ప్రాథ‌మిక విద్యార్హ‌త‌, పాస్‌పోర్టు ఫోటో, సంత‌కం అప్‌లోడ్ చేసి ఫాం స‌బ్‌మిట్ చేయాలి.
  2. ఈ ప్ర‌క్రియ అనంత‌రం అభ్య‌ర్థికి రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌, పాస్ వ‌ర్డ్ వ‌స్తాయి.
  3. రెండో భాగంలో రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ పాస్ వ‌ర్డ్ తో లాగిన్ అవ్వాలి.
  4. అనంత‌రం ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి స‌మాచారం, ఫీజు చెల్లించి స‌బ్మిట్ చేయాలి.
  5. ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ. SC, ST, PWD(పీడ‌బ్ల్యూడీ), ESM(ఈఎస్ఎం) క్యాట‌గిరీ అభ్య‌ర్థుల‌కు, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు.