టార్గెట్ SBI ప్రొబేషనరీ ఆఫీసర్లు !

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించాలని చాలామంది కలలు కంటుంటారు. ప్రభుత్వం తీసుకుంటున్న నగదు రహిత లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలతో రాబోయే కాలంలో బ్యాంకులు తమ ఖాతాలను విస్తరించనున్నాయి. దాంతో బ్యాంక్ ఉద్యోగాల ఖాళీల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అందులోనూ దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో PO గా పోస్టు సంపాదించడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలామంది.
రూ.27,620ల జీతంతో కెరీర్ మొదలవుతుంది. వీటికి DA, HRA/Lease Rental/CCA, Medical Allowance, Other Allowances కూడా తోడవుతాయి. మొత్తమ్మీద Yearly CTC రూ.8.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.13.08 లక్షలు దాకా ఉంటుంది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. SBI PO ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
ఎగ్జామ్ ఎలా ఉంటుంది ?
మొత్తం 3 దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
Phase 1 : ప్రిలిమ్స్ ఎగ్జామ్ ( 100 మార్కులు)
Phase 2 : మెయిన్స్ ఎగ్జామ్ ( 250 మార్కులు )
Phase 3 : ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్ (50 మార్కులు )
* ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ ఆన్ లైన్ లోనే నిర్వహిస్తారు.
Phase 1 : ప్రిలిమ్స్ ఎగ్జామ్ ( 100 మార్కులు)
ఇందులో 100 మార్కులకు గంటపాటు ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ -2 ఎగ్జామ్ కు ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. దీని మార్కులను మెయిన్స్ లో కలపరు.
ప్రిలిమ్స్ లో మూడు సెక్షన్లు ఉంటాయి
1) ఇంగ్లీష్ లాంగ్వేజ్ (2) క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ (3) రీజనింగ్ ఎబిలిటీ
(1) ఇంగ్లీషులో 30 మార్కులు - 30 ప్రశ్నలు (20 నిమిషాలు)
(2) క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ - 35 మార్కులు- 35 ప్రశ్నలు (20 నిమిషాలు)
(3) రీజనింగ్ ఎబిలిటీ - 35 మార్కులు - 35 ప్రశ్నలు (20 నిమిషాలు)
మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు 1గంట టైమ్ ఉంటుంది.
Note: ఈ ఏడాది ఆయా టాపిక్స్ కి సంబంధించి ఖచ్చితంగా టైమ్ కేటాయించారు. ఆలోగా మాత్రమే వాటిని కంప్లీట్ చేయాలి. ఈ మార్పును గమనించగలరు.
1) ENGLISH : Expected Syllabus
1) Fill in the blanks (5 Qns)
2) Comprehension : 5-10 Questions
3) Close Test (5-10 qns)
4) Para Jumbles ( 5 qns)
5) Error Spotting(5-10 Qns)
6) Sentence/Paragraph Completion (5 Qns)
7) Phrase Replacemenet/Sentence Correction - (5 Qns)
8) Misc. (Antonym/Synonym, Phrase &Idioms, Spellings etc., ): 5 Qns
2) QUANTATIVE APTITUDE (35 Marks):
1) Simplification - 5-10 Qns
2) Number system : 0-1 Qns
3) Average : 1-2 Qns
4) Percentage : 1-2 Qns
5) Ratio & Proportion : 1-2 Qns
6) Simple Interest & Compound Interest - 1-2 Qns
7) Number Series: 4-5 Qns
8) Profit & Loss - 1-2 Qns
9) Speed, Distance & Time : 1-2 Qns
10) Algebra : 5 Qns
11) Mensuration : 1-2 Qns
12) Data Interpretation : 0-5 Qns
13) Time & Work - 1-2 Qns
14) Permutation & Combination : 0-3 Qns
15) Mixture problems : 1-2 Qns
16) Probability : 0-1 Qn
17) Date Sufficiency : 0-5 Qns
18) Misc. (Problems on Age, boat & Stream):0-3 Qns.
3) REASONING ABILITY : 35 MARKS
1) Inequality : 5 Qns
2) Order & Ranking :5 Qns
3) Direction sense : 2-5 Qns
4) Coding & Decoding/ Alphabet based problems: 5 Qns
5) Blood Relations : 2-3 Qns
6) Syllogism : 4-5 Qns
7) Sitting Arrangements & Puzzle: 5-10 Qns
8) Machine Input - 0-5 Qns
9) Misc.(Series etc.,) : 0-3 Qns
* ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ కు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా మూడు సెక్షన్లలోనూ పాస్ మార్కులు రావాలి. ఖాళీగా ఉన్న పోస్టులకు 1:10 చొప్పున అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తారు.
Phase 2 : మెయిన్స్ ఎగ్జామ్ ( 250 మార్కులు )
* మెయిన్ ఎగ్జామ్ - 200 మార్కులకు ఆబ్జెక్టివ్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. మొత్తం 250 మార్కులు. ఇది కూడా ఆన్ లైన్ లోనే నిర్వహించబడుతుంది.
* నాలుగు సెక్షన్లుగా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది:
1) Reasoning & Computer Aptitude,
2) Data Analysis and Interpretation
3) General Economics & Banking Awareness
4) English Language
ఎగ్జామ్ మొత్తం 3 గంటలు ఉంటుంది.
PAPER - 1
1) Reasoning & Computer Aptitude:
45 ప్రశ్నలు, 60 మార్కులు, 60 నిమిషాలు
2) Data Analysis and Interpretation
35 ప్రశ్నలు, 60 మార్కులు, 45 నిమిషాలు
3) General Economics & Banking Awareness
40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాలు
4) English Language
35 ప్రశ్నలు, 40 మార్కులు, 40 నిమిషాలు
మొత్తం : 155 ప్రశ్నలు, 200 మార్కులు, 3 గంటల టైమ్
PAPER -2
* ఇందులో డిస్క్రిప్టివ్ టెస్ట్ ను 30 నిమిషాల వ్యవధిలో ఇంగ్లీషులో రాయాలి (Letter Writing & Essay). 50 మార్కులు ఉంటాయి.
* డిస్క్రిప్టివ్ టెస్ట్ లో అభ్యర్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.
* తప్పుగా సూచించిన జవాబులకు 1/4 మార్కులను తగ్గిస్తారు.
* ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ లోనూ ఈ మార్కుల తగ్గింపు విధానం ఉంటుంది.
Phase 3 : ఇంటర్వ్యూ & గ్రూప్ డిస్కషన్ (50 మార్కులు )
మెయిన్స్ ఎగ్జామ్ లోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల్లో అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే బ్యాంకులు తమ ప్రియారిటీ ప్రకారం ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ కు పిలుస్తాయి.
గ్రూప్ డిస్కషన్ - 20 మార్కులు
ఇంటర్వ్యూ - 30 మార్కులు
మార్కుల వెయిటేజ్:
* అభ్యర్థి మెయిన్స్ ఎగ్జామ్ (Phase 2) లో సాధించిన మార్కులకు 75శాతం వెయిటేజ్ ఇస్తారు
* గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో 25శాతం వెయిటేజ్ ఇస్తారు.
( All the best - Vishnu kumar .M, Senior Journalist )