Wednesday, October 23

టెట్ పేపర్ – 1కి బీఈడీ అర్హత

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ ) పేపర్ 1 రాసేందుకు ఇకపై బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులే. ఒకటి నుంచి ఐదో తరగతి చెప్పేందుకు వీరికి అర్హత ఉంటుంది. బీఎడ్ అభ్యర్థులు కూడా SGT పోస్టులకు అర్హులేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేయడంతో ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా దీనికి సంబంధించిన మార్పులు చేసింది. దీనిపై విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం టెట్ పేపర్ -1 రాయాలంటే 50శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45శాతం మార్కులు సరిపోతుంది. ఇంటర్ తో పాటు 2యేళ్ళ డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4యేళ్ళ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ( స్పెషల్ ఎడ్యుకేషన్ ) పూర్తి చేసి ఉండాలి. వీళ్ళతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. 2010 ఆగస్టు 23 నాటికి NCTE నోటిఫికేషన్ కు ముందుగా DLEd., DEd., కోర్సులు పాసైన వారు కూడా అర్హులే.