Wednesday, October 23

2018 JANUARY TOP CURRENT AFFAIRS

01) 2018 జనవరిలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: విజయ్ కేశవ్ గోఖలే (సీనియర్ దౌత్యవేత్త)
02) డెబిట్ కార్డులతో ఎంతమొత్తం కొనుగోళ్ళ వరకూ ఛార్జీలను కేంద్రం ఎత్తి వేసింది ?
జ: రూ.2000 (జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది )
03) మొదటిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకున్న జట్టు ఏది ?
జ: విదర్భ జట్టు
04)ప్రధానమంత్రి అధికారిక వెబ్ సైట్ www.pmindia.gov.in ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది ?
జ: 13 భాషల్లో
05)సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపునకు ఉద్దేశించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీంతో భారతప్రధాన న్యాయమూర్తి వేతనం ఎంతకు పెరిగిందిది
జ: రూ.2.80 లక్షలు ( గతంలో రూ.1లక్ష )
06) నాబార్డ్ మూలధనాన్ని ఎంతకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది ?
జ: రూ.30 వేల కోట్లు ( గతంలో రూ.5 వేల కోట్లుగా ఉండేది)
07) ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.10 నోటు మీద ఏ దేవాలయం బొమ్మ ఉంది ?
జ: కోణార్క్ దేవాలయం

08) 2022లో జాతీయ క్రీడలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు ?
జ: మేఘాలయ
09) విద్యాశాఖకు చెందిన ఏ రెండు పథకాలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
10) పసిఫిక్ సముద్రంలో వస్తున్న సునామీలను పరిశోధనలు చేస్తున్న భారత్ కు చెందిన సంస్థ ఏది
జ: భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్ కాయిస్ - హైదరాబాద్ )
11) డ్రామా టెలివిజన్ సిరీస్ లో ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఎవరు ?
జ: స్టెర్లింగ్ కె బ్రౌన్
12) హాప్ మన్ కప్ టోర్నమెంట్ 2018 ను ఏ దేశం గెలుచుకుంది ?
జ: స్విట్జర్లాండ్
13) ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయ సంతతి పార్లమెంటేరియన్ల తొలి సదస్సు జనవరి 2018 లో ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ. ప్రధాని నరేంద్ర మోడీ
(మొత్తం 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు)
14) ప్రతి యేటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?
జ: జనవరి 25
15) దేశంలో రెండో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
(నోట్: మొదటిది పుణేలో ఉంది. దీనికి ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఛైర్మన్ గా ఉన్నారు )
16) జనవరి 2018 లో నిర్మాణ రంగం, సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఎంత వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది
జ: వంద శాతం
17) పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకాన్ని ( MP LADS) ను ఎప్పటి వరకూ కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ?
జ: 31.3.2020 వరకూ
18) 2018 లో భారత్ వ్రుద్ధి ఎంత శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ?
జ: 7.3 శాతం
19) కృత్రిమ మేధపై అవగాహన, నైపుణ్యానికి హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎక్స్ లెన్స్ ను ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది ?
జ: నాస్కామ్
(నాస్కమ్ ప్రెసిడెంట్: ఆర్ చంద్రశేఖర్ )
20) 1984లో సిక్కులపై జరిగిన అల్లర్లపై 186 కేసులపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన సిట్ కు ఎవరు నేతృత్వం వహిస్తారు ?
జ: జస్టిస్ ధింగ్రా