Friday, February 28

2018 JANUARY TOP CURRENT AFFAIRS -2

21) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా అందించే రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
జ: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ( తావు అనే పుస్తకానికి)
22) భారతీయ భాషలన్నింటినీ సులభంగా నేర్చుకునేందుకు భారతి అనే లిపిని తయారు చేసిన ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ ఎవరు ?
జ: డాక్టర్ బి.శ్రీనివాస్ చక్రవర్తి
23) భారత్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది ?
జ: ప్రత్యూష్
24) ఆధార్ కార్డ్ యొక్క వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ?
జ: 16
25) ఢిల్లీలోని తీన్ మూర్తి చౌక్ పేరును ఏ విధంగా మార్చారు ?
జ: తీన్ మూర్తి హైఫా చౌక్
26) ప్రపంచ తయారీ రంగ సూచీలో భారత్ కు ఎన్నో స్థానం లభించినట్టు ప్రపంచ ఆర్థిక సమాఖ్య (WEF) ప్రకటించింది ?
జ: 30వ స్థానం
27) NSCDEX కమోడిటీస్ మార్కెట్లో చోటు దక్కించుకున్న కూరగాయల గింజలు ఏవి ?
జ: జిగురు ఇచ్చే గోరు చిక్కుడు ( గౌర్ సీడ్ /క్లస్టర్ బీన్స్)
28) హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య కార్యకర్తగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) 2018 కేలండర్ పై చోటు దక్కించుకున్న భారతీయురాలు ఎవరు ?
జ: గీతా వర్మ ( కర్సోగ్ తహసీల్ గ్రామం)
29) వివాదస్పదమైన పద్మావత్ సినిమా ఎట్టకేలకు 2018 జనవరి 25న రిలీజ్ అయింది. దీనికి దర్శకుడు ఎవరు ?
జ: సంజయ్ లీలా బన్సాలీ
30) పొగ మంచు, వాయు కాలుష్య నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద వాయు శుద్ది పరికరాన్ని ఎక్కడ నిర్మించారు ?
జ: గ్జియాన్ ( చైనా)
31) అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి AGNI-5ని మన శాస్త్రవేత్తలు ఐదోసారి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఎన్నివేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు
జ: 5 వేల కిమీ
32)దేశంలో అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం ఏ పేరుతో స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు
జ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
33)భూగర్భ జలాల పెంపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం పథకం ఏది ?
జ: అటల్ భూ జల్ యోజన
34) తక్కువ ఖర్చుతో సాఫీగా జీవనం సాగించేందుకు అనువైన దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: రెండో స్థానం
(నోట్: మొదటి స్థానం దక్షిణాఫ్రికాకి దక్కింది )
35) ప్లాస్టిక్ రహదారుల సృష్టికర్త (ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా)కి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఆయన ఎవరు ?
జ: ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్
36) ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి (భారత సంతతి మహిళ) ఎవరు
జ: నిక్కీ హేలీ
27) ఆసియాన్ దేశాలతో అనుబంధం పెంచుకోవడంలో భాగంగా ఆ దేశాల ప్రముఖులకు ఎన్ని పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు ?
జ: 10 (దేశానికి ఒకటి చొప్పున)