Sunday, August 25

గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో వాలంటీర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 24 నుంచి జులై 5 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వుల్లో తెలిపారు. స్థానికులకే అవకాశం కల్పిస్తారు.

గ్రామ వాలంటీర్లకు సంబంధించిన వెబ్ సైట్

http://gramavolunteer.ap.gov.in/VVAPP/VV/index.html

విద్యార్హతలు:

గిరిజన ప్రాంతాల్లో 10 వ తరగతి
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్
పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ

వయస్సు :

2019 జూన్ 30 నాటికి 18 నుంచి 35 యేళ్ళు ఉండాలి

ఇతర అర్హతలు:

దరఖాస్తు దారుడు అదే పంచాయతీలో నివాసం ఉండాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి.

దరఖాస్తుల స్వీకరణ: జూన్ 24 నుంచి జులై 5 వరకూ

జులై 10 నుంచి దరఖాస్తుల పరిశీలిన

జులై 11 నుంచి 25 వరకూ ఇంటర్వ్యూలు

ఎంపికైన వారికి ఆగస్టు 1న నియామక పత్రాలు

2019 ఆగస్టు 5 నుంచి 10 వరకూ వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు.

వాలంటీర్లు 2019 ఆగస్టు 15 నుంచి విధులు నిర్వహించాలి

గౌరవ వేతనం కింద నెలకు రూ.5000వేలు చెల్లిస్తారు.

 

నోటిఫికేషన్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

volunteer notification